![India Continue Strong Show on Online Chess Olympiad - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/10/hampi.jpg.webp?itok=5WmN7X6k)
చెన్నై: ‘ఫిడే’ ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ గురువారం ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అగ్ర స్థానంలోకి దూసుకెళ్లింది. మాజీ ప్రపంచ చాంపియన్, గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నేతృత్వంలోని భారత్ నాలుగో రౌండ్లో 5–1తో చైనాపై, ఐదో రౌండ్లో 4–2తో అజర్‌బైజాన్‌పై, ఆరో రౌండ్లో 3.5–2.5తో బెలారస్‌పై విజయం సాధించింది.
చైనాతో జరిగిన మ్యాచ్‌లో కోనేరు హంపి ఓడిపోగా... పెంటేల హరికృష్ణ సహా మరో నలుగురు గెలుపొందారు. అజర్‌బైజాన్‌తో జరిగిన పోరులో హంపి గెలుపొందగా, ఆనంద్, ద్రోణవల్లి హారిక ‘డ్రా’ చేసుకున్నారు. బెలారస్‌తో మ్యాచ్‌లో ఆనంద్, భక్తి కులకర్ణి విజయం సాధించారు.
చదవండి: సౌరవ్ గంగూలీపై ‘బయోపిక్’
Comments
Please login to add a commentAdd a comment