
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్యెల్యేలంతా ఆ పార్టీ నేత తేజస్వి నివాసంలో గృహనిర్బంధంలో ఉన్నారు. వారంతా తమకు కావాల్సిన దుప్పట్లు, మందులను శనివారం సాయంత్రమే తెప్పించుకున్నారు. ఈరోజు (ఆదివారం) ఉదయం తేజస్వి నివాసం బయట సందడి నెలకొంది.
ఆర్జేడీ ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తేజస్వీ యాదవ్ స్వయంగా సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు ఎమ్మెల్యేలంతా తేజస్వి నివాసంలోనే ఉండాలని పార్టీ ఆదేశించినట్లు ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. అంటే సోమవారం అసెంబ్లీలో జరిగే నితీష్ బలపరీక్షకు వీరంతా నేరుగా హాజరుకానున్నారు. తేజస్వి నివాసంతో 76 మంది ఎమ్మెల్యేలున్నారని, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాలేదని సమాచారం.
#WATCH | Bihar: RJD MLAs and MLAs of Mahagathbandhan at the residence of former Deputy CM and RJD leader Tejashwi Yadav in Patna ahead of the Floor Test scheduled to take place tomorrow. pic.twitter.com/5FXnvGH8Gp
— ANI (@ANI) February 11, 2024