Shamita Shetty Breaks Silence On Dating Rumours With Aamir Ali, Deets Inside - Sakshi
Sakshi News home page

Shamita Shetty: ముందు వాటిపై దృష్టి పెట్టండి.. నెటిజన్లపై షమితా శెట్టి ఫైర్

Published Tue, Jan 31 2023 3:13 PM | Last Updated on Tue, Jan 31 2023 3:48 PM

Shamita Shetty breaks silence on dating rumours with Aamir Ali - Sakshi

బాలీవుడ్ నటి షమితా శెట్టి అంటే చాలామందికి తెలియదు. శిల్పా శెట్టి సోదరి అంటే చాలామందికి వెంటనే గుర్తుకొస్తుంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి 'పిలిస్తే పలుకుతా' చిత్ర౦తో తెలుగు సినిమారంగంలో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ పెద్ద ఎత్తున వైరలవుతున్నాయి. ఆమె బాలీవుడ్ నటుడు అమీర్ అలీతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే వీటిపై తాజాగా ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చింది. అలాంటిదేం లేదంటూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. 

ప్రస్తుతం తాను సింగిల్‌గానే చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. నా అభిప్రాయాలను పంచుకునేందుకు ఇదే సరైన సమయమని చెప్పుకొచ్చింది. ఏదైనా చెప్పే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఇటీవల అమీర్‌ అలీతో షమితా శెట్టి ఓ వీడియో ముద్దులు పెట్టుకోవడంతో అది కాస్తా వైరలైంది. 

షమితా శెట్టి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'సమాజంలో  ఇలాంటి మనస్తత్వంతో నేను అయోమయంలో ఉన్నాను. రియాలిటీ  ఏంటో తెలుసుకోకుండా ఎలా చెప్తారు. ఇది నెటిజన్ల భావనలకు నిదర్శనం. అందుకే నేను నోరు విప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం సింగిల్‌గానే హ్యాపీగా ఉన్నా. వీటిపై కాకుండా ఈ దేశంలోని మరిన్ని ముఖ్యమైన సమస్యలపై దృష్టి పెట్టండి.' కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది బాలీవుడ్ భామ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement