
ఆల్టిబాక్స్ నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా ఆరో ‘డ్రా’ నమోదు చేశాడు. నార్వేలోని స్టావెంజర్ నగరంలో ఆదివారం మమెదైరోవ్ (అజర్‌బైజాన్)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఆరో రౌండ్ తర్వాత ఆనంద్ మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment