Aamir
-
స్టార్ హీరోయిన్ చెల్లెలితో డేటింగ్.. తొలిసారి స్పందించిన నటుడు!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పరిచయం అక్కర్లేని పేరు. కానీ ఆమె చెల్లెలు షమితా శెట్టి కొద్దిమందికే తెలుసు. బాలీవుడ్లో మొహబత్తీన్ మూవీ ఎంట్రీ ఇచ్చిన భామ తెలుగులోనూ పిలిస్తే పలుకుతా చిత్రంలో నటించింది. అంతే కాకుండా హిందీ బిగ్‌బాస్‌లో పాల్గొన్న సందడి చేసింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఓ చిత్రంలో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మపై బీ టౌన్లో డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు అమీర్ అలీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని గాసిప్స్ గుప్పమంటున్నాయి. ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్లో కనిపించడంతో ఈ వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే తాజాగా ఈ వార్తలపై అమీర్ అలీ స్పందించారు. (ఇది చదవండి: నా భర్త నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్) అమీర్ అలీ మాట్లాడుతూ..' నేను ఒంటరిగా ఉన్నానంటే డేటింగ్లో ఉన్నట్లు కాదు.. నేను ఎవరితోనైనా బయటకు వెళ్లినప్పుడు ఇలాంటి వార్తలొస్తున్నాయి. నేను నా స్నేహితులతో కలిసి డిన్నర్ కోసం బయటకు వెళ్తాం. అంతే కాదు నా ఫ్రెండ్ బర్త్‌డే వేడుకల కోసం రెస్టారెంట్‌కు వెళ్లాం. అదే సమయంలో నా స్నేహితురాలు షమితాశెట్టి కూడా వచ్చింది. అదే సమయంలో నేను ఆమెను డ్రాప్ చేయడానికి వెళ్లా. అంతే మరుసటి రోజే నా ఫ్రెండ్ ఫోన్ మీరు ఆమెతో డేటింగ్లో ఉన్నట్లు విన్నానంటూ చెప్పాడు. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. మేము ఇప్పటికీ మంచి స్నేహితులం. నేను ఇలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోను. నేను వాటి గురించి ఆలోచిస్తే జీవితంలో ముందుకెళ్లలేను.' అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ జంటపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు అమీర్ అలీ. కాగా.. అమీర్ అలీ 'ఎఫ్ఐఆర్', 'ఢిల్లీ వలీ ఠాకూర్ గర్ల్స్', 'సరోజినీ-ఏక్ నయీ పెహల్' వంటి షోలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా నాచ్ బలియే, 'జరా నచ్కే దిఖా 2' లాంటి రియాలిటీ షోలలో పాల్గొన్నాడు. అతను తన మొదటి భార్య సంజీదా షేక్‌తో విడాకులు తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే అమీర్ షమితా శెట్టితో కనిపించడంతో డేటింగ్ పుకార్లు వ్యాపించాయి. తాజాగా కామెంట్స్‌తో రూమర్స్‌కు చెక్ పెట్టాడు. (ఇది చదవండి: ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది) View this post on Instagram A post shared by Shamita Shetty (@shamitashetty_official) -
ఆగస్టు ఫస్ట్.. తొమ్మిది మందికీ బర్త్‌డే ఫెస్ట్
ఎవరైనా ఇద్దరికి ఒకేరోజున బర్త్‌డే వస్తే.. భలే కదా అనిపిస్తుంది. అదే ముగ్గురు, నలుగురి పుట్టినరోజు ఒకే రోజున ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఒకే కుటుంబంలో అందరి బర్త్‌డే ఒకే రోజున అయితే.. అదీ ఒకరిద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది పుట్టినది ఒకే తేదీన అయితే.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం అవుతుంది. మరి అలాంటి ఓ ‘రికార్డు’ ఫ్యామిలీ గురించి తెలుసా? పుట్టినరోజు పెళ్లి చేసుకుని.. పాకిస్తాన్‌లోని లర్కానా ప్రాంతానికి చెందిన మంగి అమీర్ అలీ, ఆయన భార్య ఖుదీజా.. ఇద్దరి పుట్టిన రోజు ఆగస్టు ఒకటో తేదీనే. దీంతో వారు 1991లో ఆగస్టు ఒకటో తేదీనే పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా ఏడాదికి ఆగస్టు ఒకటినే వారికి పాప పుట్టింది. తమ పుట్టినరోజునే పాప పుట్టడంపై అమీర్, ఖుదీజా ఆశ్చర్యపోయినా.. సంబురంగా ఆమెకు సింధు అని పేరుపెట్టుకున్నారు. కొన్నేళ్లకు సాసూ, సప్నా అనే కవల అమ్మాయిలు.. తర్వాత విడివిడిగా అమీర్, అంబర్ అనే ఇద్దరు అబ్బాయిలు.. ఆ తర్వాత అమర్, అహ్మర్ అనే కవల అబ్బాయిలు పుట్టారు. వీరంతా పుట్టినది ఆగస్టు ఒకటో తేదీనే కావడం విశేషం. అంతేకాదు.. ఏదో సిజేరియన్ ఆపరేషన్లతో ఇలా ఒకేరోజు పుట్టారనడానికీ లేదు. అంతా సహజ ప్రసవాలేనట. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ఈ కుటుంబం సర్టిఫికెట్లు, ప్రభుత్వ రికార్డులు అన్నీ పరిశీలించేసి.. వీరిని గిన్నిస్‌బుక్ లోకి ఎక్కించేశారు. ‘‘ఇలా ఒకే తేదీన అందరూ జన్మించడం మాకు భగవంతుడు ఇచ్చిన బహుమతి. ఏటా అందరం కలసి ఒకే కేక్ కట్ చేస్తాం. ఒకరికొకరు అందరం శుభాకాంక్షలు చెప్పుకొంటాం..’’ అని అమీర్ పేర్కొన్నాడు. ఇంతకుముందు అమెరికాలో.. ఒకే కుటుంబానికి చెందిన ఎక్కువ మంది బర్త్‌డే ఒకే రోజు ఉన్న రికార్డు ఇంతకుముందు అమెరికాకు చెందిన కమ్మిన్స్ కుటుంబం పేరిట నమోదైఉంది. 1952–66 మధ్య అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కలిపి ఐదుగురు ఫిబ్రవరి 20వ తేదీనే పుట్టారు. ఇప్పటివరకు కూడా అదే రికార్డుగా నిలవగా.. అమీర్ అలీ కుటుంబం దాన్ని బద్దలు కొట్టింది. రెండు కవల జంటల రికార్డు కూడా.. అమీర్ కుటుంబంలో సాసూ–సప్నా కవలలు, అమర్–అహ్మర్ కవలలు అంతా ఒకే తేదీన జన్మిం చారు. ఇలా ఒకే తల్లికి ఒకే తేదీన రెండు సార్లు కవలలు పుట్టడం కూడా విశేషమే. ఇంతకుముందు ప్రపంచవ్యాప్తంగా నాలుగు సార్లు మాత్రమే ఇలాంటి జననాలు నమోదవడం గమనార్హం. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
బాలీవుడ్ నటుడితో శిల్పా శెట్టి సోదరి డేటింగ్. నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్
బాలీవుడ్ నటి షమితా శెట్టి అంటే చాలామందికి తెలియదు. శిల్పా శెట్టి సోదరి అంటే చాలామందికి వెంటనే గుర్తుకొస్తుంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి 'పిలిస్తే పలుకుతా' చిత్ర౦తో తెలుగు సినిమారంగంలో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ పెద్ద ఎత్తున వైరలవుతున్నాయి. ఆమె బాలీవుడ్ నటుడు అమీర్ అలీతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేశాయి. అయితే వీటిపై తాజాగా ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చింది. అలాంటిదేం లేదంటూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం తాను సింగిల్‌గానే చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. నా అభిప్రాయాలను పంచుకునేందుకు ఇదే సరైన సమయమని చెప్పుకొచ్చింది. ఏదైనా చెప్పే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఇటీవల అమీర్ అలీతో షమితా శెట్టి ఓ వీడియో ముద్దులు పెట్టుకోవడంతో అది కాస్తా వైరలైంది. షమితా శెట్టి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'సమాజంలో ఇలాంటి మనస్తత్వంతో నేను అయోమయంలో ఉన్నాను. రియాలిటీ ఏంటో తెలుసుకోకుండా ఎలా చెప్తారు. ఇది నెటిజన్ల భావనలకు నిదర్శనం. అందుకే నేను నోరు విప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం సింగిల్‌గానే హ్యాపీగా ఉన్నా. వీటిపై కాకుండా ఈ దేశంలోని మరిన్ని ముఖ్యమైన సమస్యలపై దృష్టి పెట్టండి.' కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది బాలీవుడ్ భామ. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
కాంట్రాక్టు లేదు... వాట్సాప్ గ్రూప్‌లో ఉండేది లేదు
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి కాంట్రాక్టు దక్కని క్రికెటర్లు ఆమిర్, హసన్ అలీ చీఫ్ సెలక్టర్ కమ్ కోచ్ మిస్బా ఉల్ హక్ ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ నుంచి వైదొలిగారు. లాక్డౌన్ పరిస్థితుల్లో ఆటగాళ్లకు ఫిట్నెస్, శిక్షణ తదితర తాజా సమాచారాన్ని చేరవేసేందుకు, క్రికెటర్లతో టచ్‌లో ఉండేందుకు ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. అయితే కాంట్రాక్ట్ దక్కలేదనే అసంతృప్తితోనే వాళ్లిద్దరు గ్రూప్ నుంచి నిష్క్రమించినట్లు సమాచారం. ఇటీవల పీసీబీ 18 మంది క్రికెటర్లకు కాంట్రాక్టు ఇచ్చింది. అయితే కాంట్రాక్టు జాబితాలో లేని ఆటగాళ్లను కూడా టీమ్ సెలక్షన్‌కు పరిగణిస్తామని చీఫ్ సెలక్టర్ మిస్బా వివరణ ఇచ్చాడు. -
ప్రేమ చిహ్నంతో.. ఐఏఎస్ లవ్‌బర్డ్స్
సాక్షి, న్యూఢిల్లీ : ఐఏఎస్ ప్రేమపక్షులు అమీర్ ఉల్ షఫీ, టీనా దాబీ గుర్తుండే ఉంటుంది. ఎన్నో వివాదాల నడుమ ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ప్రేమకు చిహ్నమైన తాజ్మహాల్తో సరదాగా ఫోటోలకు పోజులిచ్చారు. వారు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులతో వారి ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘ శాశ్వతమైన ప్రేమకు అద్భుతమైన శ్మారక చిహ్నమైన తాజ్‌మహాల్ వద్ద నా హుబ్బీతో’’ అని వారు షేర్ చేసిన ఫోటోలకు కామెంట్ పెట్టారు. వారి విహహం అనంతరం తొలిసారి విజిటింగ్‌కు బయటకు వచ్చినట్లు ఆమె తెలిపారు. తాజ్ మహాల్, ఫతేపూర్ సిక్రీ వంటి ప్రదేశాలను వారు సోమవారం సందర్శించారు. 2015 సివిల్స్ టాపరైన టీనా దాబీ తన జూనియర్ అయిన అమీర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు ఐఏఎస్ అఫీసర్లు కావడంతో వారి కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. కానీ వీరి పెళ్లికి మాత్రం పలు హిందూ సంఘాలు తీవ్రం అభ్యంతరం వ్యక్తం చేశాయి. టీనా ఐఏఎస్ టాపరై ఉండి ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటని విశ్వ హిందూ మహా సభ బహిరంగంగానే విమర్శించిన విషయం తెలిసిందే. అయినా అవేవి పట్టించుకుకోని ఆ జంట 2018లో అమీర్ స్వస్థలమైన కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో వివాహంతో ఒకటైయారు. -
ఎంజీఆర్ పాండియన్ అంటున్న ఆమిర్
తమిళసినిమా: పాత సక్సెస్ఫుల్ చిత్రాల పేర్లతో తాజాగా చిత్రాలు తెరకెక్కడం అన్నది సాధారణం. ఆ మధ్య శివకార్తికేయన్ రజనీ మురుగన్ అంటూ వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా రామ్, పరుత్తివీరన్ వంటి సంచలన చిత్రాల దర్శకుడు ఆమిర్ నటుడిగా రంగప్రవేశం చేసి చా లా కాలమే అయ్యింది. ఆయన తాజాగా రాజ కీయ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రంలో కథా నాయకుడిగా నటించడానికి రెడీ అవుతున్నా రు. దీనికి ప్రఖ్యాత నటుడు, రాజకీయ చరిత్రకారుడు ఎంజీఆర్ పేరుతో సూపర్‌స్టార్ నటిం చిన సక్సెస్ఫుల్ చిత్రం పాండియన్ పేరును జోడించి ఎంజీఆర్ పాండియన్ అనే టైటిల్‌ను నిర్ణయించడం విశేషం. దీన్ని మూన్ పిక్చర్స్ పతాకంపై ఆదం బావ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇందులో ఆమిర్‌కు జంటగా ‘555’ చిత్రం ఫేమ్ చాందిని నాయకిగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో ఆనందరాజ్, పోన్వన్నన్, గంజాకరుప్పు, రాజసిమ్మన్, ఇమాన్‌అన్నాచ్చి, పావాలక్ష్మణన్, వి న్సెంట్రాయ్ నటిస్తున్నారు. విద్యాసాగర్ సంగీతం, దేవరాజ్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది సమకాలీన రాజకీయాలకు అద్దం పట్టే చిత్రంగా ఉంటుం దన్నారు. అమైదిపడై చిత్రం తరువాత ఆ తరహా రాజకీ య నేపథ్యంలో సాగే చి త్రంగా ఉంటుందని తెలి పారు. చిత్రాన్ని తేని, మదు రై, చెన్నై ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. -
నిజమే... మహాభారతమే!
ఇంతకు ముందోసారి హిందీ హీరో ఆమిర్‌ఖాన్‌ను కలసినప్పుడు మహాభారతం గురించే మాట్లాడానని దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు. హిందీ హిట్ ‘దంగల్’ ప్రచార కార్యక్రమాలకు హైదరాబాద్ వచ్చిన ఆమిర్‌ను ఇదే అంశమై ప్రశ్నించగా... ‘‘రాజమౌళిని ఓసారి కలిశా. కానీ, సినిమా గురించి ఏం మాట్లాడలేదు’’ అన్నారు. ఒకవేళ రాజమౌళి కలల సినిమా ‘మహభారతం’లో ఛాన్స్ వస్తే నటిస్తారా? అని ఆమిర్‌ను అడగ్గా... ‘‘కృష్ణుడిగా నటించడానికి ఇష్టపడతా’’ అన్నారు. అమితాబ్ బచ్చన్, మోహన్‌లాల్, ఆమిర్‌ఖాన్ ముఖ్య పాత్రధారులుగా సుమారు 600 కోట్లతో మహాభారతాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది. దీనిపై తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ఇంతకు ముందు చెప్పినట్టు మహాభారతాన్ని చిత్రంగా తీయాలనుంది. తప్పకుండా చేస్తా. కానీ, ‘బాహుబలి’ తర్వాత మాత్రం కాదు. ‘మహా భారతం’ అనేది క్లాసిక్, ఓ ఎపిక్. నాకు టైమ్ కావాలి. ఆమిర్‌ఖాన్‌తో ‘మహాభారతం’ గురించి చర్చించిన మాట వాస్తవమే. ఈ సినిమా చేయాలని ఆయన కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు’’ అన్నారు. -
చెస్ ఆడేందుకు పిల్లలు కావాలన్న స్టార్!
ముంబై: తనకు చెస్ అంటే బాగా ఇష్టమని బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమీర్ ఖాన్ అన్నారు. 'నా చిన్నతనంలో మా నాయనమ్మ నాకు చెస్ ఆడటం నేర్పింది. చెస్ ఆడటానికి నాకు చాలా మంది పిల్లలు కావాలని ఉంది. చెస్ వల్ల పిల్లల మైండ్, ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది' అని అభిప్రాయపడ్డాడీ స్టార్ హీరో. 'నా జీవిత కాలంలో నేను ఎక్కువగా మక్కువ చూపించిన ఆట చెస్. నాతో ఆట ఆడేవారి కోసం చూడటం నాకు అలవాటు' అని చెస్ క్రీడాకారుడు విశ్వనాథ్ ఆనంద్‌కు హృదయ్నాథ్ అవార్డును ప్రదానం చేయడానికి వెళ్లిన ఈవెంట్లో ఆమీర్ వ్యాఖ్యనించారు. దేశ వ్యాప్తంగా ఉన్న పిల్లలు ఎక్కువగా ఆడాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఆనంద్‌కు తానొక పెద్ద ఫ్యాన్‌నని ఆమీర్ చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ చెస్ ప్లేయర్లలో ఆనంద్ ఒకరని దేశం గర్వించే విధంగా ఆనంద్ విజయాలు ఉన్నాయని అన్నారు. గత మేలో మహారాష్ట్ర చెస్ లీగ్ సందర్భంగా ఆమీర్ ఆనంద్‌తో కలిసి చెస్ ఆడారు. చెస్ మీద ఏదైనా సినిమా చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు. -
40 మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు షాక్
బాలీవుడ్ ప్రముఖులకు ముంబై పోలీసులు ఇస్తున్న సెక్యూరిటీ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న 40 మంది బాలీవుడ్ సినీ ప్రముఖుల్లో చాలామందికి సెక్యూరిటీ అవసరం లేనందున వారికి ప్రస్తుతం ఇస్తున్న సెక్యూరిటీని తొలగిస్తున్నట్టు ప్రకటించారు. కేవలం 15 మందికి మాత్రమే సెక్యూరిటీ ఇవ్వనున్నారు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ టాప్ హీరోలు ఆమిర్ ఖాన్, షారూక్ ఖాన్ లాంటి వారు కూడా ఉన్నారు. 2013లో మైనేమ్ ఈజ్ ఖాన్ సినిమా విడుదల సమయంలో షారూఖ్ ఖాన్‌కు భద్రత పెంచారు. రెండు నెలల క్రితం మత అసహనంపై వ్యాఖ్యల సందర్భంగా అమీర్ ఖాన్ భద్రతను కూడా పటిష్టం చేశారు. అయితే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగే అవకాశం లేకపోవడంతో ఈ ఇద్దరు టాప్ హీరోలకు ఇచ్చిన భద్రతను కుదించారు. ఇకపై ఆయుధాలు ధరించిన ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే వీరికి రక్షణ కల్పించనున్నారు. భారీ స్థాయిలో సిబ్బందిని సెలబ్రిటీల భద్రతకే కేటాయించటం వల్ల తమకు సిబ్బంది కొరత ఎదురవుతోందని భావించిన పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. బాలీవుడ్ ప్రముఖులు విదు వినోద్ చోప్రా, రాజ్ కుమార్ హిరానీ, ఫరాఖాన్, కరీం మొరానీ లాంటి కొందరికి ఉన్న భద్రతను పూర్తిగా తొలగించగా అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, లతామంగేష్కర్ లాంటి ప్రముఖులకు గతం ఇచ్చినట్టుగానే భద్రతను కొనసాగించనున్నారు. -
పాక్ క్రికెట్లో పంచాయతీ
► ఆమిర్ రాకపై సీనియర్ల ఆగ్రహం ► క్యాంప్‌ను బహిష్కరించిన హఫీజ్, అజహర్ లాహోర్: పేస్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ పునరాగమనం పాకిస్తాన్ క్రికెట్లో చిచ్చు పెట్టింది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఐదేళ్ల నిషేధం పూర్తి చేసుకున్న అనంతరం ఆమిర్ ఇటీవలే మళ్లీ పోటీ క్రికెట్ బరిలోకి దిగాడు. అయితే అతని రాకపై ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్, వన్డే జట్టు కెప్టెన్ అజహర్ అలీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాంతో