సాక్షి, హైదరాబాద్: టెట్రాసాఫ్ట్ మారియట్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌మాస్టర్ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారుడు ఐఎం రాజా రిత్విక్ అద్భుత విజయం నమోదు చేశాడు. శుక్రవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో తనకన్నా ఎంతో మెరుగైన క్రీడాకారుడు రష్యాకు చెందిన గ్రాండ్‌మాస్టర్ సావ్‌చెంకో బోరిస్‌పై రాజా రిత్విక్ 60 ఎత్తుల్లో గెలుపొందాడు. ఐదు రౌండ్ల అనంతరం రష్యాకు చెందిన ఐఎం ట్రియాపిస్కో అలెగ్జాండర్ 5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
ఇతర బోర్డుల్లో కార్తికేయన్ (తమిళనాడు)పై ట్రియాపిస్కో అలెగ్జాండర్ (రష్యా), ఉత్కల్ రంజన్ (ఒడిశా)పై తుఖోవ్ ఆడమ్ (ఉక్రెయిన్), మనీశ్ కుమార్ (ఒడిశా)పై లక్ష్మణ్, భరత్ కల్యాణ్ (తమిళనాడు)పై రత్నాకరణ్ (కేరళ), శేఖర్ చంద్ర (ఒడిశా)పై భరత్ కుమార్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్), కౌస్తువ్ ఖండు (పశి్చమ బెంగాల్)పై కవింద అఖిల (శ్రీలంక), డి సిల్వా (శ్రీలంక)పై శంతను (మహారాష్ట్ర), రాజు (తెలంగాణ)పై కుశాగ్ర మోహన్ (తెలంగాణ), అజయ్ (ఆంధ్రప్రదేశ్)పై వరుణ్ (ఆంధ్రప్రదేశ్), శ్రీహిత్ రెడ్డి (తెలంగాణ)పై రాజేశ్ (ఒడిశా), జయకుమార్ (మహారాష్ట్ర)పై కార్తీక్ (తెలంగాణ), సురేంద్రన్ (తమిళనాడు)పై రహమాన్ (బంగ్లాదేశ్) గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment