సెయింట్ లూయిస్ (అమెరికా) : సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూశాడు. అలెగ్జాండర్ గ్రిష్‌చుక్ (రష్యా)తో జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 35 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఇతర గేముల్లో వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా) 73 ఎత్తుల్లో హికారు నకముర (అమెరికా)పై, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) 40 ఎత్తుల్లో ఫాబియానో (అమెరికా)పై గెలుపొందగా... మాక్సిమి లాగ్రేవ్ (ఫ్రాన్స్)- అరోనియన్ (అర్మేనియా); అనీష్ గిరి (నెదర్లాండ్స్)-సో వెస్లీ (అమెరికా)ల మధ్య జరిగిన గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.