ముగిసిన రాష్ట్రస్థాయి చెస్ పోటీలు
వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్‌లోని అక్షర విద్యాలయంలో మూడు రోజుల పాటు జరిగిన అండర్–17 రాష్ట్ర స్థాయి బాలబాలికల చెస్ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. చెస్ అసోషియేషన్ రాష్ట్ర అ«ధ్యక్షుడు వైడీ రామరాజు ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రస్థాయి ^è దరంగం పోటీలకు నెల్లూరు వేదిక కావడం సంతోషకరమన్నారు. క్రీడలు మానసికోల్లాసానికి ఎంతో దోహదపడుతాయన్నారు. క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. రాష్ట్ర చెస్ సంఘం కార్యదర్శి దేవరం శ్రీహరి, శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రమణయ్య, అక్షర డైరెక్టర్ హరగోపాల్, జిల్లా చెస్ అసోషియేషన్ కార్యదర్శి వై సుమన్, తదితరులు పాల్గొన్నారు.
చెస్ పోటీల విజేతలు వీరే..
మూడు రోజుల పాటు జరిగిన అండర్–17 బాలబాలికల రాష్ట్రస్థాయి చెస్ చాంపియన్ షిప్ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీల్లో బాలుర విభాగంలో సీహెచ్ నాగసంపత్, కేవీ సుభాష్, వీ ప్రత్వికుమార్, కే సుదీష్, బాలికల విభాగంలో జీ హర్షిత, బీ మౌనిక అక్షయ, బీ కళ్యాణి, తదితరులు విజేతలుగా నిలిచారు. విజేతలను జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నట్లు చెస్ టోర్నీ నిర్వాహక కార్యదర్శి వై సుమన్ తెలిపారు.