మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నాలుగో ‘డ్రా’ నమోదు చేశాడు. అనీశ్ గిరి (నెదర్లాండ్స్)తో శనివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను నల్లపావులతో ఆడిన ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఏడో రౌండ్ తర్వాత ఆనంద్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.