పెద్ద నోట్ల రద్దు ఇతివృత్తంగా కన్ల కాసు కాట్టప్పా
పెద్ద నోట్ల రద్దు ఇతివృత్తంగా కన్ల కాసు కాట్టప్పా
Published Sun, Nov 20 2016 2:09 AM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న అంశం నోట్ల మార్పిడి. ప్రజలంతా పనులు మానుకుని ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయమే. సరిగ్గా ఇలాంటి పరిస్థితులకు అద్దం పట్టే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం కన్ల కాసు కాట్టప్పా అంటున్నారు దర్శకుడు మెజర్ గౌతమ్. ప్రఖ్యాత నటుడు దివంగత మేజర్ సుందర్‌రాజన్ కొడుకు ఇతనన్నది గమనార్హం.
అరవింద్ ఆకాశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నటి చాందిని, అశ్వతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎంఎస్.బాబు, యోగిబాబు, వి సు, నృత్యదర్శకుడు కల్యాణ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. మలేషియాకు చెందిన సుగర్ కల్యాణ్, అరవింద్, కమల్‌నాథన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఒక ధనవంతుడు తన వద్ద ఉన్న నల్లధనం రూ.100 కోట్లను డాలర్లుగా మార్చుకోవడానికి మలేషియా పంపుతాడన్నారు.
అది అక్కడ పలువురి చేతులు మారుతుందని.. ప్రతి వాడు ఆ సొమ్మును సొంతం చేసుకోవాలని ఆశపడతారని.. అయితే, ఆ వంద కోట్లు చివరికి ఎవరి చేతికి చేరాయన్న విషయాలను పూర్తి హాస్యభరితంగా తెరకెక్కించినట్లు తెలిపారు.
Advertisement
Advertisement