ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఎదురుచూస్తోన్న చిత్రం 'పుష్ప 2 ది రూల్'. 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పార్ట్-1 శ్రీవల్లిగా మెప్పించిన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. మరోసారి సినీ ప్రేక్షకులను అదే రేంజ్‌లో అలరించనుంది. పుష్పర-2 మరో రెండు రోజులు మాత్రమే టైమ్ ఉండడంతో సోషల్ మీడియాగా వేదికగా ఫోటోలు పంచుకుంది. పుష్పలో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది.
పుష్ప-2 మూవీ ట్రైలర్ రిలీజ్‌కు ముందు పుష్పకు సంబంధించిన అనుభవాలను ఓసారి వెనక్కి తిరిగి చూసుకున్నంటూ తెలిపింది. ఈ విశేషాలను మీతో పంచుకోలేదనిపించింది.. అందుకే తనకిష్టమైన టాప్- 10 జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. వాటిని వరుసగా వివరిస్తూ ఫ్యాన్స్‌తో అదిరిపోయే పిక్స్‌ను షేర్ చేసింది. అవేంటో మీరు కూడా చూసేయండి.
1. శ్రీవల్లి లుక్
2. రష్యాలో పుష్పతో శ్రీవల్లి
3.జీనియర్ పుష్ప డైరెక్టర్ సుకుమార్‌తో ఫోటో
4.పుష్ప గ్యాంగ్‌తో ఏకైక ఫోటో
5. శ్రీవల్లి ఫస్ట్ లుక్ టెస్ట్
6.సామీ పాటలో అమ్మాయిల గ్యాంగ్
7.శ్రీవల్లి జుట్టు అలంకరణ
8.సాధారణ లుక్‌లో శ్రీవల్లి కళ్లు
9.పుష్ప పోస్టర్‌తో శ్రీవల్లి, బన్నీ
10. తిరుపతి వెళ్లి క్యారెక్టర్ కోసం రీసెర్చ్ చేయడం.. నిజానికి శ్రీవల్లి తిరుపతిలోనే మొదలైందని తన స్వీట్ మెమొరీస్‌ను పంచుకుంది.
ఇక పుష్ప-2తో మరోసారి శ్రీవల్లిగా అలరిస్తానంటోంది రష్మిక. కాగా.. పుష్ప-2 ట్రైలర్ భారీస్థాయిలో మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈవెంట్‌ను బిహార్‌లోని పట్నాలో నిర్వహిస్తున్నారు. నవంబర్ 17న జరగనున్న ఈవెంట్‌కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ భారీ ఈవెంట్‌కు బన్నీ ఫ్యాన్స్ పెద్దఎత్తున హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment