కాలం కలిసొస్తోంది | heroine Chandni special | Sakshi
Sakshi News home page

కాలం కలిసొస్తోంది

Published Mon, Sep 4 2017 4:46 AM | Last Updated on Tue, Oct 16 2018 5:16 PM

కాలం కలిసొస్తోంది - Sakshi

కాలం కలిసొస్తోంది

తమిళసినిమా: నాకు ఇప్పుడే కాలం కలిసొస్తోంది అంటోంది నటి చాందిని. కే.భాగ్యరాజ్‌ దర్శకత్వంలో శాంతనుకు జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన నాయకి చాందిని. ఆ చిత్రం నిరాశపరచినా, ఆ తరువాత అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. తొలి రోజుల్లో గ్లామర్‌ పాత్రల్లో నటించడానికి నో చెప్పిన ఈ బామ స్టార్‌ హీరోయిన్‌ హోదా కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. దేనికైనా సమయం, సందర్భం కలిసి రావాలని విధిపై భారమేసి కాలాన్ని గడిపేస్తున్న చాందిని ఇన్నాల్టికి తనకు కాలం కలిసివస్తోందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం వండి, హారా, వణంగాముడి, రాజా రంగూస్కీ, బెలూన్, మన్నర్‌వగైయారు వంటి పలు చిత్రాలతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా చాందిని మాట్లాడుతూ అందరిలానే తనకు ప్రముఖ హీరోలతో డ్యూయెట్స్‌ పాడాలన్న ఆశ ఉందని అంది.

అయితే అలాంటి అవకాశాలు లభించడం లేదని వాపోయింది. కాగా వస్తున్న అవకాశాలను వదలకుండా నటిస్తూ వస్తున్నట్లు చెప్పింది. ఏదేమైనా ఇప్పుడు అందాలారబోతకు రెడీ అనేసిందట. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలతో నటిగా తన స్థాయి పెరుగుందనే నమ్మకం ఉందని చెప్పింది. హార అనే హర్రర్‌ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నానని, ఈ చిత్రంలో తన నటనకు కచ్చితంగా ప్రశంసలు అందుకుంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. అదే విధంగా మెట్రో చిత్రం ఫేమ్‌ క్రిష్‌కు జంటగా నటిస్తున్న రాజా రంగూస్కీ, జోకర్‌ చిత్రం ఫేమ్‌ సోమసుందర్‌కు జంటగా నటిస్తున్న చిత్రాల్లో సోలో హీరోయిన్‌గా నటిస్తున్నానని చెప్పింది. ఇప్పటికి తనకు కాలం కలిసొస్తోందని, త్వరలోనే స్టార్‌ హీరోలకు జంటగా నటిస్తానని చాందిని ఆశాభావంతో ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement