
షంకిర్ (అజర్‌బైజాన్): వుగర్ గషిమోవ్ మెమోరియల్ చెస్ టోర్నీలో భారత దిగ్గజ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐదు రౌండ్లలో అతను ఒక్క నార్వే సూపర్ గ్రాండ్‌మాస్టర్ కార్ల్‌సన్‌తో మాత్రమే ఓడిపోయాడు. రెండు గేమ్‌ల్లో గెలిచి మరో రెండు గేముల్ని డ్రా చేసుకున్నాడు. దీంతో 3 పాయింట్లతో కర్యాకిన్ (రష్యా)తో కలిసి ఉమ్మడిగా రెండోస్థానంలో నిలిచాడు. కార్ల్‌సన్ (నార్వే) 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐదో రౌండ్ గేమ్‌లో అనిశ్ గిరి (నెదర్లాండ్స్)పై ఆనంద్ గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment