Brilliant chess tournament
-
అగ్రస్థానంలో కుశాల్
సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నమెంట్లో కోవిద్ కుశాల్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరుగు తోన్న ఈ టోర్నీలో మూడు రౌండ్లు ముగిసేసరికి 3 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి తొలి స్థానాన్ని పంచుకున్నాడు. శనివారం జరిగిన జూనియర్స్ మూడోరౌండ్ గేమ్‌లో సాయి అఖిల (2)పై కుశాల్ (3), నిగమశ్రీ(2)పై సూర్య (3), పి. వరుణ్ (2)పై ఆరుషి (3) గెలుపొందారు. అభిరామ్ (2.5)తో సాయి (2.5), ప్రజ్ఞేశ్ (2.5)తో సహస్రాన్షి (2.5) తమ గేమ్‌లను డ్రా చేసుకున్నారు. ఓపెన్ కేటగిరీలో మూడోరౌండ్‌లోనూ సాయిరాజ్ (2)పై మల్లేశ్వర రావు (3), ఫయాజ్ (2)పై పీవీవీ శిభు (3), అభిరామ్ (2)పై శ్రీనివాస్ (3), సాయి కిరణ్ (2) ఫణి (3) గెలిచారు. -
చెస్ చాంప్స్ అర్జున్, ఖాన్
హైదరాబాద్: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నమెంట్లో అర్జున్, ఎస్. ఖాన్ అగ్రస్థానంలో నిలిచి టైటిల్స్‌ను దక్కించుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో జరిగిన ఈ టోర్నీ ఓపెన్ కేటగిరీలో ఎస్. ఖాన్ తో పాటు ఎం. వై. రాజు, సృజన్ కీర్తన్లు కూడా చెరో 5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఖాన్‌కు అగ్రస్థానం దక్కగా, రాజు, సృజన్లకు వరుసగా రెండు,మూడు స్థానాలు లభించాయి. జూనియర్స్ కేటగిరీలో అర్జున్ (5.5)... వశిష్ట రమణ (5)పై గెలుపొంది జూనియర్స్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఇతర విభాగాల విజేతలు అండర్-14 బాలురు: 1.వశిష్ట రమణ, 2. కృష్ణ దేవర్ష్; బాలికలు: 1. నిత్య; అండర్-12 బాలురు: 1. ఓజస్, 2. కె. ఉమేశ్; బాలికలు: 1.స్నేహ, 2. అద్వైత శర్మ; అండర్-10 బాలురు: 1. తరుణ్, 2. హిమేశ్; బాలికలు: 1. మైత్రి, 2. సాయి నితీష, నిత్య; అండర్-8 బాలురు: 1. సాయి రిషిరాజ్, 2. కమల్; బాలికలు: 1. నిగమ శ్రీ, 2.శ్రీవర్ష అండర్-6 బాలురు: 1. డి. సాత్విక్, 2. జి. ప్రణవ్; బాలికలు: 1. కె. అర్పిత. -
చాంప్స్ వరుణ్, సేవిత
బ్రిలియంట్ ట్రోఫీ చెస్ సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ చెస్ టోర్నీ ఓపెన్ కేటగిరీ విభాగంలో వి. వరుణ్ విజేతగా నిలిచాడు. 6 రౌండ్ల ద్వారా అతను 5.5 పాయింట్లు స్కోర్ చేశాడు. చెరో 5 పాయింట్లు సాధించిన ఎంవై రాజు, విశ్వనాథ్ శాండిల్య రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. జూనియర్ కేటగిరీలో సాధువస్వాని ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన సేవిత విజు ట్రోఫీని గెలుచుకుంది. 6 రౌండ్లలో సేవిత 5.5 పాయింట్లు సాధించింది. సాయి అమిత్ (5), రుత్విక్ పొన్నపల్లి (5)లకు రెండు, మూడు స్థానాలు దక్కాయి. ఓపెన్ కేటగిరీ ఫలితాలు: 1. వి.వరుణ్, 2. ఎంవై రాజు, 3. విశ్వనాథ్ శాండిల్య, 4. ఎస్వీసీ చక్రవర్తి, 5. ఎస్.ఖాన్, 6. ఎన్. రామ్మోహనరావు, 7. టి.రమణ్ కుమార్, 8. మురళీమోహన్, 9. వీఎస్ఎన్ మూర్తి, 10. ఎన్సీ రామ్. వివిధ వయో విభాగపు కేటగిరీ ఫలితాలు: (బాలురు) అండర్-14: 1. తరుణ్, 2. ముదబ్బిర్; అండర్-12: 1. సాయి అమిత్, 2. జయంత్; అండర్-10: 1. రుత్విక్, 2. పి. సాయిరోహన్; అండర్-8: 1. రోహిత్ యాదవ్, 2. సాకేత్ కుమార్; అండర్-6: ఎస్. ప్రణయ్, 2. అమోఘ్ (బాలికలు) అండర్-10: 1. హన్సిక; అండర్-8: 1. రచిత, 2. జావళి; అండర్-6: 1. నిగమశ్రీ, 2. హాసిని; ఉత్తమ మహిళా క్రీడాకారిణి: లాస్యప్రియ, ఉత్తమ వెటరన్ క్రీడాకారుడు: పీవీ దుర్గాప్రసాద్