తహసిల్దార్ ఇబ్బందులు
తహసిల్దార్ ఇబ్బందులు
Published Fri, Nov 1 2013 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM
1980ల నాటి కథాంశంతో నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ తెరకెక్కిన చిత్రం ‘కాళీచరణ్’. చైతన్యకృష్ణ, చాందిని జంటగా నటించారు. రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడు శ్రీ ప్రవీణ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీప్రవీణ్ మాట్లాడుతూ -‘‘ప్రచార చిత్రాలు విడుదలైనప్పట్నుంచీ ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ మొదలైంది. ఆరు నెలలు కోర్టులో, మూడు నెలలు సెన్సార్ బోర్డ్‌లో ఉండిపోయిందీ సినిమా.
ఎట్టకేలకు గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కానుంది. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని నా విశ్వాసం’’ అన్నారు. నిజాయితీగా విధులను నిర్వర్తించే ఓ తహసిల్దార్... సమాజంలో ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడో ఈ చిత్రం కళ్లకు కడుతుందని నాగినీడు చెప్పారు. పక్కా కమర్షియల్ అంశాలున్న సినిమా ఇదని చైతన్యకృష్ణ తెలిపారు. ఇంకా సంగీత దర్శకుడు నందన్‌రాజ్, ఎడిటర్ ప్రవీణ్‌పూడి కూడా మాట్లాడారు.
Advertisement
Advertisement