గత ప్రస్తుత ప్రభుత్వాల, విధానాల వలన నేడు తెలంగాణ రాష్ట్రంలో నిర్లి ప్తత, నిరాశతో కూడుకొని ఉన్న ఒక అనిశ్చిత వాతా వరణం నెలకొని ఉంది. మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. 1990 నుండి దేశవ్యా ప్తంగా ఉన్న గణాంకాలను పరిశీలిస్తే గత 20 ఏళ్లలో రైతుల ఆత్మహత్యలు 3 లక్షలపై మాటే అన్నది అతిశ యోక్తి కాదు. వ్యవసాయంలో వాణిజ్య పంటలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ సాంప్రదాయక, సేం ద్రియ విధానాలకు పూర్తిగా తిలోదకాలు ఇవ్వటం వలన మన దేశ వ్యవసాయ రంగం అతలాకుతల మవుతోంది. నానాటికీ అడుగంటుతున్న భూగర్భ జలాలు వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభం లోకి నెట్టివేశాయి.
మార్కెట్ రంగం మొత్తం దళారీల గుప్పెట్లో ఉండటం వలన రైతుల పంటలకు గిట్టు బాటు ధర అందకుండా పోయింది. తెలంగాణ విష యానికి వస్తే వర్షాభావం, గిట్టుబాటు ధర లేకపోవ టమే కాకుండా బ్యాంకులు ఎకరానికి రూ.20,000 లు మాత్రమే వడ్డీని ఇవ్వటం, ప్రైవేటు వ్యక్తులు, మైక్రోఫైనాన్స్ కంపెనీలు ఇచ్చిన అప్పులకు చక్ర వడ్డీల రూపంలో తడిసి మోపెడయి రైతులను ఆత్మ హత్యలకు పురికొల్పుతున్నాయి. మైక్రోఫైనాన్స్, ప్రైవేటు వ్యక్తులపై ప్రభుత్వానికి ఎటువంటి నియం త్రణ లేదు. 35 నుండి 40 శాతం దాకా వడ్డీ కట్టవల సిన దురవస్థలో రైతు తనువును చాలిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) తెలంగాణ కమిటీ క్షేత్రస్థాయి పర్య టనలో భాగంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలను పరిశీలించాలన్న తీర్మానాన్ని చేయ టం జరిగింది. అందులో భాగంగానే 16.10.2015 నాడు మహబూబ్‌నగర్ జిల్లాలోని అప్పనపల్లి, గంగాపురం, మిడ్జిల్, కొట్రు గ్రామాలను సందర్శిం చింది. పాలమూరు అధ్యయన వేదిక వారు అనేక మంది ఇతర మిత్రులు తమ సహకారాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రరవే నుండి జాతీయ కార్యదర్శి కాత్యాయనీ విద్మహే, భండారు విజయ, కవిని ఆలూరి పాల్గొనటం జరిగింది.
మహబూబ్‌నగర్ జిల్లాలోని అప్పనపల్లి గ్రామ నివాసి 50 ఏళ్ల కొత్తకాపు సత్తిరెడ్డి కుటుంబానికి ఎకరన్నర సొంత భూమి, 3 ఎకరాల కౌలు భూమి ఉంది. వ్యవసాయం కోసం బ్యాంకు ఇచ్చిన లోను చాలక ప్రైవేటుగా రూ.3ల వడ్డీ చొప్పున అప్పు తీసు కున్నాడు. వడ్డీ 5, 6 రెట్లు పెరిగి 7 లక్షలు దాటింది. అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. గంగా పురం నివాసి అయిన శ్రీనివాసరెడ్డి 5 ఎకరాలలో పత్తి పంటను వేశాడు. 5 లక్షల పైన అప్పు పెరిగి పత్తికి గిట్టుబాటు ధర రాక ఆత్మహత్య చేసుకున్నా డు. మిడ్జిల్ గ్రామంలోని జంగయ్య కుటుంబ పరి స్థితి మరీ దారుణంగా ఉంది. వీళ్లు ఇద్దరూ అన్నద మ్ములు.
తమ్ముడు ప్రమాదవశాత్తూ చేతులు కోల్పో యాడు. అతని ముగ్గురు పిల్లలు అంధులు. జంగ య్యకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నాడు. తల్లితో సహా మొత్తం కుటుంబం బాధ్యత జంగ య్యదే. ఒకటిన్నర ఎకరం సొంత భూమి ఉండి, 7 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. 4 లక్షల 50 వేలు పైగా అప్పు ఉంది. నీళ్లు లేక పత్తి చేలు ఎండిపోయి జంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. కొట్రు గ్రామం లో చంద్రయ్య అనే 55 ఏళ్ల రైతుకు 4 లక్షల అప్పు ఉంది. 2 ఎకరాల పొలం. అప్పులు తెచ్చి 6, 7 సార్లు బోర్లు వేశాడు. బోర్లలో నీళ్లు పడక పత్తి పంట ఎండి పోయింది. ఈ కుటుంబాలకు దిక్కేమిటి? మనుగడ ఎలా? దాదాపుగా క్షేత్ర పర్యటనలోని అన్ని గ్రామాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అప్పుల బాధ, గిట్టుబాటు ధర లేకపోవటం, పశు వులకు నీళ్లు లేక పశుగ్రాసానికి కూడా అప్పు చేయ వలసి రావటం, కల్తీ ఎరువులు, పురుగుల మం దులు, పంటలు ఎండిపోయి మరోదారి లేక భూమినే నమ్ముకున్న రైతన్నలకు ఉరితాళ్లను నమ్ముకోవలసిన నికృష్ట పరిస్థితులు దాపురిం చాయి. దుర్భర దారిత్య్రంలో కొట్టుమిట్టాడుతున్న సన్నకారు, మధ్యతరగతి రైతు కుటుంబాలకు భరోసా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. విజ్ఞులు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు వ్యవ సాయ అనుకూల మౌలిక విధానాలను, ప్రత్యామ్నా యాలను పాలకులు తీసుకువచ్చేలా బాధ్యత వహిం చాలి. ఈ విపత్కర పరిస్థితుల నుండి రైతాంగాన్ని కాపాడేలా ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలి.
(వ్యాసకర్త: కవిని ఆలూరి ప్రజాస్వామిక రచయిత్రుల
వేదిక సభ్యురాలు. 97016 05623)