
చెన్నై: భారత సూపర్ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ రాసిన ‘మైండ్ మాస్టర్’ పుస్తకం శుక్రవారం విడుదలైంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ‘ది హిందు’ పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్ లాంఛనంగా ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ‘మీరు చెస్ రొమాంటిక్ అయితే ఈ ఆట అందాన్ని ఆస్వాదిస్తారు. ఈ కంప్యూటర్ల యుగంలోనూ చెస్ ఆట అనుభూతే వేరు. కంప్యూటర్లు కూడా అంతే అనంతమైన సాధ్యాల్ని సాకారం చేస్తాయి’ అని అన్నాడు. తన పుస్తకంలో చెస్ గడులతో పాటు కంప్యూటర్‌కూ చోటిచ్చానని దీంతో ఎలాంటి మార్పులు సంభవించాయో పేర్కొన్నట్లు చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment