చెస్ ఆడేందుకు పిల్లలు కావాలన్న స్టార్!
Published Wed, Apr 13 2016 6:23 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM
ముంబై: తనకు చెస్ అంటే బాగా ఇష్టమని బాలీవుడ్ సూపర్స్టార్ ఆమీర్ ఖాన్ అన్నారు. 'నా చిన్నతనంలో మా నాయనమ్మ నాకు చెస్ ఆడటం నేర్పింది. చెస్ ఆడటానికి నాకు చాలా మంది పిల్లలు కావాలని ఉంది. చెస్ వల్ల పిల్లల మైండ్, ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది' అని అభిప్రాయపడ్డాడీ స్టార్ హీరో.
'నా జీవిత కాలంలో నేను ఎక్కువగా మక్కువ చూపించిన ఆట చెస్. నాతో ఆట ఆడేవారి కోసం చూడటం నాకు అలవాటు' అని చెస్ క్రీడాకారుడు విశ్వనాథ్ ఆనంద్కు హృదయ్నాథ్ అవార్డును ప్రదానం చేయడానికి వెళ్లిన ఈవెంట్లో ఆమీర్ వ్యాఖ్యనించారు. దేశ వ్యాప్తంగా ఉన్న పిల్లలు ఎక్కువగా ఆడాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.
ఆనంద్కు తానొక పెద్ద ఫ్యాన్నని ఆమీర్ చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ చెస్ ప్లేయర్లలో ఆనంద్ ఒకరని దేశం గర్వించే విధంగా ఆనంద్ విజయాలు ఉన్నాయని అన్నారు. గత మేలో మహారాష్ట్ర చెస్ లీగ్ సందర్భంగా ఆమీర్ ఆనంద్తో కలిసి చెస్ ఆడారు. చెస్ మీద ఏదైనా సినిమా చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు.
Advertisement
Advertisement