
స్టావెంజర్ (నార్వే): ఆల్టిబాక్స్ నార్వే చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. హికారు నకముర (అమెరికా)తో మంగళవారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో సోమవారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేశాడు. 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో రెండో రౌండ్ తర్వాత ఆనంద్ ఒక పాయింట్‌తో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment