రన్నరప్ ఆనంద్
షామ్‌కిర్ (అజర్‌బైజాన్): వుగార్ గషిమోవ్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో ఆనంద్ ఆరు పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) ఏడు పాయిం ట్లతో విజేతగా అవతరించాడు. కరువానా (ఇటలీ)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 36 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.
10 మంది మేటి గ్రాం డ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్‌లపాటు జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ అజేయంగా నిలిచాడు. ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఈ ప్రపంచ రెండో ర్యాంకర్ మిగతా మూడు గేముల్లో గెలుపొందాడు.