కేటుగాడి ప్రేమకథ | kittugadu movie launched | Sakshi
Sakshi News home page

కేటుగాడి ప్రేమకథ

Published Tue, Apr 28 2015 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM

కేటుగాడి ప్రేమకథ

కేటుగాడి ప్రేమకథ

ఈ కుర్రాడు ఎవరినైనా ఇట్టే బోల్తా కొట్టిస్తాడు. అందుకే వీణ్ణి కేటుగాడు అని పిలుస్తూ ఉంటారు. ఈ కేటుగాడు ఓ అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయాడు. మరి.. ఆమె ప్రేమ దక్కించుకున్నాడా, లేదా అనేది తెలియాలంటే ‘కేటుగాడు’ చూడాల్సిందే. తేజస్, చాందిని జంటగా వెంకటేశ్ మూవీస్, 100 క్రోర్స్ అకాడమీ పతాకంపై వెంకటేశ్ బాలసాని నిర్మిస్తున్నారు. కిట్టు నల్లూరి దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు.
 
  వెంకటేశ్ మూవీస్ బేనర్ లోగోను నిర్మాత కేఎస్ రామారావు, నటుడు రాజీవ్ కనకాల ఆవిష్కరించారు. ఈ టైటిల్  చాలా యూత్‌ఫుల్‌గా ఉందని కేఎస్ రామారావు చెప్పారు. తేజస్ మాట్లాడుతూ - ‘‘ ‘ఉలవచారు బిర్యాని’ తర్వాత అలాంటి కథలు చాలానే వచ్చాయి. కిట్టు చాలా మంచి స్టోరీ లైన్ చెప్పడంతో వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా’’ అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మల్హర్‌భట్ జోషి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అచ్చిబాబు ఎం, సంపత్‌కుమార్ ఎ, సమర్పణ: వి.ఎస్.పి. తెన్నేటి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement