మరగదనాణయంకు తగ్గని ఆదరణ | "Maragadhanayam" is about raising his trust and loyalty. | Sakshi
Sakshi News home page

మరగదనాణయంకు తగ్గని ఆదరణ

Published Sun, Jul 9 2017 2:30 AM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM

మరగదనాణయంకు తగ్గని ఆదరణ

మరగదనాణయంకు తగ్గని ఆదరణ

తమిళసినిమా: మరగదనాణయం లాంటి సోషియో ఫాంటసీ కామెడీ చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రాలు రావడం ముఖ్యం కాదు ప్రేక్షకులను అలరించాలి. అలా ఆబాలగోపాలం ఆదరణను చూరగొంటున్న చిత్రం మరగదనాణయం.ఆది, నిక్కీగల్రాణి జంటగా నటించిన ఈ చిత్రంలో మునీష్‌కాంత్, ఆనందరాజ్‌  ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని నవదర్శకుడు ఏఆర్‌కే. శరవణన్‌ను పరిచయం చేస్తూ యాక్సెస్‌ ఫిలిం ఫాక్టరీ పతాకంపై ఢిల్లీబాబు నిర్మించిన చిత్రం మరగదనాణయం.

మూడు వారాల ముందు తెరపైకి వచ్చిన ఈ చిత్రం తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది. కాగా కోలీవుడ్‌లో థియేటర్ల సమ్మె కారణంగా నాలుగు రోజులు ప్రదర్శనలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా అనంతరం రీ రిలీజ్‌ అయిన మరగదనాణయం తరగని ప్రేక్షకాదరణతో దూసుకుపోతోందని సంతోషాన్ని వక్తం చేశారు ఆ చిత్ర నిర్మాత ఢిల్లీబాబు. ఈ చిత్రం తన నమ్మకాన్ని పెంచడంతో పాటు, బాధ్యతను అధికరింపజేసిందన్నారు. మంచి కంటెంట్‌తో ఏఆర్‌కే.శరవణన్‌ లాంటి ప్రతిభావంతులైన కొత్తవారిని ప్రోత్సహించడానికి మరగదనాణయం చిత్రం ధైర్యాన్నిచిందన్నారు.ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఢిల్లీబాబు అన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement