వీల్‌ఛైర్‌లో రష్మిక మందన్న.. వీడియో వైరల్‌ | Rashmika Mandanna Spotted On Wheelchair In Airport After Leg Injury, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

Rashmika Airport Video: వీల్‌ఛైర్‌లో రష్మిక మందన్న.. వీడియో వైరల్‌

Published Wed, Jan 22 2025 1:24 PM | Last Updated on Wed, Jan 22 2025 1:47 PM

Rashmika Mandanna Move On With Wheelchair

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న కొద్దిరోజు క్రితం గాయపడిన విషయం తెలిసిందే. తన కొత్త సినిమా కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తన కాలికి గాయం అయింది. చికిత్స పొందిన తర్వాత ఆమె హైదరాబాద్‌ విమానాశ్రయంలో వీల్‌ఛైర్‌లో కనిపించింది అందరినీ షాక్‌కు గురిచేసింది. అందుకు సంబంధించిన వీడియో​ నెట్టింట వైరల్‌ అవుతుంది. విక్కీ కౌశల్‌ హీరోగా నటించిన హిస్టారికల్‌ మూవీ ‘ఛావా’లో రష్మిక ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. ఆ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమం కోసం ఆమె ముంబై వెళ్తున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప2’తో శ్రీవల్లిగా థియేటర్లలో దుమ్మరేపిన రష్మిక మందన్న(Rashmika Mandan) ఇలా గాయంతో ఇబ్బంది పడుతూ కనిపించడంతో.. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్‌ కోరుతూ ట్వీట్స్‌ చేస్తున్నారు.

కొత్త సంవత్సరంలో ఇలా జరగడంతో రష్మిక తీవ్ర నిరాశ చెందారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఉన్న ఆమె చేతిలో నాలుగు చిత్రాలకు పైగా ఆమె చేతిలో ఉన్నాయి. గాయం కారణంగా షూటింగ్‌లకు కాస్త బ్రేక్‌ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆమె తెలుపుతూ  అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో ఆమె కొద్దిరోజుల క్రితం ఇలా పంచుకున్నారు. 'నాకు హ్యాపీ న్యూ ఇయర్ ఇలా మొదలైంది. జిమ్‌లో శిక్షణ తీసుకుంటూ ఉండగా నేను గాయపడ్డాను. 

(ఇదీ చదవండి: చనిపోయిన తర్వాత నా ఫోటోలు పెట్టకండి.. కన్నీళ్లతో గ్లామర్‌ క్వీన్‌ రిక్వెస్ట్)

దీంతో కొన్ని వారాలు, నెలలు పాటు రెస్ట్‌లో ఉండాలి. పూర్తిగా కోలుకునేందుకు ఎన్నిరోజులు పడుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఇక నుంచి పూర్తిగా రెస్ట్ మోడ్‌లోనే ఉండాల్సి వస్తుంది. అంతా బాగాయ్యాక నేను మళ్లీ 'సికందర్ (Sikandar), కుబేర(Kubera), థామ(Thama)' సినిమాల  షూటింగ్స్‌లో పాల్గొంటానని అనిపిస్తోంది. నా వల్ల సినిమా ఆలస్యం అవుతుంది. అందుకు  దర్శకులు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను.' అని పేర్కొంది.   'ఛావా' (Chhaava) ప్రమోషన్స్‌లతో రష్మిక బిజీగా ఉంది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రానుంది. విక్కీ కౌశల్‌ హీరోగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కించిన ఈ హిస్టారికల్‌ సినిమాపై ఫ్యాన్స్‌లలో భారీ అంచనాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement