
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ తండ్రి విశ్వనాథన్ (92 ) ఇక లేరు. స్వల్ప అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. మాజీ జనరల్ మేనేజర్ (సదరన్ రైల్వే) విశ్వనాథన్‌కు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన ఆనంద్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంతో విశ్వనాథన్ పాత్ర ఎంతో ఉంది. తన పరిమితమైన సాలరీతోనే ఆనంద్‌కు ఏలోటూలేకుండా చూసుకున్నారు. దేశ విదేశాల్లో పలుపోటీల్లో పాల్గొనేలా శ్రద్ధ వహించారు. నిరాడంబరమైన జీవితం, ఉన్నత విలువలను పాటించిన ఆయన తన కుమారుడు ఆనంద్ కూడా అదే బాటలో పయనించేలా కృషి చేశారు. ఆనంద్ చెస్‌లో ఈ స్థాయికి చేరడంలో విశ్వనాథన్ పాత్ర ఎంతో ఉందని ఆనంద్ భార్య అరుణ ఆనంద్ చెప్పారు. అదృష్టవశాత్తూ ఆనంద్ అన్ని వరల్డ్ చాంపియన్‌షిప్ విజయాలను విశ్వనాథన్ కళ్లారా చూశారన్నారు.. తన భర్త ఉన్నతికి ఆయన ఎపుడూ గర్వపడేవారని, అలాగే చివరివరకు ప్రౌడ్ రైల్వే ఉద్యోగిగా ఉన్నారని ఆమె నివాళులర్పించారు. కాగా ఆనంద్ తల్లి సుశీలా విశ్వనాథన్ 2015, మేలో మరణించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment