kalicharan
-
కాళీచరణ్ అరెస్ట్
రాయ్‌పూర్: మహాత్మాగాంధీపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందూ సాధువు కాళీచరణ్ మహరాజ్‌ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. తమ రాష్ట్రం నుంచి అనుమతి లేకుండా ఆయన్ను అరెస్ట్ చేయడం అంతర్రాష్ట్ర ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమేనంటూ మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కాళీచరణ్ మహరాజ్ అలియాస్ అభిజీత్ ధనంజయ్ సరాగ్ను ఖజురహోకు 25 కిలోమీటర్ల దూరంలోని బాగేశ్వర్ధామ్లోని ఓ అద్దె ఇంట్లో మారుపేరుతో ఉండగా గురువారం వేకువజామున అదుపులోకి తీసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మహాత్మాగాంధీని అవమానించిన వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు సంతోషిస్తున్నారా, లేక విచారిస్తున్నారా తెలపాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళీచరణ్‌ను గురువారం రాత్రి కోర్టులో హాజరుపరచగా రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించారు. ఛత్తీస్‌గఢ్ పోలీసుల చర్య తీవ్ర అభ్యంతరకరమని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభు త్వం అంతర్రాష్ట్ర ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిందని ఆరోపించారు. ఆదివారం రాయ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో కాళీచరణ్ మాట్లాడుతూ.. ‘రాజకీయాలు చేసి దేశాన్ని కబళించడమే ఇస్లాం లక్ష్యం. మన కళ్లముందే 1947లో దేశ విభజన జరిగింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోయాయి. గాంధీని తు పాకీతో కాల్చి చంపిన నాథూరాం గాడ్సేకి సెల్యూట్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు పశ్చాత్తాప పడటం లేదని, గాంధీని ద్వేషిస్తానని సర్దార్ పటేల్ ప్రధాని కాకుండా గాంధీయే అడ్డుపడ్డారని కూడా ప్రకటన చేశారు. కాళీచరణ్‌పై మహారాష్ట్రలోనూ పలు కేసులు నమోదయ్యాయి. -
అందుకే ‘కాళిచరణ్’కు ఓకే చెప్పాను
‘‘కె.భాగ్యరాజా నా గురువు. ఆయన రూపొందించిన ‘సిద్దూ ప్లస్ 2’ చిత్రం ద్వారానే నేను కథానాయికగా పరిచయమయ్యాను. భాగ్యరాజాగారి వద్ద నుంచి నటనలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను’’ అని చాందిని తమిళరాసన్ అన్నారు. ‘కాళిచరణ్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారీమె. చైతన్యకృష్ణ కథానాయకునిగా శ్రీప్రవీణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా చాందిని విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘‘తొలి సినిమా చేశాక... డిగ్రీ పూర్తి చేసే నిమిత్తం నటనకు కొంత విరామం ఇచ్చాను. ఓ తమిళ పత్రిక కవర్‌పేజీపై నా స్టిల్ చూసి శ్రీప్రవీణ్ నన్ను సంప్రదించారు. నటనకు మంచి అస్కారమున్న పాత్ర కావడంతో వెంటనే ‘కాళిచరణ్’కు అంగీకారం తెలిపాను. ఇందులో నా పాత్ర పేరు తీర్థ. బ్రాహ్మణ యువతి పాత్ర. లుక్ పరంగా కాస్త డీ గ్లామరైజ్డ్గా ఉంటాను. ఈ పాత్ర కోసం నా శారీరకభాషను కూడా మార్చుకున్నాను. నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది’’ అని చెప్పారు. శ్రీదేవి, జ్యోతికలు నటిగా తనకు స్ఫూర్తి అని, తాను పవన్‌కల్యాణ్ వీరాభిమానినని చాందిని చెప్పారు. -
మా గురువు రామ్‌గోపాల్‌వర్మ మెచ్చుకున్నారు
‘‘1980ల్లో గుజరాత్‌లోని పలన్‌పూర్‌లో జరిగిన ఓ యధార్థ సంఘటన స్ఫూర్తితో ‘కాళీచరణ్’ కథ తయారు చేసుకున్నా. తెలుగు నేటివిటీకి సౌలభ్యంగా ఉంటుందని మహబూబ్‌నగర్‌లోని పాలమూరు నేపథ్యాన్ని సినిమాలో చూపించాను. అంతేకానీ పాలమూరులో జరిగిన సంఘటనలు దీనికి స్ఫూర్తి కాదు’’ అని శ్రీప్రవీణ్ చెప్పారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘కాళీచరణ్’ ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీప్రవీణ్ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘రాజకీయ నేపథ్యంలో నడిచే కథ ఇది. ఇందులో లవ్, యాక్షన్, సెంటిమెంట్‌తో పాటు అన్ని వాణిజ్య అంశాలుంటాయి. సినిమాలోని ప్రతి పాత్రా సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. హీరో హీరోయిన్లు చైతన్యకృష్ణ, చాందిని వారి పాత్రల్లో జీవించారు. నందన్‌రాజ్ స్వరపరచిన పాటలు విని ఇళయరాజా తరహాలో ఉన్నాయని చాలామంది మెచ్చుకున్నారు. ఈ సినిమా చూసి మా గురువు రామ్‌గోపాల్‌వర్మ మెచ్చుకున్నారు. చాలామంది బాలీవుడ్ నటులు కూడా సినిమా గురించి ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు’’ అని చెప్పారు. -
తహసిల్దార్ ఇబ్బందులు
1980ల నాటి కథాంశంతో నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ తెరకెక్కిన చిత్రం ‘కాళీచరణ్’. చైతన్యకృష్ణ, చాందిని జంటగా నటించారు. రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడు శ్రీ ప్రవీణ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీప్రవీణ్ మాట్లాడుతూ -‘‘ప్రచార చిత్రాలు విడుదలైనప్పట్నుంచీ ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ మొదలైంది. ఆరు నెలలు కోర్టులో, మూడు నెలలు సెన్సార్ బోర్డ్‌లో ఉండిపోయిందీ సినిమా. ఎట్టకేలకు గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కానుంది. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని నా విశ్వాసం’’ అన్నారు. నిజాయితీగా విధులను నిర్వర్తించే ఓ తహసిల్దార్... సమాజంలో ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడో ఈ చిత్రం కళ్లకు కడుతుందని నాగినీడు చెప్పారు. పక్కా కమర్షియల్ అంశాలున్న సినిమా ఇదని చైతన్యకృష్ణ తెలిపారు. ఇంకా సంగీత దర్శకుడు నందన్‌రాజ్, ఎడిటర్ ప్రవీణ్‌పూడి కూడా మాట్లాడారు. -
సంచలన కథాంశం!
1980ల్లో మహబూబ్‌నగర్‌లో జరిగిన ఓ యథార్థ సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆ కథాంశంతో శ్రీ ప్రవీణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కాళీచరణ్. కృష్ణచైతన్య, చాందిని ఇందులో హీరోహీరోయిన్లు. బేబి మనస్విని సమర్పణలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ -‘‘ఈ కథాకథనాలు కచ్చితంగా క్లాస్‌నీ మాస్‌నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పోరాట సన్నివేశాలు, పతాక సన్నివేశాలు, ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. ‘కాళీచరణ్’గా కృష్ణచైతన్య ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ కనబరిచాడు. ఇందులోని కొన్ని పాత్రలు చాలా కాలం ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. నందన్‌రాజ్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అని తెలిపారు. పంకజ్, కవిత, నాగినీడు, రావు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, విశ్వ దేవబత్తుల.