Aamir Ali Breaks Silence On Dating Rumours With Shamita Shetty - Sakshi
Sakshi News home page

Shamitha Shetty: పెళ్లయిన వ్యక్తితో షమితా శెట్టి డేటింగ్‌.. స్పందించిన నటుడు!

Published Mon, Jul 17 2023 1:49 PM | Last Updated on Mon, Jul 17 2023 2:31 PM

Aamir Ali Breaks Silence On Dating Rumours With Shanitha Shetty - Sakshi

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పరిచయం అక్కర్లేని పేరు. కానీ ఆమె చెల్లెలు షమితా శెట్టి కొద్దిమందికే తెలుసు. బాలీవుడ్‌లో మొహబత్తీన్ మూవీ ఎంట్రీ ఇచ్చిన భామ తెలుగులోనూ పిలిస్తే పలుకుతా చిత్రంలో నటించింది. అంతే కాకుండా హిందీ బిగ్‌బాస్‌లో పాల్గొన్న సందడి చేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ చిత్రంలో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మపై బీ టౌన్‌లో డేటింగ్‌ రూమర్స్ వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు అమీర్ అలీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని గాసిప్స్ గుప్పమంటున్నాయి. ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్‌లో కనిపించడంతో ఈ వార్తలు హాట్‌ టాపిక్‌గా మారాయి. అయితే తాజాగా ఈ వార్తలపై అమీర్ అలీ స్పందించారు. 

(ఇది చదవండి: నా భర్త నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్)

అమీర్ అలీ మాట్లాడుతూ..' నేను ఒంటరిగా ఉన్నానంటే డేటింగ్‌లో ఉన్నట్లు కాదు.. నేను ఎవరితోనైనా బయటకు వెళ్లినప్పుడు ఇలాంటి వార్తలొస్తున్నాయి. నేను నా స్నేహితులతో కలిసి డిన్నర్ కోసం బయటకు వెళ్తాం. అంతే కాదు నా ఫ్రెండ్‌ బర్త్‌డే వేడుకల కోసం రెస్టారెంట్‌కు వెళ్లాం. అదే సమయంలో నా స్నేహితురాలు షమితాశెట్టి కూడా వచ్చింది. అదే సమయంలో నేను ఆమెను డ్రాప్ చేయడానికి వెళ్లా. అంతే మరుసటి రోజే నా ఫ్రెండ్ ఫోన్‌ మీరు ఆమెతో డేటింగ్‌లో ఉన్నట్లు విన్నానంటూ చెప్పాడు. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. మేము ఇప్పటికీ మంచి స్నేహితులం. నేను ఇలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోను. నేను వాటి గురించి ఆలోచిస్తే జీవితంలో ముందుకెళ్లలేను.' అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ జంటపై వస్తున్న రూమర్లకు చెక్‌ పెట్టారు అమీర్ అలీ. 

కాగా.. అమీర్ అలీ 'ఎఫ్‌ఐఆర్‌', 'ఢిల్లీ వలీ ఠాకూర్‌ గర్ల్స్‌', 'సరోజినీ-ఏక్‌ నయీ పెహల్‌' వంటి షోలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా నాచ్ బలియే, 'జరా నచ్కే దిఖా 2' లాంటి రియాలిటీ షోలలో పాల్గొన్నాడు. అతను తన మొదటి భార్య సంజీదా షేక్‌తో విడాకులు తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే అమీర్  షమితా శెట్టితో కనిపించడంతో డేటింగ్ పుకార్లు వ్యాపించాయి. తాజాగా కామెంట్స్‌తో రూమర్స్‌కు చెక్‌ పెట్టాడు. 

(ఇది చదవండి: ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement