40 మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు షాక్ | security for aamir sharukh trimmed withdrawn for some others | Sakshi
Sakshi News home page

40 మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు షాక్

Published Fri, Jan 8 2016 11:07 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

40 మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు షాక్ - Sakshi

40 మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు షాక్

బాలీవుడ్ ప్రముఖులకు ముంబై పోలీసులు ఇస్తున్న సెక్యూరిటీ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న 40 మంది బాలీవుడ్ సినీ ప్రముఖుల్లో చాలామందికి సెక్యూరిటీ అవసరం లేనందున వారికి ప్రస్తుతం ఇస్తున్న సెక్యూరిటీని తొలగిస్తున్నట్టు ప్రకటించారు. కేవలం 15 మందికి మాత్రమే సెక్యూరిటీ ఇవ్వనున్నారు.

ఈ లిస్ట్లో బాలీవుడ్ టాప్ హీరోలు ఆమిర్ ఖాన్, షారూక్ ఖాన్ లాంటి వారు కూడా ఉన్నారు. 2013లో మైనేమ్ ఈజ్ ఖాన్ సినిమా విడుదల సమయంలో షారూఖ్ ఖాన్కు భద్రత పెంచారు. రెండు నెలల క్రితం మత అసహనంపై వ్యాఖ్యల సందర్భంగా అమీర్ ఖాన్ భద్రతను కూడా పటిష్టం చేశారు. అయితే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగే అవకాశం లేకపోవడంతో ఈ ఇద్దరు టాప్ హీరోలకు ఇచ్చిన భద్రతను కుదించారు. ఇకపై ఆయుధాలు ధరించిన ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే వీరికి రక్షణ కల్పించనున్నారు. భారీ స్థాయిలో సిబ్బందిని సెలబ్రిటీల భద్రతకే కేటాయించటం వల్ల తమకు సిబ్బంది కొరత ఎదురవుతోందని భావించిన పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

బాలీవుడ్ ప్రముఖులు విదు వినోద్ చోప్రా, రాజ్ కుమార్ హిరానీ, ఫరాఖాన్, కరీం మొరానీ లాంటి కొందరికి ఉన్న భద్రతను పూర్తిగా తొలగించగా అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, లతామంగేష్కర్ లాంటి ప్రముఖులకు గతం ఇచ్చినట్టుగానే భద్రతను  కొనసాగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement