‘ఫిడే’ గ్రాండ్‌ప్రి చెస్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ సంచలనం సృష్టించాడు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన ఆరో రౌండ్‌లో హరికృష్ణ 38 ఎత్తుల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ లెవాన్ అరోనియన్ (అర్మేనియా)ను ఓడించాడు.
ఈ టోర్నీలో హరికృష్ణకిది రెండో విజయం. ఆరో రౌండ్ తర్వాత హరికృష్ణ నాలుగు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.