రన్నరప్ ఆనంద్
న్యూఢిల్లీ: కార్సికన్ సర్క్యూట్ నాకౌట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రన్నరప్‌గా నిలిచాడు. ఫ్రాన్‌సలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 14 మంది గ్రాండ్‌మాస్టర్లు, ఇద్దరు అంతర్జాతీయ మాస్టర్లు పాల్గొన్నారు. రెండు గేమ్‌ల ఫైనల్లో ఆనంద్ 0.5-1.5తో మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్‌స) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో ఆనంద్ 1.5-0.5తో తెమూర్ రద్జబోవ్ (అజర్‌బైజాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 1.5-0.5తో టిగ్రాన్ ఘరామియాన్ (ఫ్రాన్‌స)పై, తొలి రౌండ్‌లో 2-0తో కొయెన్ లీహుట్స్ (ఫ్రాన్‌స)పై గెలుపొందాడు.
భారత్‌కు నాలుగు పతకాలు
జార్జియాలో జరిగిన ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్ షిప్‌లో భారత్‌కు నాలుగు పతకాలు లభించారుు. అండర్-12 ఓపెన్ విభాగంలో ప్రజ్ఞానంద, అండర్-10 ఓపెన్ విభాగంలో వి.ప్రణవ్ కాంస్య పతకాలు... అండర్-12 బాలికల విభాగంలో దివ్య దేశ్‌ముఖ్ కాంస్యం, అండర్-10 బాలికల విభాగంలో మృదుల్ దేహాంకర్ రజత పతకం సాధించారు.