formers suicide
-
ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు
బెంగళూరు: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. రైతు ఆత్మహత్యకు వక్ఫ్ భూముల సమస్యతో సంబంధం ఉందంటూ తప్పుడు సమాచారాన్ని పంచుకున్నందుకు ఎంపీతోపాటు కన్నడ న్యూస్ పోర్టల్స్ ఎడిటర్లు ఇద్దరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోవడంతో కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన రుద్రప్ప చెన్నప్ప బాలికై అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని సూర్య తన పోస్టులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్లు రాష్ట్రంలోని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సూర్య ఆరోపించారు. అయితే.. రుణ భారం, పంట నష్టంతో 2022 జనవరిలో రైతు ఆత్మహత్య చేసుకున్నారని హవేరి పోలీసు సూపరింటెండెంట్ స్పష్టం చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. అసహజ మరణాల దర్యాప్తు ప్రక్రియ కింద తుది నివేదిక సమరి్పంచిన తర్వాత కేసును ఇప్పటికే మూసేసినట్లు పోలీసులు తెలిపారు. రైతు భూమిని వక్ఫ్ భూమిగా రికార్డుల్లో నమోదు చేయడం వల్లనే అతను ఆత్మహత్య చేసుకున్నాడనే శీర్షికతో వార్తను ప్రచురించినందుకు గాను.. కన్నడ దునియా ఈ–పేపర్, కన్నడ న్యూస్ ఈ–పేపర్ ఎడిటర్లపైనా ఎఫ్ఐఆర్ నమోదైంది. హవేరిలో రైతులు వక్ఫ్ నోటీసులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారని, ఇది రుద్రప్పను మానసిక క్షోభకు గురిచేసిందని ఆ వార్తా కథనం పేర్కొంది. -
రైతుల ఆత్మహత్యాయత్నంపై చలించిన జగన్
సాక్షి, వెల్దుర్తి : కృష్ణాజిల్లా నున్న పోలీస్ స్టేషన్ ఆవరణలో రైతుల ఆత్మహత్యాయత్నం ఘటన అంశంపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చలించిపోయారు. ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన గురువారం ఫోన్లో పరామర్శించారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని రైతులకు ఈ సందర్భంగా వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం తరఫున రూ.2.30 కోట్లు చెల్లిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. ఆ చెల్లింపులన్నీ వెంటనే చేస్తాం అని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని తన మాటగా నష్టపోయిన రైతులకు చెప్పాలన్నారు. అఘాయిత్యాలకు పాల్పడి కుటుంబాల్లో కన్నీళ్లు నింపొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే... రైతులను కాపాడాల్సిన ప్రభుత్వం వారిని వేధింపులకు గురిచేయడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతుల తమ వేదనను రాజన్న తనయుడికి వెలిబుచ్చారు...దాదాపు ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నామని, నకిలీ నార కారణంగా పంట నష్టపోయామని అప్పట్లో ధర్నా చేశామని, నార నకిలీదని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారని అన్నారు. ఎకరాకు రూ.91వేలు చెల్లించేలా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారని, కాని చెల్లింపులు జరగలేదన్నారు. కంపెనీల యజమానులు కోర్టుకు వెళ్లి కలెక్టర్ ఉత్తర్వులు కొట్టేయించుకున్నారని, ఈ విషయాన్ని మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి నాలుగుసార్లు నివేదించామని, మరో మంత్రి దేవినేని ఉమకి రెండుసార్లు విన్నవించామని, గత ఏడాది అసెంబ్లీకి వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేదుని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఇప్పుడు చలో అసెంబ్లీకి నిర్ణయించుకున్నామన్నారు. అయితే తమపై రౌడీషీట్లు తెరిచారంటూ వైఎస్ జగన్‌కు రైతులు ఫిర్యాదు చేశారు. కేసులు పెట్టి పత్రాలు రాయించుకుని నానా ఇబ్బందులకు గురి చేశారని గోడు వెళ్లబోసుకున్నారు. రూ.2.30 కోట్ల చెల్లింపుల కోసం అలుపెరగని పోరాటం చేశామని, ఎవ్వరూ కనికరించకపోవడంతో ఆత్మహత్యే శరణ్యం అనుకున్నామని ఆ రైతులు వాపోయారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే చెల్లించాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. అవసరం అయితే విత్తన కంపెనీల నుంచి ప్రభుత్వం రికవరీ చేసుకోవచ్చని అన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని అన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే అధికారంలోకి రాగానే రైతులకు చెల్లించాల్సిన పరిహారం ఇస్తామని అన్నారు. -
రైతన్నల ఆత్మహత్యలు మాయని మచ్చలు
గత ప్రస్తుత ప్రభుత్వాల, విధానాల వలన నేడు తెలంగాణ రాష్ట్రంలో నిర్లి ప్తత, నిరాశతో కూడుకొని ఉన్న ఒక అనిశ్చిత వాతా వరణం నెలకొని ఉంది. మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. 1990 నుండి దేశవ్యా ప్తంగా ఉన్న గణాంకాలను పరిశీలిస్తే గత 20 ఏళ్లలో రైతుల ఆత్మహత్యలు 3 లక్షలపై మాటే అన్నది అతిశ యోక్తి కాదు. వ్యవసాయంలో వాణిజ్య పంటలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ సాంప్రదాయక, సేం ద్రియ విధానాలకు పూర్తిగా తిలోదకాలు ఇవ్వటం వలన మన దేశ వ్యవసాయ రంగం అతలాకుతల మవుతోంది. నానాటికీ అడుగంటుతున్న భూగర్భ జలాలు వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభం లోకి నెట్టివేశాయి. మార్కెట్ రంగం మొత్తం దళారీల గుప్పెట్లో ఉండటం వలన రైతుల పంటలకు గిట్టు బాటు ధర అందకుండా పోయింది. తెలంగాణ విష యానికి వస్తే వర్షాభావం, గిట్టుబాటు ధర లేకపోవ టమే కాకుండా బ్యాంకులు ఎకరానికి రూ.20,000 లు మాత్రమే వడ్డీని ఇవ్వటం, ప్రైవేటు వ్యక్తులు, మైక్రోఫైనాన్స్ కంపెనీలు ఇచ్చిన అప్పులకు చక్ర వడ్డీల రూపంలో తడిసి మోపెడయి రైతులను ఆత్మ హత్యలకు పురికొల్పుతున్నాయి. మైక్రోఫైనాన్స్, ప్రైవేటు వ్యక్తులపై ప్రభుత్వానికి ఎటువంటి నియం త్రణ లేదు. 35 నుండి 40 శాతం దాకా వడ్డీ కట్టవల సిన దురవస్థలో రైతు తనువును చాలిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) తెలంగాణ కమిటీ క్షేత్రస్థాయి పర్య టనలో భాగంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలను పరిశీలించాలన్న తీర్మానాన్ని చేయ టం జరిగింది. అందులో భాగంగానే 16.10.2015 నాడు మహబూబ్‌నగర్ జిల్లాలోని అప్పనపల్లి, గంగాపురం, మిడ్జిల్, కొట్రు గ్రామాలను సందర్శిం చింది. పాలమూరు అధ్యయన వేదిక వారు అనేక మంది ఇతర మిత్రులు తమ సహకారాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రరవే నుండి జాతీయ కార్యదర్శి కాత్యాయనీ విద్మహే, భండారు విజయ, కవిని ఆలూరి పాల్గొనటం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని అప్పనపల్లి గ్రామ నివాసి 50 ఏళ్ల కొత్తకాపు సత్తిరెడ్డి కుటుంబానికి ఎకరన్నర సొంత భూమి, 3 ఎకరాల కౌలు భూమి ఉంది. వ్యవసాయం కోసం బ్యాంకు ఇచ్చిన లోను చాలక ప్రైవేటుగా రూ.3ల వడ్డీ చొప్పున అప్పు తీసు కున్నాడు. వడ్డీ 5, 6 రెట్లు పెరిగి 7 లక్షలు దాటింది. అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. గంగా పురం నివాసి అయిన శ్రీనివాసరెడ్డి 5 ఎకరాలలో పత్తి పంటను వేశాడు. 5 లక్షల పైన అప్పు పెరిగి పత్తికి గిట్టుబాటు ధర రాక ఆత్మహత్య చేసుకున్నా డు. మిడ్జిల్ గ్రామంలోని జంగయ్య కుటుంబ పరి స్థితి మరీ దారుణంగా ఉంది. వీళ్లు ఇద్దరూ అన్నద మ్ములు. తమ్ముడు ప్రమాదవశాత్తూ చేతులు కోల్పో యాడు. అతని ముగ్గురు పిల్లలు అంధులు. జంగ య్యకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నాడు. తల్లితో సహా మొత్తం కుటుంబం బాధ్యత జంగ య్యదే. ఒకటిన్నర ఎకరం సొంత భూమి ఉండి, 7 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. 4 లక్షల 50 వేలు పైగా అప్పు ఉంది. నీళ్లు లేక పత్తి చేలు ఎండిపోయి జంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. కొట్రు గ్రామం లో చంద్రయ్య అనే 55 ఏళ్ల రైతుకు 4 లక్షల అప్పు ఉంది. 2 ఎకరాల పొలం. అప్పులు తెచ్చి 6, 7 సార్లు బోర్లు వేశాడు. బోర్లలో నీళ్లు పడక పత్తి పంట ఎండి పోయింది. ఈ కుటుంబాలకు దిక్కేమిటి? మనుగడ ఎలా? దాదాపుగా క్షేత్ర పర్యటనలోని అన్ని గ్రామాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అప్పుల బాధ, గిట్టుబాటు ధర లేకపోవటం, పశు వులకు నీళ్లు లేక పశుగ్రాసానికి కూడా అప్పు చేయ వలసి రావటం, కల్తీ ఎరువులు, పురుగుల మం దులు, పంటలు ఎండిపోయి మరోదారి లేక భూమినే నమ్ముకున్న రైతన్నలకు ఉరితాళ్లను నమ్ముకోవలసిన నికృష్ట పరిస్థితులు దాపురిం చాయి. దుర్భర దారిత్య్రంలో కొట్టుమిట్టాడుతున్న సన్నకారు, మధ్యతరగతి రైతు కుటుంబాలకు భరోసా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. విజ్ఞులు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు వ్యవ సాయ అనుకూల మౌలిక విధానాలను, ప్రత్యామ్నా యాలను పాలకులు తీసుకువచ్చేలా బాధ్యత వహిం చాలి. ఈ విపత్కర పరిస్థితుల నుండి రైతాంగాన్ని కాపాడేలా ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలి. (వ్యాసకర్త: కవిని ఆలూరి ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక సభ్యురాలు. 97016 05623) -
'వడ్డీ వ్యాపారుల ఒత్తిడితోనే ఆత్మహత్యలు'
హైదరాబాద్: రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా సంఘటితమై పోరాటాలకు సిద్ధం కావాలని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే రామచంద్రమూర్తి అన్నారు. ప్రభుత్వం దళారీ వ్యవస్థను నిర్మూలించాలని చెప్పారు. ఆదివారం ఇందిరాపార్క్ వద్ద నాగం జనార్ధన్ రెడ్డి చేపట్టిన కిసాన్ బచావో దీక్షను కే రామచంద్రమూర్తి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆత్మహత్యలపై సమాజం, ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం మంచిదికాదన్నారు. వడ్డీ వ్యాపారుల ఒత్తిడి వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. రాజకీయాలకతీతంగా రైతుల శ్రేయస్సు కోసం ముందడుగు వేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. -
అసెంబ్లీ రేపటికి వాయిదా
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. మంగళవారం సమావేశమైన అసెంబ్లీ రోజంతా రైతు ఆత్మహత్యలపైనే చర్చించిన విషయం తెలిసిందే. ప్రశ్నోత్తరాలతోపాటు ఇతర కార్యక్రమాలన్నింటిని రద్దు చేసి మరీ ఈ అంశంపై చర్చ మొదలుపెట్టారు. బుధవారం కూడా ఇదే అంశంపై చర్చించనున్నారు. మంగళవారం నాటి సమావేశంలో మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య కాసేపు మాటల యుద్ధం నెలకొనడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరోపక్క, శాసన మండలి కూడా బుధవారానికి వాయిదా పడింది. -
కదం తొక్కిన ఎర్రదండు
మధిర: అరుణ పతాకాలు.. రెడ్‌షర్ట్ వలంటీర్ల కవాతుతో పట్టణం ఎరుపెక్కింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా మధిరలో సీపీఎం జిల్లా 19వ మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. బి.వి.రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితర నాయకులు ముందు నడవగా కార్యకర్తలు వారిని అనుసరిస్తూ కొనసాగిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. స్థానిక రెడ్డి గార్డెన్స్ వద్ద ప్రారంభమైన ఈ కవాతు వైఎస్ఆర్ చౌరస్తా, రైల్వే ఓవర్‌బ్రిడ్జి, సీపీఎం కార్యాలయం, అంబేద్కర్ సెంటర్ మీదుగా సభా ప్రాంగణమైన టీవీఎం పాఠశాల వద్దకు చేరుకుంది. ప్రజానాట్యమండలి కళాకారుల ప్రదర్శనలు, బుచ్చిరెడ్డిపాలెం చిన్నారుల కోలాటాలు, గిరిజన సంప్రదాయ కొమ్ము నృత్యాలు అలరించాయి. అనంతరం జరిగిన బహిరంగసభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యహితంగా, కార్యకర్తల ఆలోచనల మేరకు పనిచేసే పార్టీ సీపీఎం ఒక్కటే అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తమకెంతో మేలు జరుగుతుందని తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని, అయితే వారి ఆశలు అడియాశలే అవుతున్నాయని అన్నారు. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టని అన్నారు. తెలంగాణలో 6 నెలల్లో 680 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, దీనిని బట్టి వ్యవసాయ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఇంత మంది రైతులు మరణించినా సీఎం కానీ, ఒక మంత్రి కానీ పరామర్శించిన దాఖలాలు లేవని విమర్శించారు. కనీసం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాలనే మానవత్వం కూడా ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిట్టల దొరలా మాట్లాడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు లేక రైతులు, పరిశ్రమల వారు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ సింగపూర్ పర్యటన ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి.. ఉన్న పాఠశాలలనే తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. 1956 స్థానికత పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సమంజసం కాదన్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికీ, ఇక్కడ స్థిరపడిన వారికి సంక్షేమ పథకాలు అందించాల్సిందేనని స్పష్టం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు పంపిణీ చేయడమే కాకుండా, భూస్వాముల కోరలు పీకి వారి వద్ద ఉన్న భూమిని కూడా సేకరించి దళితులకు పంపిణీ చేయాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే 2019 ఎన్నికల్లో సీపీఎంను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, సారంపల్లి మల్లారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు ప్రసంగించారు. సీపీఎం జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన మహాసభలో డివిజన్ కార్యదర్శి లింగాల కమల్‌రాజ్, నాయకులు బుగ్గవీటి సరళ, హైమావతి, సోమయ్య, బి.వెంకట్, సుబ్బారావు, సామినేని రామారావు, బండారు రవికుమార్, కాసాని ఐలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, బండి రమేష్ పాల్గొన్నారు. -
శోకమే మిగిలింది
అచ్చంపేట, న్యూస్‌లైన్: ఆరుగాలం కష్టించి పంటలు పండించి న అన్నదాతకు చివరికి శోకమే మిగిలింది. ఇటీవల కురిసిన వర్షాలకు రైతన్న రెక్కలకష్టం వర్షార్పణమైంది. వేల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, రాగులు, శనగ పంటలు కళ్లముందే నాశనమవడంతో రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. చేతికొచ్చిన పంటలు వరదలకు కొట్టుకుపోవడంతో కలతచెంది.. ఇద్ద రు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డాడు.కాగా, ఇప్పటివరకు ఎంతనష్టం వాటిల్లిందనే స్పష్టమైన నష్టం నివేదికలను అధికారులు తయారుచేయలేకపోయారు. నియోజకవర్గంలోని అచ్చంపేట, బల్మూర్, లింగాల, అమ్రాబాద్, ఉప్పునుంతల, వంగూరు మండలాల పరిధి లో సుమారు రూ.50కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. వరి 6908 ఎకరాలు, పత్తి 34,565 ఎకరాలు, వేరుశనగ 25,706 ఎకరాలు, మొక్కజొన్న 37,435 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక లెక్కలు చెబుతున్నాయి. చంద్రసాగర్, బల్మూర్, కొండనాగుల, బిల్లకల్ ప్రాంతాల్లోని చెరువుల్లో వదిలిన చేపలు కొట్టుకుపోవడంతో స్థానిక మత్సకారులకు తీవ్రనష్టం జరిగింది. చంద్రవాగు, కానుగులవాగు, రోళ్లపాయ, చంద్రసాగర్ వాగు, దుందుబీనది వాగులో వందకుపైగా కరెంట్ మోటార్లు కొట్టుకుపోయాయి. దీంతో తేరుకోలేనిస్థితిలో రైతులు ఉన్నారు. దెబ్బతిన్నరోడ్లు వర్షాలు, వరదతాకిడి కి అచ్చంపేట ఆర్అండ్బీ సబ్‌డివిజన్ పరిధిలో 300కి.మీ మేర రోడ్లు కొట్టుకుపోయాయి. అచ్చంపేట-శ్రీశైలం ప్రధాన రహదారి చంద్రవాగుపై తాత్కలిక కల్వర్టు తెగిపోయింది. ఈ రోడ్డు పునరుద్ధరణకు ఇంకా పదిరోజుల సమయం పట్టే అవకాశం ఉంది. తెల్కపల్లి-లింగాల మార్గంలో కల్వర్టు దెబ్బతిన్నాయి. ఒక అచ్చంపేట మండలంలోనే 23 రోడ్లు, కల్వర్టులు అధికారుల అంచనా. బొమ్మన్‌పల్లి -అక్కారం వెళ్లే మార్గంలో ఆరుప్రాంతాల్లో రోడ్లు తెగిపోయి 16 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. బొమ్మనపల్లి- సిద్ధాపూర్ రహదారిలోని మన్నగుబ్బలవాగు వద్ద తాత్కలికంగా మరమ్మతు పనులు చేపట్టారు. మర్లపాడుతండా వద్ద కానుగులవాగు బ్రిడ్జి వద్దరోడ్డు తెగిపోవడంతో ఘనపూర్- లింగాయిపల్లి గ్రామాల ప్రజలకు ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. మన్నెవారిపల్లి- చందంపేట మండల కేంద్రం మధ్య దుందుబీ నది పొంగిపొర్లడంతో రోడ్డు, కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. అమ్రాబాద్ మండలం మాదవానిపల్లి, జంగంరెడ్డిపల్లి, అమ్రాబాద్-మద్దిమడుగుల రహదారితో పాటు 23 రహదారులు, కల్వర్టులు కోతకు గురయ్యాయి. ఉప్పునుంతల మండలంలో 22 గ్రామాల రోడ్లు కోతకు గురయ్యాయి. అలాగే వంగూరు మండలంలో 35రోడ్లు దెబ్బతిన్నాయి. తెగిన చెరువులు, కుంటలు నియోజకవర్గంలో ఎనిమిది కుంటలు, ఆరు చెరువులు, అలుగు, తూములు పూర్తిగా దెబ్బతిన్నాయి. అచ్చంపేట మండల సిద్ధాపూర్ పాతచెరువుకు గండిపడి వందెకరాల్లో వరిపంట కొట్టుకుపోయింది. పొలాల్లో ఇసుకమేటలు, రాళ్లు, మట్టిదిబ్బలు పేరుకుపోయాయి. బల్మూర్ మండలం బాణాల, లక్ష్మిపల్లిలో కుంటలు తెగి పొలాలు కోతకు గురై వ్యవసాయనికి పనికిరాకుండా పోయాయి. రుసుల్ చెరువు వాగు పొంగిపొర్లడంతో బాణాల సమీపంలో పంటలు కొట్టుకుపోయాయి. నియోజకవర్గంలో 1789 ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్నట్లు రెవెన్యూ అధికారులు అంచనాలు తయారుచేశారు. ప్రభుత్వం పూర్తిగా ఇళ్లు కూలిపోయి నిరాశ్రుయులైన వారికి రూ.15వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ.6500, కొంతమేర దెబ్బతిన్న ఇంటికి రూ.2500, పూరి గుడిసెలకు రూ.900లు చెల్లించే విధంగా ఆదేశాలు జారీచేశారు. ప్రాణనష్టం.. వాగులు ఉధృతంగా పొంగిపొర్లడంతో నీటిలోకొట్టుకుపోయి ముగ్గురు మృతిచెందారు. జిన్‌కుంటకు చెందిన బాలమ్మ(48) పొలం నుంచి వస్తూ పెనిమిళ్లవాగు దాటుతుండగా కొట్టుకపోయి మృతిచెందింది. కుమ్మరోనిపల్లి వాగు దాటుతుండగా చిట్లంకుంటకు చెందిన నాకనమోని వెంకటయ్య(35)నీటిలో కొట్టుకుపోయి మృతిచెందాడు. లక్ష్మాపూర్(బీకే)కు చెందిన మూడావత్ లక్ష్మణ్(55) వర్షానికి తడిసి మృతిచెందాడు. లింగాల మండలం శ్రీరంగాపూర్‌కు చెందిన పోతయ్య(35) పొట్టకూటి కోసం అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లి వాగులో కొట్టుకుపోయి శవమై కనిపించాడు. బల్మూర్ మండలం పొలేపల్లికి చెందిన రైతు వాపని మల్లయ్య(45) వర్షానికి పంటనాశనం కావడంతో కలతచెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోరైతు లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణగౌడ్ (35)ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో బాధిత కుటుంబాల్లో తీరని విషాదమే మిగిలింది.