Chandni
-
పద్నాలుగు రోజుల ప్రేమ
మనోజ్ పుట్టూర్, చాందినీ భాగవని జంటగా నాగరాజు బోడెం దర్శకత్వం వహించిన చిత్రం ‘14 డేస్ లవ్’. అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో హరిబాబు దాసరి నిర్మించిన ఈ సినిమా జనవరి 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ లవ్ నేపథ్యంలో కుటుంబ కథా చిత్రంగా ‘14 డేస్ లవ్’ రూపొందింది. కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది? అనే కోణంలో ఈ చిత్రం ఆసక్తిగా సాగుతుంది’’ అన్నారు. -
ఝాన్సీ రాణి టైలర్
రెండు దశాబ్దాలుగా చారిత్రక చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు నీతా లుల్లా! ఖుదా గవా, చాందినీ, లమ్హే, దేవ్‌దాస్, జోధా అక్బర్.. ఇంకా ఎన్నో సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. తన సుదీర్ఘ ప్రయాణంలో ప్రశంసలతో పాటు అవార్డులు కూడా అందుకున్నారు నీతా. 2016లో అషుతోష్ తీసిన ‘మొహెంజదారో’ చిత్రం తరవాత ఇప్పుడు ‘మణికర్ణిక’ చిత్రంలో ఝాన్సీరాణిగా నటిస్తున్న కంగనా రనౌత్‌కి డిజైనర్‌గా పని^ ó శారు. నీతా రూపొందించిన దుస్తులలో కంగనా ఝాన్సీరాణిలాగ ఎంతో సాహసోపేతంగా కనిపించడం ఇప్పటికే ట్రైలర్లలో, టీజర్లలో మీరు చూసే ఉంటారు. జనవరి 25న విడుదల కానున్న ఈ చిత్రానికి కంగనే డైరెక్టర్. నీతా తన టీమ్‌తో కలిసి ఝాన్సీరాణి వస్త్రాల మీద బాగా పరిశోధన చేశారు. నాలుగు మాసాల పాటు తయారు చేసిన వస్త్రాలు రాణి పాత్రకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని పరీక్షించారు. ‘‘అంతకు ముందే ఈ అంశం మీద చిత్రాలు తీద్దామనుకున్న కొందరు వ్యక్తులు నన్ను కలిశారు. అందువల్ల ఈ చిత్రం తీసే నాటికి నాకు ఈ పాత్రకు తగ్గ ఆహార్యం మీద అవగాహన కలిగింది. మణికర్ణిక కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు, నేను ఫ్రెష్ మైండ్‌తో పని ప్రారంభించాను’’ అంటారు నీతా లుల్లా. గ్రంథాలయాలు, మ్యూజియమ్లు గాలించి, మణికర్ణిక వస్త్రాలకు సంబంధించిన సమాచారం సేకరించారు నీతా. అంత లోతుగా పరిశీలించడం వల్ల ఝాన్సీలక్ష్మీబాయిని ఎంత శక్తిమంతంగా చూపాలో నీతాకి అర్థమైంది. ఎక్కడెక్కడివో పెయింటింగ్స్, ఇలస్ట్రేషన్స్, ఫ్యాబ్రిక్ శాంపుల్స్ కూడ పరిశీలించారు. దానితో రాజరికాన్ని ఏ విధంగా ప్రతిబింబించాలో తెలుసుకున్నారు. సందర్భానికో వస్త్రధారణ ‘‘యుద్ధవీరురాలికి వస్త్రాలు తయారు చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీ బాయి వేసిన రకరకాల వేషాలకు సంబంధించిన వస్త్రాలను డ్రామా కంపెనీల దగ్గరకు వెళ్లి తెలుసుకున్నాను. లక్ష్మీబాయి లేదా మణికర్ణిక.. యవ్వనంలో ఉండగా ఆమెను ఒక యోధురాలిగా, పెళ్లికూతురిగా, రాణిగా, విధవరాలిగా చూపాలి. చివరగా ఆమెను ఒక విప్లవ నాయకురాలిగా చూపాలి. ప్రతి దశలోను రకరకాల రంగులను ఉపయోగించాను. తొమ్మిది గజాల ఎమరాల్డ్ గ్రీన్ చీరలో రనౌత్‌ను చూస్తుంటే పోరాటయోధురాలు ఝాన్సీలక్ష్మీబాయి కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. ఆకుపచ్చ రంగు సిరిసంపదలకు, విశాల హృదయానికి ప్రతీక’’ అంటారు నీతా. కంగన కూడా ఆ వస్త్రాలకు దీటైన నటన కోసం శ్రమించారు. ‘‘ఈ పాత్రకు సంబంధించి రకరకాల భావాలు ప్రదర్శించడం చాలా కష్టంగా ఉందని, కాని ఆ పాత్రకు న్యాయం చేయడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నానని కంగనా అనేవారని’’ చెబుతున్నారు నీతా. యుద్ధంలో అంగ్రఖా కుర్తా రాచరికం ప్రతిబింబించేలా హ్యాండ్‌స్పన్ ఫ్యాబ్రిక్, ఖాదీ వస్త్రాల మీద సహజ రంగులతో డిజైన్ చేశారు నీతా. రాణిగా లక్ష్మీబాయి పాత్రకు రిచ్ రెడ్ కలర్, ఆరెంజ్, గ్రీన్ రంగులను ఉపయోగించారు. ఆమెలోని విషాదాన్ని చూపడానికి లేత రంగులను ఉపయోగించారు. యుద్ధరంగంలో ఉన్న సమయంలో రనౌత్ ‘అంగ్రఖా కుర్తా’ వేసుకున్నారు. మరాఠా వీరులకు సంబంధించిన బొమ్మలను, తెల్లటి వస్త్రాల మీద బంగారు, ఎరుపు రంగులలో చిత్రించారు. కవచాన్ని లెదర్‌తో రూపొందించారు. అది కూడా చేతితో చేయించారు. కాస్ట్యూమ్స్ కోసం నీతా ఇంత కృషి చేసిన విధంగానే నగల ఎంపికకు మరో విభాగం పెద్ద అధ్యయనమే చేసింది. మణికర్ణిక మరాఠా మహారాణి కావడంతో వివాహానికి ముందు ధరించే నగల విషయంలో ప్రత్యేకత చూపారు. ముక్కుకి నత్తు, కంఠానికి తుషీ చోకర్ తయారుచేశారు. వివాహం అయ్యాక ఆవిడ కుందన్స్, ముత్యాలు ధరించేలా నగలు తయారుచేశారు. పెద్ద పాపిడి బిళ్ల, చేతులకు కంకణాలు, నెక్లేస్.. ఉపయోగించారు. వీటన్నిటినీ త్వరలోనే మనం తెర మీద కళ్లారా చూడొచ్చు. – జయంతి ఇంతలా ఎప్పుడూ శ్రమించలేదు నేను 12 వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. నాకు చరిత్ర గురించి అస్సలు తెలియదు. సంప్రదాయ చదువుల పట్ల నాకు ఆసక్తి లేదు. ఇప్పటికి 100 కు పైగా చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశాను. నిరంతరం ఏదో ఒకటి కొత్తగా చే యడం మీద నాకు ఆసక్తి ఎక్కువ. మణికర్ణికలో నేను రనౌత్‌కి చేసిన కాస్ట్యూమ్స్‌కి ఎప్పుడూ లేనంతగా శ్రమించాన. ఆమె శిరస్సు కోసం చేసిన అలంకారాలు, రనౌత్‌కు కొత్త అందాలు తీసుకువచ్చాయి. ఆవిడ జీవితంలో ఆ మేకప్ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. – నీతా లుల్లా -
ఆ ఇద్దరంటే ఇష్టం
‘‘టీవీ నుంచి సిల్వర్ స్క్రీన్కు రావడం హ్యాపీగా ఉంది. సినిమాల్లో అయితే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే అవకాశం ఉంటుంది’’ అన్నారు చాందినీ భగ్వానాని. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో గీతానంద్, చాందినీ భగ్వానాని జంటగా రాజా దారపునేని నిర్మించిన ‘రథం’ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. చాందినీ మాట్లాడుతూ– ‘‘మాది ముంబై. ఆరేళ్లకే బాలనటిగా హిందీ సినిమాల్లో నటించాను. ఆ తర్వాత కొంచెం విరామం తీసుకుని చదువుపై దృష్టి పెట్టి ప్లస్ టు కంప్లీట్ చేశాను. ప్రముఖ టీవీ చానెల్స్‌లో నటిస్తూనే, మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తి చేశా. ‘రథం’ సినిమాలో అవకాశం వచ్చింది. మగవారి పట్ల సరైన అభిప్రాయం లేని ఓ అమ్మాయి జీవితంలోకి వచ్చిన ఓ అబ్బాయి తీసుకొచ్చిన మార్పు ఏంటి? అనేదే ఈ చిత్రకథ. హీరో గీతానంద్ నాకు తెలుగు డైలాగ్స్ పలకడంలో సహాయపడ్డారు. దర్శకుడు చంద్రశేఖర్ కూడా హెల్ప్ చేశారు. నాకు ఆయన తెలుగు చెబితే, నేను ఆయనకు హిందీ చెప్పాను (నవ్వుతూ). ఎమోషనల్ సీన్స్‌లో బాగా నటించగలగడం నా బలం. అలాగే ఎవరైనా బాగా నవ్వించినప్పుడు ఆ నవ్వును తొందరగా ఆపుకోలేను. అది నా బలహీనత. హిందీలో డబ్ అయిన చాలా తెలుగు సినిమాలు చూశాను. నాని, నాగచైతన్యల నటన అంటే ఇష్టం. హీరోయిన్స్‌లో సమంత, రకుల్‌ప్రీత్ సింగ్ ఇంకా హెబ్బా పటేల్ తెలుసు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘టీవీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉండదు. నేను లైంగిక వేధింపులను ఎదుర్కొనలేదు. మహిళలు వేధింపులు ఎదుర్కొన్న వెంటనే స్పందిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నా భావన. ప్రస్తుతం ‘దిక్సూచి’ అనే సినిమాలో నటిస్తున్నాను. వేరే ఏ ప్రాజెక్ట్ కమిట్ కాలేదు’’ అన్నారు. -
కాలం కలిసొస్తోంది
తమిళసినిమా: నాకు ఇప్పుడే కాలం కలిసొస్తోంది అంటోంది నటి చాందిని. కే.భాగ్యరాజ్ దర్శకత్వంలో శాంతనుకు జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన నాయకి చాందిని. ఆ చిత్రం నిరాశపరచినా, ఆ తరువాత అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. తొలి రోజుల్లో గ్లామర్ పాత్రల్లో నటించడానికి నో చెప్పిన ఈ బామ స్టార్ హీరోయిన్ హోదా కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. దేనికైనా సమయం, సందర్భం కలిసి రావాలని విధిపై భారమేసి కాలాన్ని గడిపేస్తున్న చాందిని ఇన్నాల్టికి తనకు కాలం కలిసివస్తోందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం వండి, హారా, వణంగాముడి, రాజా రంగూస్కీ, బెలూన్, మన్నర్వగైయారు వంటి పలు చిత్రాలతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా చాందిని మాట్లాడుతూ అందరిలానే తనకు ప్రముఖ హీరోలతో డ్యూయెట్స్ పాడాలన్న ఆశ ఉందని అంది. అయితే అలాంటి అవకాశాలు లభించడం లేదని వాపోయింది. కాగా వస్తున్న అవకాశాలను వదలకుండా నటిస్తూ వస్తున్నట్లు చెప్పింది. ఏదేమైనా ఇప్పుడు అందాలారబోతకు రెడీ అనేసిందట. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలతో నటిగా తన స్థాయి పెరుగుందనే నమ్మకం ఉందని చెప్పింది. హార అనే హర్రర్ చిత్రంలో మెయిన్ హీరోయిన్గా నటిస్తున్నానని, ఈ చిత్రంలో తన నటనకు కచ్చితంగా ప్రశంసలు అందుకుంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. అదే విధంగా మెట్రో చిత్రం ఫేమ్ క్రిష్‌కు జంటగా నటిస్తున్న రాజా రంగూస్కీ, జోకర్ చిత్రం ఫేమ్ సోమసుందర్‌కు జంటగా నటిస్తున్న చిత్రాల్లో సోలో హీరోయిన్గా నటిస్తున్నానని చెప్పింది. ఇప్పటికి తనకు కాలం కలిసొస్తోందని, త్వరలోనే స్టార్ హీరోలకు జంటగా నటిస్తానని చాందిని ఆశాభావంతో ఉంది -
