అభిమానంతో ప్రేమ... | 'Kiraak' to be released on 22nd | Sakshi
Sakshi News home page

అభిమానంతో ప్రేమ...

Published Sun, Aug 10 2014 12:06 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

అభిమానంతో ప్రేమ... - Sakshi

అభిమానంతో ప్రేమ...

 పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు ఇద్దరూ టాప్‌స్టార్స్. వీరి వీరాభిమానులు ప్రేమలో పడితే ? ఈ నేపథ్యంలో ‘కిరాక్’ చిత్రం రూపొందింది. అనిరుథ్, చాందిని ఇందులో హీరో హీరోయిన్లు. హారిక్ దేవభక్తుని దర్శకత్వంలో డి. గోపీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇదొక రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్. ఇందులో హీరో పవన్ కల్యాణ్ వీరాభిమాని కాగా, హీరోయిన్ మహేశ్‌బాబు అంటే ప్రాణం పెట్టేస్తుంది. వీరిద్దరి మధ్యనా ప్రేమకథ ఆసక్తి రేకెత్తిస్తుంది’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇందులో పోసాని కృష్ణమురళి వెన్నెల కిశోర్ పాత్రలు ఆద్యంతం వినోదాన్ని కురిపిస్తాయి. క్లాస్‌నీ మాస్‌నీ ఆకట్టుకునే కథాంశం ఇది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అజయ్ అరసాద, సమర్పణ: డి. ఉమాదేవి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement