సంచలన కథాంశం!
సంచలన కథాంశం!
Published Mon, Oct 28 2013 11:22 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
1980ల్లో మహబూబ్‌నగర్‌లో జరిగిన ఓ యథార్థ సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆ కథాంశంతో శ్రీ ప్రవీణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కాళీచరణ్. కృష్ణచైతన్య, చాందిని ఇందులో హీరోహీరోయిన్లు. బేబి మనస్విని సమర్పణలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ -‘‘ఈ కథాకథనాలు కచ్చితంగా క్లాస్‌నీ మాస్‌నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పోరాట సన్నివేశాలు, పతాక సన్నివేశాలు, ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. ‘కాళీచరణ్’గా కృష్ణచైతన్య ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్ కనబరిచాడు. ఇందులోని కొన్ని పాత్రలు చాలా కాలం ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. నందన్‌రాజ్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అని తెలిపారు. పంకజ్, కవిత, నాగినీడు, రావు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, విశ్వ దేవబత్తుల.
Advertisement
Advertisement