హైదరాబాద్: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నమెంట్‌లో అర్జున్, ఎస్. ఖాన్ అగ్రస్థానంలో నిలిచి టైటిల్స్‌ను దక్కించుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌లో జరిగిన ఈ టోర్నీ ఓపెన్ కేటగిరీలో ఎస్. ఖాన్ తో పాటు ఎం. వై. రాజు, సృజన్ కీర్తన్‌లు కూడా చెరో 5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఖాన్‌కు అగ్రస్థానం దక్కగా, రాజు, సృజన్‌లకు వరుసగా రెండు,మూడు స్థానాలు లభించాయి. జూనియర్స్ కేటగిరీలో అర్జున్ (5.5)... వశిష్ట రమణ (5)పై గెలుపొంది జూనియర్స్ టైటిల్‌ను దక్కించుకున్నాడు.
ఇతర విభాగాల విజేతలు
అండర్-14 బాలురు: 1.వశిష్ట రమణ, 2. కృష్ణ దేవర్ష్; బాలికలు: 1. నిత్య; అండర్-12 బాలురు: 1. ఓజస్, 2. కె. ఉమేశ్; బాలికలు: 1.స్నేహ, 2. అద్వైత శర్మ; అండర్-10 బాలురు: 1. తరుణ్, 2. హిమేశ్; బాలికలు: 1. మైత్రి, 2. సాయి నితీష, నిత్య; అండర్-8 బాలురు: 1. సాయి రిషిరాజ్, 2. కమల్; బాలికలు: 1. నిగమ శ్రీ, 2.శ్రీవర్ష
అండర్-6 బాలురు: 1. డి. సాత్విక్, 2. జి. ప్రణవ్; బాలికలు: 1. కె. అర్పిత.