raja ritwik
-
రన్నరప్ రాజా రిత్విక్
జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ రెండో పతకాన్ని సాధించాడు. ర్యాపిడ్ ఫార్మాట్లో కాంస్య పతకం నెగ్గిన రిత్విక్ గురువారం నాసిక్‌లో జరిగిన బ్లిట్జ్ ఫార్మాట్లో రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించాడు. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో రిత్విక్ 9 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. రిత్విక్ మొత్తం 11 గేముల్లో ఏడింటిలో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. 9.5 పాయింట్లతో దీప్తాయన్ ఘోష్ (రైల్వేస్) చాంపియన్‌గా నిలిచాడు. -
Chess Championship: రాజా రిత్విక్‌కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ కాంస్య పతకం సాధించాడు. నాసిక్‌లో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత రిత్విక్ 8.5 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... ఆరోణ్యక్ ఘోష్ (రైల్వేస్)కు రెండో ర్యాంక్, రిత్విక్‌కు మూడో ర్యాంక్ దక్కాయి. 9 పాయింట్లతో దీప్తాయన్ ఘోష్ (రైల్వేస్) విజేతగా నిలిచాడు. రిత్విక్ ఆడిన 11 గేముల్లో ఏడింటిలో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. కాంస్యం నెగ్గిన రిత్విక్‌ను తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ అభినందించారు. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కార్తీక్ వెంకటరామన్, నూతక్కి ప్రియాంక 13వ, 14వ ర్యాంక్‌ల్లో నిలిచారు. సహజ శుభారంభం నాగ్‌పూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టర్నీలో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి శుభారంభం చేసింది. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో సహజ 3–6, 6–1, 6–1తో భారత్‌కే చెందిన వైదేహి చౌదరీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. న్యూజిలాండ్‌తో భారత్ తొలి పోరు లుసానె (స్విట్జర్లాండ్): పారిస్ ఒలింపిక్స్ పురుషుల హాకీ ఈవెంట్ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. పూల్ ‘బి’లో ఉన్న భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూలై 27న న్యూజిలాండ్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన భారత జట్టు తమ రెండో మ్యాచ్‌ను జూలై 29న అర్జెంటీనాతో (సాయంత్రం గం. 4:15 నుంచి)... మూడో మ్యాచ్‌ను జూలై 30న ఐర్లాండ్‌తో (సాయంత్రం గం. 4:45 నుంచి)... నాలుగో మ్యాచ్‌ను ఆగస్టు 1న బెల్జియంతో (మధ్యాహ్నం గం. 1:30 నుంచి)... ఐదో మ్యాచ్‌ను ఆగస్టు 2న ఆ్రస్టేలియా తో (సాయంత్రం గం. 4:45 నుంచి) ఆడుతుంది. -
‘గ్రాండ్‌మాస్టర్’ రాజా రిత్విక్
సాక్షి, హైదరాబాద్: ప్రతి చెస్ క్రీడాకారుడు గొప్ప ఘనతగా భావించే గ్రాండ్‌మాస్టర్ (జీఎం) టైటిల్ హోదాను తెలంగాణ కుర్రాడు రాజవరం రాజా రితి్వక్ అందుకున్నాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న వెజెర్కెప్జో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) చెస్ టోర్నమెంట్లో 17 ఏళ్ల రాజా రితి్వక్ జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్ పాయింట్ల మైలురాయిని దాటాడు. బుడాపెస్ట్‌లోనే గత వారం జరిగిన టోరీ్నలో రితి్వక్ విజేతగా నిలిచి మూడో జీఎం నార్మ్‌ను సాధించాడు. అయితే అప్పటికి అతని ఎలో రేటింగ్ 2496గా ఉండటంతో గ్రాండ్‌మాస్టర్ హోదా ఖరారు కాలేదు. ఈనెల 15న మొదలైన వెజెర్కెప్జో టోర్నీలో 2496 ఎలో రేటింగ్‌తో బరిలోకి దిగిన రితి్వక్ నాలుగో రౌండ్లో ఫినెక్ వచ్లావ్ (చెక్ రిపబ్లిక్)పై 57 ఎత్తుల్లో గెలిచాడు. దాంతో అతని ఖాతాలో ఐదు ఎలో పాయింట్లు చేరి రేటింగ్ 2501కు చేరింది. ఫలితంగా ఇప్పటికే మూడు జీఎం నార్మ్‌లను సాధించిన రితి్వక్ జీఎం టైటిల్ ఖరారు కావడానికి అవసరమైన 2500 రేటింగ్‌ను కూడా అందుకోవడంతో భారత్ తరఫున 70వ గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు. వరంగల్ జిల్లాకు చెందిన రాజా రిత్విక్ ఆరేళ్ల ప్రాయంలో చెస్ పట్ల ఆకర్షితుడయ్యాడు. రితి్వక్ తండ్రి ఆర్.శ్రీనివాసరావు యూనివర్సిటీ స్థాయిలో చెస్ ఆడారు. తొలుత వరంగల్‌లో స్థానిక కోచ్ బొల్లం సంపత్ వద్ద ఓనమాలు నేర్చుకున్న రిత్విక్ ఆ తర్వాత హైదరాబాద్‌లోని కె.నరసింహా రావు వద్ద తన ఆటతీరుకు మెరుగులు దిద్దుకున్నాడు. గత నాలుగేళ్లుగా ఎన్.వి.ఎస్. రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటున్న రిత్విక్ ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని భవాన్స్ శ్రీ రామకృష్ణ విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్నాడు. పతకాల పంట... 2012లో కామన్వెల్త్ చాంపియన్íÙప్లో అండర్–8 విభాగంలో రజతం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన రితి్వక్ అటునుంచి వెనుదిరిగి చూడలేదు. 2013లో, 2015లో ఆసియా స్కూల్స్ టోరీ్నలో.. 2018లో ఆసియా యూత్ చాంపియన్íÙప్లో స్వర్ణ పతకాలు సాధించాడు. 2017 జూన్‌లో జాతీయ అండర్–13 చాంపియ న్íÙప్లో చాంపియన్‌గా అవతరించిన రిత్విక్ అదే ఏడాది అక్టోబర్‌లో జరిగిన జాతీయ అండర్–17 చాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా రితి్వక్ ఇప్పటివరకు జాతీయస్థాయిలో మూడు స్వర్ణాలు, రెండు రజ తాలు... అంతర్జాతీయస్థాయిలో 10 స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించాడు. గ్రాండ్‌మాస్టర్ హోదా సంపాదించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ టైటిల్‌తో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతాను. 2600 ఎలో రేటింగ్ అందుకోవడమే నా తదుపరి లక్ష్యం. భవిష్యత్‌లో ఏనాటికైనా వరల్డ్ చాంపియన్ కావాలన్నదే నా జీవిత లక్ష్యం. –రాజా రిత్విక్ తెలంగాణ నుంచి గ్రాండ్‌మాస్టర్ అయిన మూడో ప్లేయర్ రిత్విక్. గతంలో హర్ష భరతకోటి, ఎరిగైసి అర్జున్ ఈ ఘనత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన ఎనిమిదో ప్లేయర్ రిత్విక్. గతంలో పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, హారిక, లలిత్‌బాబు, కార్తీక్ వెంకటరామన్ (ఆంధ్రప్రదేశ్) ఈ ఘనత సాధించారు. -
రష్యా జీఎంపై రాజా రిత్విక్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: టెట్రాసాఫ్ట్ మారియట్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌మాస్టర్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు ఐఎం రాజా రిత్విక్ అద్భుత విజయం నమోదు చేశాడు. శుక్రవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో తనకన్నా ఎంతో మెరుగైన క్రీడాకారుడు రష్యాకు చెందిన గ్రాండ్‌మాస్టర్ సావ్చెంకో బోరిస్‌పై రాజా రిత్విక్ 60 ఎత్తుల్లో గెలుపొందాడు. ఐదు రౌండ్ల అనంతరం రష్యాకు చెందిన ఐఎం ట్రియాపిస్కో అలెగ్జాండర్ 5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇతర బోర్డుల్లో కార్తికేయన్ (తమిళనాడు)పై ట్రియాపిస్కో అలెగ్జాండర్ (రష్యా), ఉత్కల్ రంజన్ (ఒడిశా)పై తుఖోవ్ ఆడమ్ (ఉక్రెయిన్), మనీశ్ కుమార్ (ఒడిశా)పై లక్ష్మణ్, భరత్ కల్యాణ్ (తమిళనాడు)పై రత్నాకరణ్ (కేరళ), శేఖర్ చంద్ర (ఒడిశా)పై భరత్ కుమార్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్), కౌస్తువ్ ఖండు (పశి్చమ బెంగాల్)పై కవింద అఖిల (శ్రీలంక), డి సిల్వా (శ్రీలంక)పై శంతను (మహారాష్ట్ర), రాజు (తెలంగాణ)పై కుశాగ్ర మోహన్ (తెలంగాణ), అజయ్ (ఆంధ్రప్రదేశ్)పై వరుణ్ (ఆంధ్రప్రదేశ్), శ్రీహిత్ రెడ్డి (తెలంగాణ)పై రాజేశ్ (ఒడిశా), జయకుమార్ (మహారాష్ట్ర)పై కార్తీక్ (తెలంగాణ), సురేంద్రన్ (తమిళనాడు)పై రహమాన్ (బంగ్లాదేశ్) గెలుపొందారు. -
రాజా రిత్విక్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్స్ చెస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాడు రాజా రిత్విక్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అఖిల భారత చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో నాగ్‌పూర్‌లో జరిగిన ఈ టోర్నీ అండర్-13 విభాగంలో రిత్విక్ రన్నరప్‌గా నిలిచాడు. తొమ్మది రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో 8 పాయింట్లు సాధించి రజతాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం మెహతా నైతిక్ (8, గుజరాత్)తో జరిగిన చివరి గేమ్‌ను రిత్విక్ (8) డ్రా చేసుకున్నాడు. ఇద్దరి స్కోర్లు సమం కావడంతో మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా మెహతాను విజేతగా ప్రకటించారు. దీంతో రిత్విక్‌కు రెండో స్థానం దక్కింది. ప్రస్తుతం రాజా రిత్విక్ జూబ్లీహిల్స్‌లోని ఆర్కిడ్స ఇంటర్నేషనల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. జాతీయ స్థారుులో సత్తా చాటిన రాణించిన రిత్విక్‌ను రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు ఎ. నరసింహారెడ్డి, కార్యదర్శి ఆనం చిన్ని వెంకటేశ్వర రావు అభినందించారు. ఈ టోర్నీలో మొత్తం 100 మంది క్రీడాకారులు తలపడ్డారు. గతంలో రిత్విక్ కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో రజతం, ఆసియన్ చెస్ చాంపియన్‌షిప్స్ (2013, 2014, 2015)లో స్వర్ణాలతో పాటు పలు జాతీయ పతకాలను సాధించాడు.