రైతు ఆత్మహత్యపై తప్పుడు ఆరోపణలు చేశారని ఎఫ్‌ఐఆర్
బెంగళూరు: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. రైతు ఆత్మహత్యకు వక్ఫ్ భూముల సమస్యతో సంబంధం ఉందంటూ తప్పుడు సమాచారాన్ని పంచుకున్నందుకు ఎంపీతోపాటు కన్నడ న్యూస్ పోర్టల్స్ ఎడిటర్లు ఇద్దరిపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తన భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోవడంతో కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన రుద్రప్ప చెన్నప్ప బాలికై అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని సూర్య తన పోస్టులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్‌లు రాష్ట్రంలోని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సూర్య ఆరోపించారు. అయితే.. రుణ భారం, పంట నష్టంతో 2022 జనవరిలో రైతు ఆత్మహత్య చేసుకున్నారని హవేరి పోలీసు సూపరింటెండెంట్ స్పష్టం చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
అసహజ మరణాల దర్యాప్తు
ప్రక్రియ కింద తుది నివేదిక సమరి్పంచిన తర్వాత కేసును ఇప్పటికే మూసేసినట్లు పోలీసులు తెలిపారు. రైతు భూమిని వక్ఫ్ భూమిగా రికార్డుల్లో నమోదు చేయడం వల్లనే అతను ఆత్మహత్య చేసుకున్నాడనే శీర్షికతో వార్తను ప్రచురించినందుకు గాను.. కన్నడ దునియా ఈ–పేపర్, కన్నడ న్యూస్ ఈ–పేపర్ ఎడిటర్లపైనా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. హవేరిలో రైతులు వక్ఫ్ నోటీసులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారని, ఇది రుద్రప్పను మానసిక క్షోభకు గురిచేసిందని ఆ వార్తా కథనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment