మరగదనాణయంకు తగ్గని ఆదరణ
తమిళసినిమా: మరగదనాణయం లాంటి సోషియో ఫాంటసీ కామెడీ చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రాలు రావడం ముఖ్యం కాదు ప్రేక్షకులను అలరించాలి. అలా ఆబాలగోపాలం ఆదరణను చూరగొంటున్న చిత్రం మరగదనాణయం.ఆది, నిక్కీగల్రాణి జంటగా నటించిన ఈ చిత్రంలో మునీష్కాంత్, ఆనందరాజ్ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని నవదర్శకుడు ఏఆర్కే. శరవణన్‌ను పరిచయం చేస్తూ యాక్సెస్ ఫిలిం ఫాక్టరీ పతాకంపై ఢిల్లీబాబు నిర్మించిన చిత్రం మరగదనాణయం.
మూడు వారాల ముందు తెరపైకి వచ్చిన ఈ చిత్రం తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది. కాగా కోలీవుడ్‌లో థియేటర్ల సమ్మె కారణంగా నాలుగు రోజులు ప్రదర్శనలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా అనంతరం రీ రిలీజ్ అయిన మరగదనాణయం తరగని ప్రేక్షకాదరణతో దూసుకుపోతోందని సంతోషాన్ని వక్తం చేశారు ఆ చిత్ర నిర్మాత ఢిల్లీబాబు. ఈ చిత్రం తన నమ్మకాన్ని పెంచడంతో పాటు, బాధ్యతను అధికరింపజేసిందన్నారు. మంచి కంటెంట్‌తో ఏఆర్కే.శరవణన్ లాంటి ప్రతిభావంతులైన కొత్తవారిని ప్రోత్సహించడానికి మరగదనాణయం చిత్రం ధైర్యాన్నిచిందన్నారు.ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఢిల్లీబాబు అన్నారు.