ఎంజీఆర్ పాండియన్ అంటున్న ఆమిర్
తమిళసినిమా: పాత సక్సెస్ఫుల్ చిత్రాల పేర్లతో తాజాగా చిత్రాలు తెరకెక్కడం అన్నది సాధారణం. ఆ మధ్య శివకార్తికేయన్ రజనీ మురుగన్ అంటూ వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా రామ్, పరుత్తివీరన్ వంటి సంచలన చిత్రాల దర్శకుడు ఆమిర్ నటుడిగా రంగప్రవేశం చేసి చా లా కాలమే అయ్యింది. ఆయన తాజాగా రాజ కీయ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రంలో కథా నాయకుడిగా నటించడానికి రెడీ అవుతున్నా రు. దీనికి ప్రఖ్యాత నటుడు, రాజకీయ చరిత్రకారుడు ఎంజీఆర్ పేరుతో సూపర్‌స్టార్ నటిం చిన సక్సెస్ఫుల్ చిత్రం పాండియన్ పేరును జోడించి ఎంజీఆర్ పాండియన్ అనే టైటిల్‌ను నిర్ణయించడం విశేషం. దీన్ని మూన్ పిక్చర్స్ పతాకంపై ఆదం బావ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇందులో ఆమిర్‌కు జంటగా ‘555’ చిత్రం ఫేమ్ చాందిని నాయకిగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో ఆనందరాజ్, పోన్వన్నన్, గంజాకరుప్పు, రాజసిమ్మన్, ఇమాన్‌అన్నాచ్చి, పావాలక్ష్మణన్, వి న్సెంట్రాయ్ నటిస్తున్నారు. విద్యాసాగర్ సంగీతం, దేవరాజ్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది సమకాలీన రాజకీయాలకు అద్దం పట్టే చిత్రంగా ఉంటుం దన్నారు. అమైదిపడై చిత్రం తరువాత ఆ తరహా రాజకీ య నేపథ్యంలో సాగే చి త్రంగా ఉంటుందని తెలి పారు. చిత్రాన్ని తేని, మదు రై, చెన్నై ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. -
బైక్ పోగొట్టుకున్న విదార్థ్
తమిళసినిమా: నటుడు విదార్థ్ కొత్తగా మోజు పడి కొనుకున్న బైక్ పోగొట్టుకున్నాడు. ఎలా? ఏమాకథ అంటారా? అది తెలుసుకోవాలంటే వండి చిత్రం వచ్చే వరకూ ఆగాల్సిందే. ఆ వివరాల్లోకెళితే పోయిన తన సైకిల్ కోసం ఓ కుర్రాడు వెతుకుతూ చివరికి వేరే వ్యక్తి సైకిల్ దొంగిలించాల్సిన పరిస్థితికి వస్తాడు. పోయిన అతని సైకిల్ ఏమైందన్న ఇతివృత్తంతో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం బైస్కిల్ థీవ్స్ అప్పట్లో ప్రపంచ సినీ ప్రేక్షకులను అబ్బుర పరిచింది. ఈ మధ్య తన తండ్రి జీవితాంతం సంపాదించి కూడబెట్టిన డబ్బుతో మోటార్‌బైక్ కొనుకున్న యువకుడిని అప్పటి వరకూ పట్టించుకోని అమ్మాయిలు ప్రేమిం చడం మొదలెడతారు. ఆ యువకుడికి మంచి ఉద్యోగం వస్తుంది. దీంతో జీవితం ఆనందంగా సాగిపోతుంది. అలాంటి పరిíస్థితుల్లో అతని బైక్ చోరీ అవుతుంది. ఇది పొల్లాదవన్ చిత్రం. కాగా ఆ తరహాలో నటుడు విదార్థ్ ముచ్చటపడి కొనుక్కున యమహా బైక్ దొంగతనానికి గురవుతుంది. అది ఏమైందన్న ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం వండి అని ఆ చిత్ర దర్శకుడు రజీష్బాలా తెలిపారు. ఈయన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూబీ ఫిలింస్ పతాకంపై హషీర్ నిర్మిస్తున్న చిత్రం వండి. ఇందులో మోటార్‌బైక్ ఒక పాత్రగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. విదార్థ్కు జంటగా నటి చాందిని నటిస్తున్న ఇందులో శ్రీరామ్ కార్తీక్, ఎంఆర్.కిశోర్‌కుమార్, జాన్‌విజయ్, అరుళ్దాస్, స్వామినాథన్, మదన్‌బాబు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. -
పెద్ద నోట్ల రద్దు ఇతివృత్తంగా కన్ల కాసు కాట్టప్పా
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న అంశం నోట్ల మార్పిడి. ప్రజలంతా పనులు మానుకుని ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయమే. సరిగ్గా ఇలాంటి పరిస్థితులకు అద్దం పట్టే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం కన్ల కాసు కాట్టప్పా అంటున్నారు దర్శకుడు మెజర్ గౌతమ్. ప్రఖ్యాత నటుడు దివంగత మేజర్ సుందర్రాజన్ కొడుకు ఇతనన్నది గమనార్హం. అరవింద్ ఆకాశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నటి చాందిని, అశ్వతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎంఎస్.బాబు, యోగిబాబు, వి సు, నృత్యదర్శకుడు కల్యాణ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. మలేషియాకు చెందిన సుగర్ కల్యాణ్, అరవింద్, కమల్‌నాథన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఒక ధనవంతుడు తన వద్ద ఉన్న నల్లధనం రూ.100 కోట్లను డాలర్లుగా మార్చుకోవడానికి మలేషియా పంపుతాడన్నారు. అది అక్కడ పలువురి చేతులు మారుతుందని.. ప్రతి వాడు ఆ సొమ్మును సొంతం చేసుకోవాలని ఆశపడతారని.. అయితే, ఆ వంద కోట్లు చివరికి ఎవరి చేతికి చేరాయన్న విషయాలను పూర్తి హాస్యభరితంగా తెరకెక్కించినట్లు తెలిపారు. -
విదార్థ్ వండి ప్రారంభం
యువ నటుడు విదార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వండి శనివారం ప్రారంభమైంది. కుట్రమే దండణై వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఈయన నటిస్తున్న చిత్రం ఇది. ఇందులో విదార్థ్కు జంటగా నటి చాందిని తమిళరసన్ నటిస్తున్నారు. హీరోకు స్నేహితులుగా కిషోర్, శ్రీరామ్కార్తీక్ నటిస్తుండగా విభిన్న పాత్రలోఎస్ఐగా జాన్‌విజయ్ నటిస్తున్నారు. గణేశ్ ప్రసాద్ రెండో కథానాయకుడిగానూ అరుళ్దాస్ ప్రతినాయకుడిగానూ, లొల్లుసభ స్వామినాథన్, మదన్‌బాబు హాస్య పాత్రల్లోనూ అలరించనున్నారు. రుబీ ఫిలింస్ పతాకంపై హసీర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతల్ని రాజేశ్బాలా నిర్వహిస్తున్నారు. దీనికి రాకేష్ నారాయణన్ చాయాగ్రహణం, సురాజ్ ఎస్.గ్రూప్ సంగీతాన్ని, రిసాల్ జయ్నీ ఎడిటింను, మోహన్ మహేంద్రన్ కళాదర్శకత్వాన్ని అందిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శనివారం నుంచి ఏకధాటిగా షూటింగ్‌ను నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు. -
రొమాంటిక్, ఎంటర్టైనర్
యువతకు నచ్చే అంశాలతో పాటు రొమాం టిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొత్త చిత్రం తెరకెక్కుతోంది. కాశ్యప్, చాందినీ జంటగా కళ్యాణ్ సినీ క్రియేషన్స్ పతాకంపై శ్రీరాం బాలాజీ దర్శకత్వంలో ఎం.జాహ్నవి నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. ‘డిజీక్వెస్ట్’ బసిరెడ్డి కెమేరా స్విచ్చాన్ చేయగా దర్శకుడు కిశోర్ పార్థసాని క్లాప్ ఇచ్చారు. నిర్మాత మల్కాపురం శివకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ, ‘‘కథపై ఆరునెలలు పనిచేశాం. నటీనటులకు మూడునెలలు వర్క్‌షాప్ నిర్వహించాం. మార్చిలో షూటింగ్ ప్రారంభిస్తున్నాం’’ అన్నారు. ‘‘అన్నపూర్ణాస్కూల్లో శిక్షణ పొందిన కశ్యప్‌ను హీరోగా పరిచయం చేస్తు న్నాం. బంటిగారు మంచి పాటలు ఇచ్చారు’’ అని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పావని తదితరులు పాల్గొన్నారు. -
కేటుగాడి ప్రేమకథ
ఈ కుర్రాడు ఎవరినైనా ఇట్టే బోల్తా కొట్టిస్తాడు. అందుకే వీణ్ణి కేటుగాడు అని పిలుస్తూ ఉంటారు. ఈ కేటుగాడు ఓ అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయాడు. మరి.. ఆమె ప్రేమ దక్కించుకున్నాడా, లేదా అనేది తెలియాలంటే ‘కేటుగాడు’ చూడాల్సిందే. తేజస్, చాందిని జంటగా వెంకటేశ్ మూవీస్, 100 క్రోర్స్ అకాడమీ పతాకంపై వెంకటేశ్ బాలసాని నిర్మిస్తున్నారు. కిట్టు నల్లూరి దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. వెంకటేశ్ మూవీస్ బేనర్ లోగోను నిర్మాత కేఎస్ రామారావు, నటుడు రాజీవ్ కనకాల ఆవిష్కరించారు. ఈ టైటిల్ చాలా యూత్‌ఫుల్‌గా ఉందని కేఎస్ రామారావు చెప్పారు. తేజస్ మాట్లాడుతూ - ‘‘ ‘ఉలవచారు బిర్యాని’ తర్వాత అలాంటి కథలు చాలానే వచ్చాయి. కిట్టు చాలా మంచి స్టోరీ లైన్ చెప్పడంతో వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా’’ అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మల్హర్‌భట్ జోషి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అచ్చిబాబు ఎం, సంపత్‌కుమార్ ఎ, సమర్పణ: వి.ఎస్.పి. తెన్నేటి. -
స్లమ్ జర్నలిస్ట్స్
అది ఓ మురికివాడ. 14 ఏళ్ల చాందిని అప్పుడే లేచి తయారవుతోంది. అంతలోనే పక్కింటమ్మాయి వచ్చి తన చెవిలో ఏదో చెప్పింది. లోకల్ ఫోన్ దగ్గరికి చేరుకున్న చాందిని పోలీసులకు ఫోన్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు... వచ్చి ఆ మురికివాడలో జరుగుతున్న ఓ బాల్య వివాహాన్ని ఆపేశారు. అంత చిన్న అమ్మాయి చెబితే పోలీసులు ఎలా విన్నారు?అన్న సందేహం కలుగుతోంది కదా! ఆ అమ్మాయి ఢిల్లీలోని బాలక్‌నామా అనే పత్రిక రిపోర్టర్. మురికివాడల బాలలను మోటివేట్ చేసి ‘బాలక్‌నామా’ను నడిపిస్తున్నది చేతన అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ. ఇలాంటి సీన్లు... ఇప్పుడు హైదరాబాద్‌లోని మురికివాడల్లోనూ నిత్యకృత్యం కానున్నాయి. సిటీ స్లమ్స్‌లోని పిల్లలు ఇప్పుడు బాధ్యతాయుతమైన జర్నలిస్టులుగా మారిపోయారు. వారికి తోడ్పాటునందిస్తోంది ‘దివ్యదిశ’ స్వచ్ఛంద సంస్థ. ..:: చీకోటి శ్రీనివాస్, సికింద్రాబాద్ ‘మా బస్తీలో దోమల మందు కొట్టట్లేదు. దీనివల్ల బస్తీవాళ్లం మలేరియా, డెంగ్యూ బారిన పడుతున్నాం. డ్రైనేజీ మురుగు వాసనను భరించలేకున్నాం. వెంటనే సమస్యను పరిష్కరించండి!’ ‘ఎవరికైనా ఆపద వస్తే 108 వెహికిల్ రాలేనంత ఇరుకుగా మా వీధులున్నాయి. విస్తరించే మార్గం చూడండి..’ ‘మా బస్తీలో అంగన్వాడి కేంద్రం లేదు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. వెంటనే ఏర్పాటు చేయండి!’... ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తోంది. ఏ బస్తీవాసులో అధికారులకు ఇచ్చిన వినతిపత్రంలా ఉంది కదా! కానీ అవి విజ్ఞాపనలు కాదు... నగరంలోని మురికివాడల్లో బుల్లి జర్నలిస్టులు వేసిన గోడపత్రికలోని వార్తలు. మా బస్తీ-మా పత్రిక మురికివాడల్లోని పిల్లల కోసం బచ్పన్ క్లబ్‌లను ఏర్పాటు చేసి చైతన్యాన్ని నింపుతున్న ‘దివ్యదిశ’ స్వచ్ఛంద సంస్థ మరో సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. నగరవ్యాప్తంగా ఉన్న మురికివాడల్లో తొమ్మిది, పదో తరగతి చదువుతున్న విద్యార్థులను సబ్ఎడిటర్లు, రిపోర్టర్లుగా ఎంపిక చేసింది. ఒక్కో స్లమ్ నుంచి పది మంది చొప్పున నగరంలోని అరవై మురికివాడల నుంచి ఎంపిక చేసి వారిని బాల విలేకరులుగా మార్చింది. జర్నలిజం, బాధ్యతలు, వార్తల సేకరణపై అవగాహన కల్పించింది. స్థానిక సమస్యలను ఎంచుకొని ఇబ్బందులను వివరిస్తూ వార్తలు రాయడమెలా అనే అంశంపై సీనియర్ జర్నలిస్టులతో అవగాహన తరగతులు నిర్వహించింది. బస్తీల్లోని సమస్యలు మౌలికమైనవి. ఏళ్ల తరబడి అవి పీడిస్తున్నాయి. పిల్లల ద్వారా వాటిని వెలికితీయించడం, సమస్య తీవ్రతను ప్రభుత్వ విభాగాల దృష్టికి తీసుకెళ్లడం ముఖ్య లక్ష్యంగా ‘మా బస్తీ-మా పత్రిక’ పత్రికకు రూపకల్పన చేశారు. ఈనెల 26న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ పత్రికను ఆవిష్కరించనున్నారు. మంచీచెడుల విచక్షణ... స్థానిక సమస్యలతో పాటు బాలలకు పరిసరాల పరిశుభ్రత, పిల్లలకు సకాలంలో వేయాల్సిన టీకాలు, ఉన్నత విద్య చదివేందుకు మార్గాలు, సంపూర్ణ ఆరోగ్యంవంటి అనేక అంశాలతో ఈ గోడ పత్రికలు రూపుదిద్దుకుంటున్నాయి. పూర్తిగా సమస్యల గురించే ప్రస్తావించడం కాక, కలిసికట్టుగా ఉంటే బస్తీలను ఎలా బాగుపర్చుకోవచ్చు, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాలనూ ఈ గోడ పత్రికల ద్వారా బస్తీవాసులకు తెలియజే స్తున్నారు పిల్లలు. అయితే ‘ఇలా పిల్లలతో పత్రిక నడిపించడం వల్ల.. వాళ్లకు సమస్యలు తెలిసిరావడంతోపాటు, మంచేదో చెడేదో తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది. బాలల సంక్షేమం, అభ్యున్నతి, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే మా ధ్యేయం. బస్తీల్లో బచ్పన్ క్లబ్‌లను ఏర్పాటు చేశాం. క్లబ్ ప్రతినిధులనే బాల జర్నలిస్టులను చేసి మా బస్తీ-మా వార్త నినాదంతో బాలరక్ష పత్రికను వెలువరిస్తున్నాం’ అని చెబుతున్నాడు దివ్యదశ నిర్వాహకుడు ఐసిడర్ ఫిలిప్స్. అయితే బాలలకోసం బాల జర్నలిజం పాఠశాలను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందీ సంస్థ. పదో తరగతిలోపు విద్యార్థులు ఏటా వంద మందికి ఇందులో అడ్మిషన్ ఇవ్వనుంది. చిన్నారులకు అవగాహన తొలిదశలో 60 మురికివాడల నుంచి బస్తీకి పది మంది చొప్పున విద్యార్థుల్ని ఎంపిక చేశారు. వీరికి ఇటీవలే సమస్యల్ని ఎలా రిపోర్ట్ చేయాలనే అంశంపై శిక్షణనిచ్చారు. ఈ శిబిరంలో శిక్షణ పొందిన అల్లూరి సీతారామరాజునగర్కి చెందిన కె.జ్యోతి.. ‘ఓవైపు చదువుకుంటూనే మరోవైపు సమస్యలపై అవగాహన కలిగించుకొని, నేను నేర్చుకున్న మంచి విషయాలను మా బస్తీలో విద్యార్థులందరికి పంచుతా’నంటోంది. ‘మేం నివసిస్తున్న ప్రాంతంలోని సమస్యల్ని చుట్టుపక్కల వాళ్లకు అర్థమయ్యే తరహాలో కథనాలు రాస్తా’ అంటోంది గురుబ్రహ్మనగర్‌కు చెందిన జీ.గాయత్రి. బాల విలేకరిగా పనిచేయడంవల్ల సమాజంలోని అన్ని విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుందని, బస్తీ సంక్షేమం కోసం తామంతా పాటుపడతామని ఇక్కడ శిక్షణ పొందిన చిన్నారులు చెబుతున్నారు. బస్తీలు బాగుపడాలని, చిన్నారుల కలలు సాకారం కావాలని ఆశిద్దాం! -
గ్యాస్ సిలిండర్ పేలుడు
► రెండు నెలల చిన్నారి మృతి ► 18మందికి గాయాలు ► నలుగురి పరిస్థితి విషమం ► మంత్రులు, జిల్లా కలెక్టర్ పరామర్శ ► కంపించిన రంగిరీజువీధి విశాఖపట్నం : రంగిరీజువీధిలో నివసిస్తున్న కొప్పుల ఈశ్వరరావు (చిన్నా) ఇంట్లో కోట సత్యనారాయణ, వరలక్ష్మి అద్దెకుంటున్నారు. వీరి పెద్ద కుమారుడు నరసింగరావు, చిన్న కుమారుడు శ్రీను తండ్రితో పాటు అయ్యప్పమాల ధరించారు. నరసింగరావుకు భార్య బుజ్జి, కుమార్తెలు ఏడేళ్ల పూజిత, రెండున్నరేళ్ల చాందిని, ఏడాదిన్నర వయసున్న కొడుకు జయరామ్ ఉన్నారు. మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఇంట్లోని గ్యాస్ సిలిండర్ లీకై వాసన రావడాన్ని నరసింగరావు భార్య బుజ్జి పసిగట్టింది. వెంటనే మావయ్య కోట సత్యనారాయణకు చెప్పింది. అయ్యప్ప మాలలో ఉన్న ఆయన సమీపంలో పకోడి బండి నిర్వహిస్తున్న కొల్లి సూరిబాబుకు చెప్పాడు. ఆయన వచ్చి గ్యాస్ సిలిండర్‌కు ఉన్న పిన్ను సరిచేస్తుండగా ఒక్కసారిగా లీకై ఇల్లంతా వ్యాపించింది. అంతే... ఒక్కసారిగా ఇంటి నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న కోట వరలక్ష్మి (50) కోట బుజ్జి(25), కోట పూజిత(7), కోట చాందిని (రెండున్నరేళ్లు), కోట జయరామ్ (19 నెలలు)తో పాటు గ్యాస్లీక్ను అరికట్టేందుకు వచ్చిన కొల్లి సూరిబాబు (40) తీవ్రంగా గాయపడ్డారు. మేడపై ఉన్న ఇంటి యజమాని కొప్పుల ఈశ్వరరావు (చిన్ని)(40), పేలుడు సంభవించిన ఇంటి పక్కనే ఉన్న కిరాణా దుకాణానికి వచ్చిన డి.శాంతమ్మ (50), కె హరి (17), వీధిలో వెళ్తున్న కొల్లి బండమ్మ (50), రెడ్డి కీర్తి(11), ఎస్.తనూజ (8), జి.నాగేశ్వరి(30), గోరింట రాజు (35), సిహెచ్.వనజ(10), స్కూల్‌కి పిల్లల్ని తీసుకెళ్తున్న సునీత (40), చిన్నారులు మోహనకృష్ణ(13), యామిని(15) గాయపడ్డారు. నలుగురి పరిస్థితి ఆందోళనకరం కేజీహెచ్ సూపర్‌స్పెషాల్టీ వార్డులో 80 శాతం గాయాలతో కొప్పుల ఈశ్వరరావు (చిన్న), 50 శాతం కాలిన గాయాలతో డి.శాంతమ్మ, 60 శాతం గాయాలతో కె.పూజిత, 76 శాతంతో కాలిన గాయాలతో కె.సూరిబాబు పరిస్థితి విషమంగా ఉండటంతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేజీహెచ్ నుంచి సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారి వివరాలు కేజీహెచ్ సూపర్ స్పెషాల్టీ బ్లాకులో 15 శాతం గాయాలతో ఎస్.తనూజ, 12 శాతంతో కీర్తి, 30 శాతం గాయాలతో జయరామ్, 25 శాతం గాయాలతో చాందిని, 20 శాతం గాయాలతో హరి, 15 శాతం గాయాలతో నాగేశ్వరి, 30 శాతం గాయాలతో వరలక్ష్మి, 19 శాతం గాయాలతో బుజ్జి, 12 శాతం గాయాలతో బండమ్మ చికిత్స పొందుతున్నారు. మంత్రుల పరామర్శ... క్షతగాత్రులు చికిత్స పొందుతున్న కేజీహెచ్‌కు మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ ఎన్.యువరాజ్ ఎమ్మె ల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ హుటాహుటిన చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప ఫోన్లో మంత్రి గంటాతో మాట్లాడారు. ప్రయివేటు ఆస్పత్రికి తరలించైనా సరే మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. కుళాయి ఆలస్యమే రక్షించింది రోజూ ఉదయం 7 నుంచి 8 గంటల ప్రాంతంలో వచ్చే మంచినీటి కుళాయి మంగళవారం కాస్త ఆలస్యంగా వచ్చింది. అదే ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. ఎందుకంటే.. పేలుడు సంభవించిన ఇంటి ముందరే వీధి కొళాయి ఉంది. సుమారు 30 మంది వరకు మంచినీళ్లు పట్టుకుంటారు. కొళాయిని విప్పే ఫిట్టర్ పరోక్షంగా ఎందరికో ప్రాణదాత అయ్యాడు. అగ్నిమాపక శకటానికి దారేది? ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరుకు సందులో ఉంది. అగ్నిమాపక సిబ్బంది తీసుకొచ్చిన వాహనాన్ని లోపలికి తీసుకె ళ్లలేకపోయారు. దీంతో సిబ్బంది అష్టకష్టాలు పడి మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్సులు కూడా లోపలికి రాలేకపోవడంతో ఆటోల్లో కేజీహెచ్‌కు తరలించారు. మంగళవారం ఉదయం 7.30 గంటలు. ఎవరి హడావుడిలో వారున్నారు. అమ్మో..గ్యాస్ లీకైందంటూ పెద్ద ఎత్తున కేకలు... అరుపులు. అంతలోనే ఓ ఇంట్లో పెద్ద ఎత్తున పేలుడు. ఆ ధాటికి భవనాల గోడలు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పు రేకులు గాల్లోకి లేచాయి. నిద్రిస్తున్న రెండు నెలల చిన్నారి ఉసురు తీశాయి. మంటలు ఎగిసిపడ్డాయి. ఏం జరిగింది?... ఏమైంది?.. అంతా గజగజ వణికిపోయారు. గాయాలతో హాహాకారాలు చేశారు. బాధతో విలవిల్లాడిపోయారు. పద్దెనిమిది మంది మృత్యువుతో పోరాడుతున్నారు. వెక్కివెక్కి రోదిస్తున్నారు. ఏం పాపం చేశాం... దేవుడా అని కుమిలిపోతున్నారు. ఆనందంగా సాగిపోతున్న జీవితాల్లో అంతులేని విషాదం అలముకుంది. రంగిరీజు వీధిలో మంగళవారం ఉదయం సంభవించిన గ్యాస్ సిలిండర్ పేలుడుతో విశాఖ నగరం మొత్తం ఉలిక్కి పడింది. రెండు నెలలకే నూరేళ్లు అక్టోబర్ 12న... హుద్‌హుద్ తుపాను విరుచుకు పడిన రోజు. గర్భిణి బండారు భవానికి నొప్పులొచ్చాయి. ఆ రోజు రాత్రి కటిక చీకట్లో ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. విద్యుత్ లేక శస్త్ర చికిత్సలకు అవకాశం లేదనడంతో ప్రయివేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఫలితం లేకపోవడంతో చివరిగా కేజీహెచ్‌కు తీసుకెళ్తే రాత్రి 11.40 గంటలకు ముద్దుల మూటగట్టే చిన్నారి జన్మించింది. ఆ చిన్నారికి ఇప్పటి వరకు నామకరణం కూడా చేయలేదు. తండ్రి ఆటో కార్మికుడు కావడంతో చాలీ చాలని ఆదాయంతో నెట్టుకొస్తున్నాడు. త్వరలోనే శుభకార్యం నిర్వహించి చిన్నారికి పేరు పెట్టాలనుకున్నారు. మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలుడు శబ్ధానికి ఇంటి ఎదురుగా ఉన్న భవనం రెండో అంతస్తులో నిద్రిస్తున్న ఆ చిన్నారిపై పైకప్పు రేకులు పడ్డాయి. ఆమె ఊపిరిని ఆపేశాయి. తుపానును జయించిన ఆ చిన్నారి గ్యాస్ పేలుడు రూపంలో కబళించిన మృత్యువును తప్పించుకోలేకపోయింది. పుట్టిన రెండు నెలల్లోనే సుదూర తీరాలకు వెళ్లిపోయింది. అమ్మానాన్నలకు భరించలేనంత దుఃఖాన్ని మిగిల్చింది. ప్రాణాలకు తెగించిన ఆ నలుగురు గ్యాస్ లీకైన ఇంట్లోకి నలుగురు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రవేశించారు. అప్పటికే ఒక సిలిండర్ పూర్తిగా కాలిబూడిదైంది. మరో సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. ప్రాణాలను సైతం పక్కనపెట్టి ఇంట్లో కాలుతున్న ఆ రెండు సిలిండర్లను అగ్నిమాపక శాఖ హెడ్‌కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ ఎల్లాపు, ఎల్.బాలకృష్ణ, ఎ.వి.రాజు, కె.శ్రీనివాస్‌లు బయటికి తెచ్చారు. ఈ ప్రయత్నంలో వారు స్వల్పంగా గాయపడ్డారు. ఒక సిలిండర్ నుంచి భారీగా వస్తున్న గ్యాస్లీక్ను అరికట్టేందుకు సమీపంలో ఉన్న మంచినీటి డ్రమ్ములో ముంచేశారు. అవగాహన లేకే అనర్థాలు విశాఖపట్నం : వంటగ్యాస్ వినియోగంపై అవగాహన లేకపోవడంతో తరచూ సిలిండర్లు పేలుళ్లు సంభవిస్తున్నాయి. గ్యాస్‌డీలర్లు సేఫ్టీ క్లినిక్‌లను ఎక్కడ నిర్వహిస్తున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. గృహావసరాలు, పార్లర్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, శుభకార్యాల్లోనూ గ్యాస్ సిలిండర్లు వాడటం ఆనవాయితీ. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోనందున ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. వాస్తవానికి గ్యాస్‌డీలర్లు మెకానిక్‌లతో గ్యాస్ సిలిండర్లను తనిఖీ చేయాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లేక తనిఖీలు జరుగుతున్న దాఖలాల్లేవు. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదమే చాలామంది మహిళలు ఉదయం వంట ప్రారంభించే సమయంలో ఆన్ చేసిన రెగ్యులేటర్‌ను రాత్రి పూట పడుకునే ముందు ఆఫ్ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమని చమురు సంస్థల అధికారులు హెచ్చరిస్తున్నారు. చాలామంది నాసిరకం రబ్బర్ట్యూబ్లనే వాడుతుంటారు. దీంతో ఆరు నుంచి ఏడు నెలల వ్యవధిలోనే పగుళ్లు వస్తాయి. దీంతో స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి రెగ్యులేటర్‌ను ఆన్‌లోనే వుంచడంవల్ల గ్యాస్ వృథా అయ్యే అవుతుంది. సురక్షా గ్యాస్ ట్యూబ్ ఎంతో భద్రంగా ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. చాలామంది అయిపోయిన సిలిండర్లను దొర్లించడం, వేడినీళ్లలో ఉంచడం చేస్తుంటారు. ఇలా చేయడం ఎంతో ప్రమాదకరం. గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చేటప్పుడు వాల్వ్ ఓరింగ్ లేకపోతే గ్యాస్ లీకయ్యే ప్రమాదముంది కాబట్టి, ముందుగానే సిలిండర్ సీల్ తీసి బోయ్తో తనిఖీలు చేయించుకోవడం మంచిది. తీసుకోవలసిన జాగ్రత్తలు గ్యాస్ సిలిండర్ కన్నా స్టవ్ ఎక్కువ ఎత్తులో ఉండాలి. ఎప్పటికప్పుడు రెగ్యులేటర్‌ను ఆఫ్ చేస్తుండాలి. సురక్ష గ్యాస్ ట్యూబ్ (అయిదేళ్ల గ్యారంటీ)నే వాడాలి. తగినంత గాలి, వెలుతురు ఉండాలి. సిలిండర్ డెలివరీ సమయంలోనే సీల్ తీయించి తగిన తనిఖీలు చేయించుకోవాలి. వాల్వ్ ఓరింగ్ సక్రమంగా వుందో లేదో ముందుగానే చూసుకోవాలి. గ్యాస్ బాయ్ వద్ద ఉండే తూనిక యంత్రంతో బరువు చూసుకోవాలి. ఎక్స్పైర్ తేదీని సరిచూసుకోవాలి. ఆహార పదార్థాలన్నీ సిద్ధం చేసుకున్నాక స్టవ్ వెలిగించాలి. {పమాదాలు జరిగినపుడు గ్యాస్ రశీదుపై ఎమర్జన్సీ టెలిఫోన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. -
అభిమానంతో ప్రేమ...
పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు ఇద్దరూ టాప్‌స్టార్స్. వీరి వీరాభిమానులు ప్రేమలో పడితే ? ఈ నేపథ్యంలో ‘కిరాక్’ చిత్రం రూపొందింది. అనిరుథ్, చాందిని ఇందులో హీరో హీరోయిన్లు. హారిక్ దేవభక్తుని దర్శకత్వంలో డి. గోపీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇదొక రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్. ఇందులో హీరో పవన్ కల్యాణ్ వీరాభిమాని కాగా, హీరోయిన్ మహేశ్‌బాబు అంటే ప్రాణం పెట్టేస్తుంది. వీరిద్దరి మధ్యనా ప్రేమకథ ఆసక్తి రేకెత్తిస్తుంది’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇందులో పోసాని కృష్ణమురళి వెన్నెల కిశోర్ పాత్రలు ఆద్యంతం వినోదాన్ని కురిపిస్తాయి. క్లాస్‌నీ మాస్‌నీ ఆకట్టుకునే కథాంశం ఇది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అజయ్ అరసాద, సమర్పణ: డి. ఉమాదేవి. -
తప్పు చేస్తే...
వానలో తడవనివాడు... తప్పు చేయనివాడు ఎవ్వరూ ఉండరు. ఒక్కోసారి తెలిసీ తెలియక చేసే తప్పులు ఎదుటివారి జీవితంలో కల్లోలాల్ని సృష్టిస్తాయి. ఈ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా ‘ఆర్య చిత్ర’. సతీష్, చాందిని జంటగా ఆంజన్ ఆర్య (లక్ష్మణ్) దర్శకత్వంలో సీహెచ్ సతీష్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రెండ్‌కి అనుగుణంగా ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు పేర్కొన్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘అనుక్షణం ఉత్కంఠ భరితంగా ఉండే లవ్, కామెడీ ఎంటర్టైనర్ ఇది. సెన్సార్ కూడా పూర్తయిం ది. ఈ నెలలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రవిబాబు, భానుచందర్, సీత తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సురేష్ యువన్. -
'కిరాక్' మూవీ స్టిల్స్
-
అందుకే ‘కాళిచరణ్’కు ఓకే చెప్పాను
‘‘కె.భాగ్యరాజా నా గురువు. ఆయన రూపొందించిన ‘సిద్దూ ప్లస్ 2’ చిత్రం ద్వారానే నేను కథానాయికగా పరిచయమయ్యాను. భాగ్యరాజాగారి వద్ద నుంచి నటనలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను’’ అని చాందిని తమిళరాసన్ అన్నారు. ‘కాళిచరణ్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారీమె. చైతన్యకృష్ణ కథానాయకునిగా శ్రీప్రవీణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా చాందిని విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘‘తొలి సినిమా చేశాక... డిగ్రీ పూర్తి చేసే నిమిత్తం నటనకు కొంత విరామం ఇచ్చాను. ఓ తమిళ పత్రిక కవర్‌పేజీపై నా స్టిల్ చూసి శ్రీప్రవీణ్ నన్ను సంప్రదించారు. నటనకు మంచి అస్కారమున్న పాత్ర కావడంతో వెంటనే ‘కాళిచరణ్’కు అంగీకారం తెలిపాను. ఇందులో నా పాత్ర పేరు తీర్థ. బ్రాహ్మణ యువతి పాత్ర. లుక్ పరంగా కాస్త డీ గ్లామరైజ్డ్గా ఉంటాను. ఈ పాత్ర కోసం నా శారీరకభాషను కూడా మార్చుకున్నాను. నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది’’ అని చెప్పారు. శ్రీదేవి, జ్యోతికలు నటిగా తనకు స్ఫూర్తి అని, తాను పవన్‌కల్యాణ్ వీరాభిమానినని చాందిని చెప్పారు. -
తహసిల్దార్ ఇబ్బందులు
1980ల నాటి కథాంశంతో నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ తెరకెక్కిన చిత్రం ‘కాళీచరణ్’. చైతన్యకృష్ణ, చాందిని జంటగా నటించారు. రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడు శ్రీ ప్రవీణ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీప్రవీణ్ మాట్లాడుతూ -‘‘ప్రచార చిత్రాలు విడుదలైనప్పట్నుంచీ ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ మొదలైంది. ఆరు నెలలు కోర్టులో, మూడు నెలలు సెన్సార్ బోర్డ్‌లో ఉండిపోయిందీ సినిమా. ఎట్టకేలకు గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కానుంది. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని నా విశ్వాసం’’ అన్నారు. నిజాయితీగా విధులను నిర్వర్తించే ఓ తహసిల్దార్... సమాజంలో ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడో ఈ చిత్రం కళ్లకు కడుతుందని నాగినీడు చెప్పారు. పక్కా కమర్షియల్ అంశాలున్న సినిమా ఇదని చైతన్యకృష్ణ తెలిపారు. ఇంకా సంగీత దర్శకుడు నందన్‌రాజ్, ఎడిటర్ ప్రవీణ్‌పూడి కూడా మాట్లాడారు. -
సంచలన కథాంశం!
1980ల్లో మహబూబ్‌నగర్‌లో జరిగిన ఓ యథార్థ సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆ కథాంశంతో శ్రీ ప్రవీణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కాళీచరణ్. కృష్ణచైతన్య, చాందిని ఇందులో హీరోహీరోయిన్లు. బేబి మనస్విని సమర్పణలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ -‘‘ఈ కథాకథనాలు కచ్చితంగా క్లాస్‌నీ మాస్‌నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పోరాట సన్నివేశాలు, పతాక సన్నివేశాలు, ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. ‘కాళీచరణ్’గా కృష్ణచైతన్య ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ కనబరిచాడు. ఇందులోని కొన్ని పాత్రలు చాలా కాలం ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. నందన్‌రాజ్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అని తెలిపారు. పంకజ్, కవిత, నాగినీడు, రావు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, విశ్వ దేవబత్తుల.