చెస్‌ చాంపియన్‌ ప్రణీత్‌ | Praneeth gets Chess Title | Sakshi
Sakshi News home page

చెస్‌ చాంపియన్‌ ప్రణీత్‌

Published Tue, Feb 5 2019 10:03 AM | Last Updated on Tue, Feb 5 2019 10:03 AM

Praneeth gets Chess Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌లో క్యాండిడేట్‌ మాస్టర్‌ (సీఎం) ఉప్పల ప్రణీత్‌ చాంపియన్‌గా నిలిచాడు. బీఎస్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో లిటిల్‌ ఫ్లవర్‌ జూనియర్‌ కాలేజి వేదికగా జరిగిన ఈ టోర్నీ ఓపెన్‌ విభాగంలో ప్రణీత్‌ 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో తొలి ఐదు గేముల్లో వరుసగా సేవితా విజు, విశ్వనాథ్‌ కన్నం, శ్రీనివాస రావు, ఆదిత్య వరుణ్, తరుణ్‌లపై విజయం సాధించాడు. వి. వరుణ్‌తో జరిగిన ఆరో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. వరుణ్‌ రన్నరప్‌గా నిలవగా, కె. ఆశ్లేష్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో లిటిల్‌ ఫ్లవర్‌ జూనియర్‌ కాలేజి కరెస్పాండెంట్‌ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.  

ఇతర విభాగాల విజేతల వివరాలు
 అండర్‌–9 బాలురు: 1. నిశ్చల్, 2. సాయి రుత్విక్, 3. అన్‌‡్ష నందన్‌; బాలికలు: 1. సస్య సింఘారెడ్డి, అనయా అగర్వాల్, అభిజ్ఞ అద్దంకి.
 అండర్‌–11 బాలురు: 1. అనురాగ్, 2. కోవిధ్‌ కుశాల్‌ రెడ్డి, 3. శ్రీ చైతన్య; బాలికలు: 1. ఈశాన్వి సత్య సాయి, 2. శరణ్య, 3. అస్మా మరియం బేగమ్‌.
 అండర్‌–13 బాలురు: 1. శ్రీనందన్‌ బాబు, 2. చైతన్య, 3. సృజన్‌; బాలికలు: 1. భవిష్య, 2. తన్మయి, 3. జ్యోతి జీవన.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement