పుష్ప భామ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) కొద్ది రోజుల క్రితం గాయపడిన విషయం తెలిసిందే. తన కొత్త సినిమా కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తన కాలికి గాయమైంజి. అయితే చికిత్స పొందిన తర్వాత ఆమె హైదరాబాద్ విమానాశ్రయంలో వీల్‌ఛైర్‌లో కనిపించింది. ఇవాళ ముంబయిలో జరిగిన ఛావా ట్రైలర్ లాంఛ్‌కు ఈవెంట్‌కు హాజరైంది ముద్దుగుమ్మ.
తన కాలు సహకరించుకున్నా ఛావా (Chhaava) ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు రష్మిక హాజరైంది. రష్మిక కుంటుతూ ఈవెంట్‌కు వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా హీరో విక్కీ కౌశల్ ఆమెను చేతపట్టుకుని స్టేజీపై నడిపించుకుంటూ వెళ్లారు. ఇది చూసిన ఫ్యాన్స్ రష్మిక డెడికేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ఛావా. తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ మూవీలో శంభాజీ భార్య ఏసు బాయి పాత్రలో రష్మిక కనిపించనుంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
#TFNExclusive: Beautiful @iamRashmika snapped in a stunning look for #Chhaava trailer launch in Mumbai!!♥️#RashmikaMandanna #Pushpa2TheRule #TheGirlfriend #Kubera #TeluguFilmNagar pic.twitter.com/qEpiTvn59I
— Telugu FilmNagar (@telugufilmnagar) January 22, 2025
Comments
Please login to add a commentAdd a comment