వారిద్దరు పాక్ జట్టు జాతీయ శిబిరంకు తాము హాజరు కాలేమంటూ బహిష్కరించారు. న్యూజిలాండ్ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా 26 మంది క్రికెటర్లతో పాక్ బోర్డు నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంప్‌కు ఆమిర్‌ను ఎంపిక చేశారు. సోమవారం ప్రారంభమైన ఈ క్యాంప్‌కు దేశవాళీ క్రికెట్ కారణంగా తొలి మూడు రోజులు హఫీజ్, అజహర్ రాలేదు. గురువారం జట్టుతో చేరాల్సిన వీరిద్దరు డుమ్మా కొట్టినట్లు మేనేజర్ ఆగా అక్బర్ నిర్ధారించారు. అజహర్ అలీ నేరుగా కారణం చెప్పేయగా, హఫీజ్ ఏమీ చెప్పకుండానే తన నిరసన ప్రకటించాడు. ‘ఆమిర్ అక్కడ ఉన్నంత వరకు నేను శిబిరానికి హాజరు కాను. దీనిపై అవసరమైతే పీసీబీతో చర్చిస్తా. హఫీజ్ గురించి నేను మాట్లాడను కానీ బహుశా అతను కూడా ఇదే కారణంతో తప్పుకొని ఉండవచ్చు’ అని అజహర్ స్పష్టం చేశాడు. -
దేశానికి నువ్వేమిచ్చావు: రవీనా టాండన్
ఢిల్లీ: మత అసహనంపై ఆందోళన వ్యక్తం చేసిన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్‌పై నటి రవీనా టాండన్, బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ మండిపడ్డారు. నరేంద్ర మోదీని ప్రధానిగా చూడలేని వ్యక్తులు, ఇప్పుడు ప్రభుత్వాన్ని దించేయాలనుకుంటున్నారని నటి రవీనాటాండన్ పేర్కొన్నారు. రవీనా టాండన్ ట్వీట్ల సారాంశం ఇలా ఉంది.. ''మోదీని ప్రధానిగా చూడకూడదని అనుకునేవాళ్లంతా ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటున్నారు. వాళ్లు దేశానికి సిగ్గుచేటు. అసహనాన్ని ఖండించాలని, దానిపై చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ చెప్పొచ్చు. కానీ, ఇలా విషం చిమ్మడం సరికాదు. దేశానికి గుండెకాయ లాంటి ముంబై మహానగరం మీద బాంబుల వర్షం కురిసినప్పుడు వాళ్లకు ఎందుకు భయం వేయలేదో అని ఆశ్చర్యం వేస్తోంది. మోదీ ప్రధాని అయిన రోజు నుంచి తాము సంతోషంగా లేమని వీళ్లు బహిరంగంగా చెబితే బాగుండేది. అంతేతప్ప మొత్తం దేశం సిగ్గుపడేలా వ్యాఖ్యానించడం సరికాదు. వాళ్లకు నిజంగా దమ్ముంటే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాలి. అంతేతప్ప దేశ పరువు ప్రతిష్ఠలను దిగజార్చకూడదు. ఏ రకమైన నిరసనతోనూ నాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ మన దేశాన్ని గౌరవించే విషయానికొద్దాం.. దేశం నీకు ఏమిచ్చిందో, నువ్వు దేశానికి ఏమిచ్చావో ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో.'' ఇక ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కుందని షానవాజ్ హుస్సేన్ చెబుతూనే, ఈ దేశం అమీర్ ఖాన్‌కు చాలా ఇచ్చిందన్నారు. భారత్ కన్నా మరో మెరుగైన దేశాన్ని అమీర్ ఖాన్ చూడలేరని, దేశ ప్రతిష్ఠను మంటగలపడానికి అమీర్ ఖాన్ ప్రయత్నిస్తున్నారని షానవాజ్ ధ్వజమెత్తారు. మరోవైపు అమీర్ ఖాన్ పై ఢిల్లీలోని అశోక్ నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అమీర్ ఖాన్ ఇంటి ఎదుట భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అమీర్‌ఖాన్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు ప్రారంభించడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు సంఘటనలు తనకు ఆందోళన కలిగించాయని.. తన భార్య కిరణ్‌రావ్ ఈ దేశం వదిలి వెళ్దామని కూడా ప్రతిపాదించారని సోమవారం ఢిల్లీలోని రామ్‌నాథ్ గోయంకా అవార్డుల కార్యక్రమంలో అమీర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.