ముంబై: మేయర్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. రెండో రౌండ్‌లో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) రాసెట్ జియాత్‌దినోవ్‌ను ఓడించిన అర్జున్... ఐదు, ఆరు రౌండ్‌లలో ఇద్దరు గ్రాండ్‌మాస్టర్స్‌తో తలపడి ‘డ్రా’ చేసుకోవడం విశేషం. ఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ మార్టిన్ క్రాట్సివ్‌తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను 75 ఎత్తుల్లో... తువాన్ మిన్ త్రాన్ (వియత్నాం)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను 55 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.
ఆరో రౌండ్ తర్వాత అర్జున్ ఐదు పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. తెలంగాణకే చెందిన రాజా రిత్విక్ ఐదో రౌండ్‌లో ఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ నెవ్‌రోవ్‌పై 76 ఎత్తుల్లో సంచలన విజయం సాధించగా... ఉక్రెయిన్ గ్రాండ్ మాస్టర్ మార్టిన్ క్రాట్సివ్‌తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను 46 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. రిత్విక్ ఖాతాలోనూ ఐదు పాయింట్లున్నాయి.
ఇద్దరు జీఎంలను నిలువరించిన అర్జున్
Published Thu, Jun 7 2018 1:33 AM | Last Updated on Thu, Jun 7 2018 1:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment