anandaraj
-
ఎంజీఆర్ పాండియన్ అంటున్న ఆమిర్
తమిళసినిమా: పాత సక్సెస్ఫుల్ చిత్రాల పేర్లతో తాజాగా చిత్రాలు తెరకెక్కడం అన్నది సాధారణం. ఆ మధ్య శివకార్తికేయన్ రజనీ మురుగన్ అంటూ వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా రామ్, పరుత్తివీరన్ వంటి సంచలన చిత్రాల దర్శకుడు ఆమిర్ నటుడిగా రంగప్రవేశం చేసి చా లా కాలమే అయ్యింది. ఆయన తాజాగా రాజ కీయ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రంలో కథా నాయకుడిగా నటించడానికి రెడీ అవుతున్నా రు. దీనికి ప్రఖ్యాత నటుడు, రాజకీయ చరిత్రకారుడు ఎంజీఆర్ పేరుతో సూపర్‌స్టార్ నటిం చిన సక్సెస్ఫుల్ చిత్రం పాండియన్ పేరును జోడించి ఎంజీఆర్ పాండియన్ అనే టైటిల్‌ను నిర్ణయించడం విశేషం. దీన్ని మూన్ పిక్చర్స్ పతాకంపై ఆదం బావ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇందులో ఆమిర్‌కు జంటగా ‘555’ చిత్రం ఫేమ్ చాందిని నాయకిగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో ఆనందరాజ్, పోన్వన్నన్, గంజాకరుప్పు, రాజసిమ్మన్, ఇమాన్‌అన్నాచ్చి, పావాలక్ష్మణన్, వి న్సెంట్రాయ్ నటిస్తున్నారు. విద్యాసాగర్ సంగీతం, దేవరాజ్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది సమకాలీన రాజకీయాలకు అద్దం పట్టే చిత్రంగా ఉంటుం దన్నారు. అమైదిపడై చిత్రం తరువాత ఆ తరహా రాజకీ య నేపథ్యంలో సాగే చి త్రంగా ఉంటుందని తెలి పారు. చిత్రాన్ని తేని, మదు రై, చెన్నై ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. -
మరగదనాణయంకు తగ్గని ఆదరణ
తమిళసినిమా: మరగదనాణయం లాంటి సోషియో ఫాంటసీ కామెడీ చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రాలు రావడం ముఖ్యం కాదు ప్రేక్షకులను అలరించాలి. అలా ఆబాలగోపాలం ఆదరణను చూరగొంటున్న చిత్రం మరగదనాణయం.ఆది, నిక్కీగల్రాణి జంటగా నటించిన ఈ చిత్రంలో మునీష్కాంత్, ఆనందరాజ్ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని నవదర్శకుడు ఏఆర్కే. శరవణన్‌ను పరిచయం చేస్తూ యాక్సెస్ ఫిలిం ఫాక్టరీ పతాకంపై ఢిల్లీబాబు నిర్మించిన చిత్రం మరగదనాణయం. మూడు వారాల ముందు తెరపైకి వచ్చిన ఈ చిత్రం తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది. కాగా కోలీవుడ్‌లో థియేటర్ల సమ్మె కారణంగా నాలుగు రోజులు ప్రదర్శనలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా అనంతరం రీ రిలీజ్ అయిన మరగదనాణయం తరగని ప్రేక్షకాదరణతో దూసుకుపోతోందని సంతోషాన్ని వక్తం చేశారు ఆ చిత్ర నిర్మాత ఢిల్లీబాబు. ఈ చిత్రం తన నమ్మకాన్ని పెంచడంతో పాటు, బాధ్యతను అధికరింపజేసిందన్నారు. మంచి కంటెంట్‌తో ఏఆర్కే.శరవణన్ లాంటి ప్రతిభావంతులైన కొత్తవారిని ప్రోత్సహించడానికి మరగదనాణయం చిత్రం ధైర్యాన్నిచిందన్నారు.ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఢిల్లీబాబు అన్నారు. -
నా కూతుర్ని నేను కిడ్నాప్ చేశానా?
చెన్నై: తన కూతుర్ని కిడ్నాప్ చేసిందంటూ నటి వనితపై మాజీ భర్త ఆనంద్‌రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే... చంద్రలేఖ, మాణిక్యం చిత్రాల్లో నాయకిగా నటించిన నటి వనిత తల్లిదండ్రులు సీనియర్ నటుడు విజయకుమార్, మంజుల. బుల్లితెర నటుడు ఆకాశ్‌ను ప్రేమించి పెళ్లాడిన వనిత కొంత కాలం తర్వాత ఆయన నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ఆనందరాజ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి జయనిత అనే 8 ఏళ్ల కూతురు ఉంది. కాగా మసస్పర్ధల కారణంగా వనిత, ఆనంద్‌రాజ్‌లు విడిపోయారు. కూతురు తండ్రి వద్దే పెరుగుతోంది. నటి అల్ఫాన్స్ సోదరుడు, డాన్స్‌మాస్టర్ అయిన రాబర్ట్‌ను వనిత మూడో పెళ్లి చేసుకుంది. ఇటీవల వీరిద్దరూ కూడా విడిపోయినట్లు సమాచారం. కాగా తాజాగా వనితపై రెండో మాజీ భర్త ఆనంద్‌రాజ్ తన కూతుర్ని కిడ్నాప్ చేసిందంటూ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హైదరాబాద్ పోలీసులు వనితను విచారించడానికి చెన్నైకి చేరుకున్నారు. అయితే వనిత కోవైలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కూతురి కిడ్నాప్‌పై స్పందించిన నటి వనిత స్పందిస్తూ.... ఆనంద్‌రాజ్ నుంచి విడాకులు పొందాక అతని అడ్రస్ కూడా తనకు తెలియదని, తనే కూతుర్ని తీసుకెళ్లాడని తెలిపింది. అనంతరం తాను ఈమెయిల్ ద్వారా కూతురు గురించి తెలుసుకున్నానని చెబుతూ... ఆనంద్‌రాజ్ కూతురికి తన గురించి లేనిపోనివి నూరి పోశాడని ఆరోపించింది. అయితే ఈ మెయిల్ ద్వారా తన ఫోన్ నెంబర్ తెలుసుకున్న జయనిత తండ్రి దగ్గర నుంచి తనను తీసుకెళ్లమని అభ్యర్ధించిందని పేర్కొంది. దీంతో తాను హైదరాబాద్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసి, వారితోపాటు ఆనంద్‌రాజ్ ఇంటికి వెళ్లి కూతురిని తీసుకొచ్చానని ఇది కిడ్నాప్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రస్తుతం తాను వేరే ప్రాంతంలో ఉన్నానని, తన కూతురు కోసం అరెస్ట్ అవడానికి ఎప్పుడూ తాను సిద్ధమేనన్నారు. అయితే దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని వనిత తెలిపారు.