
విదార్థ్ వండి ప్రారంభం
యువ నటుడు విదార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వండి శనివారం ప్రారంభమైంది. కుట్రమే దండణై వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఈయన నటిస్తున్న చిత్రం ఇది. ఇందులో విదార్థ్‌కు జంటగా నటి చాందిని తమిళరసన్ నటిస్తున్నారు. హీరోకు స్నేహితులుగా కిషోర్, శ్రీరామ్‌కార్తీక్ నటిస్తుండగా విభిన్న పాత్రలోఎస్‌ఐగా జాన్‌విజయ్ నటిస్తున్నారు. గణేశ్ ప్రసాద్ రెండో కథానాయకుడిగానూ అరుళ్‌దాస్ ప్రతినాయకుడిగానూ, లొల్లుసభ స్వామినాథన్, మదన్‌బాబు హాస్య పాత్రల్లోనూ అలరించనున్నారు.
రుబీ ఫిలింస్ పతాకంపై హసీర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతల్ని రాజేశ్‌బాలా నిర్వహిస్తున్నారు. దీనికి రాకేష్ నారాయణన్ చాయాగ్రహణం, సురాజ్ ఎస్.గ్రూప్ సంగీతాన్ని, రిసాల్ జయ్‌నీ ఎడిటింను, మోహన్ మహేంద్రన్ కళాదర్శకత్వాన్ని అందిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శనివారం నుంచి ఏకధాటిగా షూటింగ్‌ను నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు.