సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నమెంట్‌లో కోవిద్ కుశాల్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరుగు తోన్న ఈ టోర్నీలో మూడు రౌండ్లు ముగిసేసరికి 3 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి తొలి స్థానాన్ని పంచుకున్నాడు. శనివారం జరిగిన జూనియర్స్ మూడోరౌండ్ గేమ్‌లో సాయి అఖిల (2)పై కుశాల్ (3), నిగమశ్రీ(2)పై సూర్య (3), పి. వరుణ్ (2)పై ఆరుషి (3) గెలుపొందారు. అభిరామ్ (2.5)తో సాయి (2.5), ప్రజ్ఞేశ్ (2.5)తో సహస్రాన్షి (2.5) తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. ఓపెన్ కేటగిరీలో మూడోరౌండ్‌లోనూ సాయిరాజ్ (2)పై మల్లేశ్వర రావు (3), ఫయాజ్ (2)పై పీవీవీ శిభు (3), అభిరామ్ (2)పై శ్రీనివాస్ (3), సాయి కిరణ్ (2) ఫణి (3) గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment