
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ అమీర్ జమాల్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. తాము నిర్ధేశించిన నియమాలు, నిబంధనలను ఉల్లఘించినందుకు గాను జమాల్‌కు పీకేఆర్ 1.4 మిలియన్ల (భారత కరెన్సీలో సుమారు. రూ. 4. 35 కోట్లు) భారీ జరిమానా పీసీబీ విధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడితో పాటు క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించిన పలువురు పాక్ ఆటగాళ్లపై కూడా పాక్ క్రికెట్ కొరడా ఝులిపించినట్లు సమాచారం.
జమాల్ ఏమి తప్పు చేశాడంటే?
జమాల్ స్వదేశంలో ఓ టెస్టు మ్యాచ్ సందర్భంగా తన క్యాప్‌పై 804 నంబర్‌ను రాసుకున్నాడు. ఆ నంబర్‌ను తన క్యాప్‌పై రాసుకున్నందుకు అతడిపై పీసీబీ సీరియస్ అయినట్లు పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఎందుకంటే 804 అనేది జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బ్యాడ్జ్ నంబర్.
ఇమ్రాన్‌కు సంఘీభావం తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే అతడి బ్యాడ్జ్ నంబర్‌ను జమాల్ తన క్యాప్‌పై రాసుకున్నట్లు పీసీబీ విచారణలో తేలింది. కాగా పాకిస్తాన్ క్రికెట్‌లో భాగంగా ఉన్న ఆటగాళ్లు గానీ, కోచింగ్ స్టాప్ గానీ రాజకీయాల గురించి మాట్లాడకూడదని బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ క్రమంలోనే అతడికి పీసీబీ ఫైన్ విధించినట్లు సమా టీవీ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. అంతేకాకుండా ఈ కారణంగానే జమాల్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ పీసీబీ సెలక్టర్లు ఎంపిక చేయలేందంట. జరిమానా పడిన ఆటగాళ్లలో అమీర్ జమాల్‌తో పాటు సల్మాన్ అఘా, సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, సుఫీయాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖాన్, అబ్బాస్ అఫ్రిది ఉన్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 9 వికెట్ల తేడాతో పాక్ ఓటమి పాలైంది.
చదవండి: IPl 2025: ఓపెనర్లగా కాన్వే, రవీంద్ర.. సీఎస్‌కే ప్లేయింగ్ ఎలెవన్ ఇదే?
Comments
Please login to add a commentAdd a comment