ఎంజీఆర్‌ పాండియన్‌ అంటున్న ఆమిర్‌ | Ameer next new movie MGR Pandian with Chandini Tamilarasan | Sakshi
Sakshi News home page

ఎంజీఆర్‌ పాండియన్‌ అంటున్న ఆమిర్‌

Published Wed, Aug 30 2017 2:11 AM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM

ఎంజీఆర్‌ పాండియన్‌ అంటున్న ఆమిర్‌

ఎంజీఆర్‌ పాండియన్‌ అంటున్న ఆమిర్‌

తమిళసినిమా: పాత సక్సెస్‌ఫుల్‌ చిత్రాల పేర్లతో తాజాగా చిత్రాలు తెరకెక్కడం అన్నది సాధారణం. ఆ మధ్య శివకార్తికేయన్‌ రజనీ మురుగన్‌ అంటూ వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా రామ్, పరుత్తివీరన్‌ వంటి సంచలన చిత్రాల దర్శకుడు ఆమిర్‌ నటుడిగా రంగప్రవేశం చేసి చా లా కాలమే అయ్యింది. ఆయన తాజాగా రాజ కీయ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రంలో కథా నాయకుడిగా నటించడానికి రెడీ అవుతున్నా రు. దీనికి ప్రఖ్యాత నటుడు, రాజకీయ చరిత్రకారుడు ఎంజీఆర్‌ పేరుతో సూపర్‌స్టార్‌ నటిం చిన సక్సెస్‌ఫుల్‌ చిత్రం పాండియన్‌ పేరును జోడించి ఎంజీఆర్‌ పాండియన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించడం విశేషం.

దీన్ని మూన్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆదం బావ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇందులో ఆమిర్‌కు జంటగా ‘555’ చిత్రం ఫేమ్‌ చాందిని నాయకిగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో ఆనందరాజ్, పోన్‌వన్నన్, గంజాకరుప్పు, రాజసిమ్మన్, ఇమాన్‌అన్నాచ్చి, పావాలక్ష్మణన్, వి న్సెంట్‌రాయ్‌ నటిస్తున్నారు. విద్యాసాగర్‌ సంగీతం, దేవరాజ్‌ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది సమకాలీన రాజకీయాలకు అద్దం పట్టే చిత్రంగా ఉంటుం దన్నారు. అమైదిపడై చిత్రం తరువాత ఆ తరహా రాజకీ య నేపథ్యంలో సాగే చి త్రంగా ఉంటుందని తెలి పారు. చిత్రాన్ని తేని, మదు రై, చెన్నై ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement