Venkatachalam
-
పెన్షన్ లబ్ధిదారులతో సీఎం జగన్ మీటింగ్ @వెంకటాచలంపల్లి
-
పల్నాడు జిల్లా వెంకటాచలంపల్లి నుంచి బస్సుయాత్ర ప్రారంభం
-
వెంకటాచలం పల్లె మీటింగ్‌లో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
వెంకటాచలంలో జగనన్న కాలనీని పరిశీలించిన మంత్రి కాకాణి
-
సాగునీటి సమస్య పరిష్కారం.. మాట నిలబెట్టుకున్న మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలోని రామదాసుకండ్రిగ, ఇడిమేపల్లి, గురివిందపూడి గ్రామ పంచాయతీల రైతులు వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. సుమారు వంద సంవత్సరాలుగా ఇక్కడి సాగునీటి సమస్యకు పరిష్కారం లభించలేదు. సమీపంలో కనుపూరు కాలువ ఉపకాలువ అయిన గురివిందపూడి బ్రాంచ్ కెనాల్ ఉంది. ఇందులో సాగునీరున్నా ఆయకట్టు స్థిరీకరణ సాధ్యపడలేదు. ఎట్టకేలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రైతుల నిరీక్షణకు తెరదించారు. ఆయన తీసుకున్న చర్యలతో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. కనుపూరు కాలువ నుంచి అందుబాటులోని చెరువులకు సాగునీరు సరఫరా సాధ్యమైంది. దీంతో అధికారికంగా మూడువేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. అనధికారికంగా మరో రెండువేల ఎకరాలకు నీరందుతుంది. ఈ నేపథ్యంలో ఆయా పంచాయతీల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పట్టించుకోని టీడీపీ సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అనేక పర్యాయాలు పాలకుల దృష్టికి ఆ మూడు పంచాయతీల రైతులు తీసుకెళ్లారు. చెరువులున్నాయి, జలాశయాల నుంచి నీరు వచ్చే మార్గాలను పునరిద్ధరించాలని ఆభ్యర్థించారు. 22 సంవత్సరాలు పాలించిన టీడీపీ నేతలకు అక్కడి రైతుల విన్నపాలు చెవిక్కెలేదు. వర్షం లేకపోతే భూగర్భ జలాలు అడుగంటిపోయి, తాగునీటికి సైతం ఇబ్బందులు పడేవారు. టీడీపీ హయాంలో తాగునీటి ఇక్కట్లను ప్రజలు చవిచూశారు. ఇలాంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికలు సమీపించాయి. మూకుమ్మడిగా తాగు, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ముక్తకంఠంతో కోరారు. హామీని నిలబెట్టుకున్న మంత్రి 2019 ఎన్నికలకు ముందు వాస్తవ పరిస్థితిని అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టికి ఆయా పంచాయతీల ప్రజలు తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే సొంత నిధులు వెచ్చించి కాలువలను పునరిద్ధరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో వైఎస్సార్సీపీ అధికార పగ్గాలు అందుకుంది. మంత్రి కాకాణి రూ.40 లక్షల సొంత నిధులు వెచ్చించి వెంకటాచలంలోని కాకెద్దులగుంటచెరువు నుంచి రామదాసుకండ్రిగ, గురివిండపూడి, ఇడిమేపల్లి చెరువులకు సాగునీరు వెళ్లేలా కాలువల పునరుద్ధరణ పనులు చేయించారు. సుమారు 11 కిలోమీటర్లు పొడవున్న కాలువ పనులను 16 రోజులపాటు రేయింబవళ్లు 12 మెషీన్లతో చేశారు. నేడు కాలువల్లో నీళ్లు రావడంతో రైతుల ఆనందం హద్దులు దాటింది. అక్కడి నుంచి చెరువులకు నీరు విడుదల చేశారు. రామదాసుకండ్రిగ చెరువు పరిశీలనకు వెళ్లిన మంత్రి గోవర్ధన్‌రెడ్డికి రైతాంగం బ్రహ్మరథం పట్టారు. గుర్రపు బండిపై తీసుకెళ్లి తమ సంతోషాన్ని బాహాటంగా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణిని ఘనంగా సన్మానించారు. జీవింతాం గుర్తించుకుంటాం రామదాసుకండ్రిగ రైతుల ఎన్నో ఏళ్ల నాటి కలను మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సాకారం చేశారు. ఎంతోమంది మా గ్రామానికి వచ్చి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ అందరిలా కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన మంత్రిని ఎప్పటికీ మర్చిపోలేం. జీవితాంతం గుర్తించుకుంటాం. – షేక్ షాజహాన్, మాజీ సర్పంచ్, రామదాసుకండ్రిగ బిడ్డల భవిష్యత్ బాగుంటుంది చెరువు ఆయుకట్టు భూమి ఉన్నా.. నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఏళ్ల తరబడి భూములు బీడుగా మారాయి. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చొరవతో మా బిడ్డల భవిష్యత్ బాగుంటుంది. సాగునీటి కాలువను తవ్వించి, చెరువులకు నీటిని విడుదల చేయడం సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఏడాది ఎలాంటి కష్టాలు లేకుండా పంటలు పండించుకుంటాం. – వెడిచర్ల సుబ్రహ్మణ్యం, రైతు శాశ్వత పరిష్కారం లభించింది చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి సంవత్సరం సాగునీటి సమస్యలతో పంటలు పండేవి కావు. మూడేళ్ల నుంచి గోవర్ధన్‌రెడ్డి ప్రత్యేకశ్రద్ధతో కొంతమేరకు పంటలు పండించుకున్నాం. ఇప్పుడు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. చెరువులకు నీరు విడుదల చేయడంతో ఇక మాకు నీటి కష్టాలుండవు. సాగునీటి సమస్యను పరిష్కరించిన మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాం. – వాకా సుబ్బారావు, రైతు -
బాలికపై యాసిడ్ దాడి కేసులో నిందితుడి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): బాలికపై యాసిడ్‌తో దాడి చేసి గొంతుకోసి నగదు, బంగారంతో ఉడాయించిన ఘటనలో నిందితుడు నాగరాజును బుధవారం నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ సీహెచ్ విజయారావు వివరాలు వెల్లడించారు. వెంకటాచలం మండలం చెముడుగుంట నక్కల కాలనీకి చెందిన దంపతులకు 14 ఏళ్ల కుమార్తె ఉంది. ఆ బాలిక మేనత్త కుమారుడు నెల్లూరు నాగరాజు వ్యసనాలకు బానిసై ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 5వ తేదీ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటంతో ఆమెపై యాసిడ్‌తో దాడి చేసి చెవి కమ్మలు దోచుకుని ఆమె గొంతుకోశాడు. బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మృతి చెందిందనుకుని బీరువాలోని రూ.నాలుగు వేలు దోచుకెళ్లాడు. కేసు నమోదు చేసిన వెంకటాచలం పోలీసులు నిందితుడిని అతని ఇంటి వద్దే అరెస్ట్ చేసి చోరీ సొత్తు, యాసిడ్ బాటిల్, కత్తి స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సీ వివరించారు. -
దాడి చేసింది మేనత్త కొడుకే
నెల్లూరు (క్రైమ్)/సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో సోమవారం సాయంత్రం బాలికపై యాసిడ్ పోసి గొంతు కోసిన వ్యక్తి బాధితురాలి స్వయాన మేనత్త కొడుకేనని నెల్లూరు రూరల్ డీఎస్పీ వై.హరినాథరెడ్డి వెల్లడించారు. దాడి అనంతరం ఇంట్లోని నగదును అపహరించుకుని వెళ్లాడన్నారు. వివరాలను మంగళవారం మీడియాకు వివరించారు. చెముడుగుంట నక్కలకాలనీలో నివాసముంటున్న దంపతుల కుమార్తె(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలిక మేనత్త కొడుకు నాగరాజు భార్య వినాయక చవితి వేడుకల కోసం కసుమూరులోని పుట్టింటికి వెళ్లింది. మరోవైపు.. ఈనెల 5న బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. నాగరాజు మద్యం తాగొచ్చి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. భోజనం చేసేందుకు కూర కావాలని కోరాడు. బాలిక కూర ఇవ్వగా నిందితుడు దానిని తీసుకువెళ్లి భోజనం చేశాడు. అనంతరం కూర గిన్నెలో యాసిడ్ పోసుకుని మళ్లీ బాలిక దగ్గరకు వచ్చాడు. బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా ఆమె వెంటనే పారిపోయేందుకు యత్నించింది. ఇంతలో నిందితుడు యాసిడ్‌లో ఓ వస్త్రాన్ని ముంచి దానిని ఆమె ముఖంపై గట్టిగా అద్ది కత్తితో ఆమె గొంతుకోశాడు. దీంతో బాలిక స్పృహ కోల్పోవడంతో మృతిచెందిందని భావించి బీరువా నుంచి రూ.4 వేలు, ఆమె చెవికున్న కమ్మలను తీసుకుని పరారయ్యాడు. స్పృహ నుంచి కోలుకున్న బాధితురాలు చుట్టుపక్కల వారికి విషయాన్ని తెలియజేసింది. వారు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, కలెక్టర్ కె.చక్రధర్‌బాబు, ఎస్పీ సీహెచ్ విజయారావు తదితరులు మెరుగైన వైద్యం కోసం బాలికను అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నై అపోలోకు తరలించారు. బాలికపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని.. పూర్తిగా దర్యాప్తుచేసి నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. బాలిక త్వరగా కోలుకోవాలి : వాసిరెడ్డి పద్మ దాడి ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని, వైద్యానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందన్నారు. -
ఉప రాష్ట్రపతితో కలిసి అక్షర విద్యాలయం సందర్శించిన అమిత్‌షా
సాక్షి, నెల్లూరు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఆదివారం పర్యటించారు. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడితో కలిసి అమిత్ షా.. సరస్వతీ నగర్‌లోని అక్షర విద్యాలయం సందర్శించారు. అక్షరలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను సందర్శించారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్ వార్సికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ వెంకయ్యనాయుడు విద్యార్థి దశ నుంచే నాయకుడిగా ఎదిగారన్నారు. వెంకయ్యనాయుడు నాలుగు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలోనూ వెంకయ్యనాయుడు పాల్గొన్నారని అమితషా అన్నారు. -
15.74 ఎకరాలను నొక్కేసేందుకు కుట్ర
వెంకటాచలం: ఆన్లైన్లో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చిన కేసులో నలుగురు వ్యక్తులను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన బొడ్డు గీత కొన్నినెలల క్రితం పొదలకూరు తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసింది. ప్రస్తుతం గుడ్లూరు కార్యాలయంలో పనిచేస్తుంది. పొదలకూరులో పనిచేసే సమయంలో మండలంలోని అయ్యవారిపాళెం గ్రామానికి చెందిన పెంచలభాస్కర్తో గీతకు పరిచయం అయ్యింది. అతని చిన్నాన్న నలగర్ల కోటేశ్వరరావుకు ఓ వ్యక్తి కుంకుమపూడిలో ప్రభుత్వ పోరంబోకు 1.16 ఎకరాలు విక్రయించాడు. దీనిని పట్టా భూమిగా మార్చాలని కోటేశ్వరరావు పెంచల్భాస్కర్ను కోరాడు. దీంతో అతను గీతను సంప్రదించాడు. గీత రూ.2 లక్షలిస్తే పట్టా భూమిగా మార్పిస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం కంప్యూటర్ ఆపరేటర్లు సైదాపురానికి చెందిన రాజేష్, కర్నూలుకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సాయం కోరింది. గుడ్లూరు డిప్యూటీ తహసీల్దార్ అనారోగ్యం కారణంగా సెలవుపై ఉండడంతో అతని డిజిటల్ సిగ్నేచర్ కీ గీత వద్దనే ఉంది. రాజేష్, ప్రవీణ్ సాయంతో గత నెల 30వ తేదీన వెంకటాచలం తహసీల్దార్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి వెబ్‌ల్యాండ్ వెబ్సైట్ ఓపెన్ చేసింది. ఆ తర్వాత గుడ్లూరు డీటీ సిగ్నేచర్ కీతో కాకుటూరు, కుంకుమపూడి పరిధిలోని 15.74 ఎకరాల ప్రభుత్వ భూములను పట్టా భూమిగా మార్చి బొడ్డు బుజ్జమ్మ, బొడ్డు మస్తానయ్య, బిక్కి మనెమ్మ, నలగర్ల కోటేశ్వరరావు పేర్లమీదమార్చి వేసింది. విషయం అధికారులకు తెలియడంతో విచారణ చేయగా.. వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న గొల్ల రామబ్రహ్మం బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయగా, గీత డిజిటల్ సిగ్నేచర్ చేసి కుట్రపూరితంగా రికార్డులు తారుమారు చేసినట్లు గుర్తించారు. బొడ్డు గీత, పెంచలభాస్కర్, నలగర్ల కోటేశ్వరరావును అరెస్టు చేయగా, గొల్ల రామబ్రహ్మం వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. -
రైతులపై టీడీపీ నేతల దాష్టీకం
వెంకటాచలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో తెలుగుదేశం నాయకులు శుక్రవారం దళిత రైతులపై దాడిచేశారు. అడ్డుకోబోయిన దళిత సర్పంచిపైనా దౌర్జన్యానికి దిగారు. ప్రభుత్వ అనుమతులతో సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి సారవంతమైన మట్టిని తమ పొలాలకు తోలుకుంటున్న దళిత రైతులపై టీడీపీ మండల అధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు దాడిచేశారు. రిజర్వాయర్‌లో అక్రమ మైనింగ్ ఎక్కడ జరిగిందో చూపాలన్న రైతులను కులం పేరుతో దూషించారు. టీడీపీ నాయకులు శుక్రవారం రిజర్వాయర్ వద్దకు వెళ్లి అక్రమ మైనింగ్ జరిగిందంటూ హంగామా చేశారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల రైతులు అక్కడికి చేరుకున్నారు. తమ పొలాలకు సారవంతమైన మట్టిని రిజర్వాయర్ నుంచి తోలుకునేందుకు ప్రభుత్వం అనుమతులిస్తే అడ్డుకోవడమేగాక, తప్పుడు ప్రచారాలు చేయడం ఏమిటని రైతులు వారిని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు బెదిరించడం, అధికారం కోల్పోయాక బ్లాక్ మెయిల్ చేయడం సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. నాలుగుసార్లు ఓడిపోవడంతో సోమిరెడ్డి రైతులపై కక్షగట్టారన్నారు. దీంతో టీడీపీ నాయకులు ఒక్కసారిగా రైతులపై దాడికి దిగారు. ఈ దాడిలో దళిత రైతు మేకల నరసయ్యకు తీవ్రగాయాలయ్యాయి. అడ్డుకోబోయిన దళిత సర్పంచ్ శీనమ్మపైనా దౌర్జన్యం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరికొందరు జోక్యం చేసుకుని సర్దుబాటు చేయడంతో వివాదం సద్దుమణిగింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి మా పొలాలను బాగు చేసుకునేందుకు ప్రభుత్వ అనుమతులతో మట్టి తరలిస్తే అడ్డుకోవడమే కాకుండా ఇదేమని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడతారా? అని దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత రైతు నరసయ్యపై దాడి చేసి గాయపరచడమేగాక దళిత సర్పంచ్ శీనమ్మ, ఇతర రైతులపై దౌర్జన్యం చేసిన టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడిన నరసయ్యకు ప్రాథమిక చికిత్స చేయించి అక్కడే బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సోమిరెడ్డి ప్రోత్సాహంతోనే టీడీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నించి, పథకం ప్రకారం దాడిచేశారని ఆరోపించారు. ఈ ఘటన గురించి తెలిసి రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునేలోపే టీడీపీ నాయకులు అక్కడ నుంచి పరారయ్యారు. టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు టీడీపీ నేతల దాష్టీకంపై దళిత రైతు మేకల నరసయ్య, దళిత సర్పంచ్ శీనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులు నలగట్ల సుబ్రహ్మణ్యం, మందల పవన్‌కుమార్, గుమ్మడి రాజాయాదవ్ తమపై దాడిచేయడమే కాకుండా కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కసుమూరు దర్గాలో ఏఆర్ రహమాన్ ప్రార్థనలు
వెంకటాచలం: ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు దర్గాను దర్శించుకున్నారు. ఏటా జరిగే కసుమూరు దర్గా గంధోత్సవంలో కొన్నేళ్ల నుంచి రహమాన్ పాల్గొంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఏఆర్ రహమాన్ తన కుమారుడు అమీన్‌తో కలిసి దర్గా వద్దకు చేరుకున్నారు. కడప పీఠాధిపతి ఆరీఫుల్లాహుస్సేనీ మస్తాన్‌వలీ సమాధిపై చాదర్ కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేసే సమయంలోనే ఏఆర్ రహమాన్ ప్రార్థనలు చేశారు. -
భూవివాదం కేసులో సోమిరెడ్డికి సమన్లు
సాక్షి, వెంకటాచలం(నెల్లూరు): వెంకటాచలం మండలంలో భూవివాదం కేసులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వెంకటాచలం ఎస్సై షేక్ కరీముల్లా శుక్రవారం సాయంత్రం సమన్లు అందజేశారు. వెంకటాచలం మండలం ఇడిమేపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 58–3లోని 2.41ఎకరాల భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇతరులకు అమ్మేసిన విషయంపై కోర్టు ఆదేశాలతో ఏ1 ముద్దాయిగా సోమిరెడ్డిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన ఇతరుల భూమిని అమ్మేసిన కేసుకు సంబంధించి గత నెల 31వ తేదీన వెంకటాచలం పోలీసులు ఇడిమేపల్లికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ నెల మూడో తేదీన నెల్లూరు రూరల్ సీఐ రామకృష్ణ సోమిరెడ్డికి సమన్లు జారీ చేసేందుకు అల్లీపురంలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన లేక పోవడంతో వెనక్కు వచ్చేశారు. అయితే శుక్రవారం సాయంత్రం వెంకటాచలం ఎస్సై షేక్ కరీముల్లా అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రెండు సమన్లు జారీ చేశారు. ఇడిమేపల్లి భూవివాదం కేసుకు సంబంధించి విచారణాధికారి సీఐ రామకృష్ణ వద్దకు హాజరుకావాలని ఒక సమను, భూవిదాదం కేసులో మీవద్ద ఉన్న డాక్యుమెంట్లను అందజేయాలని మరో సమను అందజేసినట్లు ఎస్సై తెలిపారు. అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసానికి పోలీసులు వెళ్లడంతో సోమిరెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పోలీసులు సమన్లు జారీ చేయడంతో ఎప్పడు ఏం జరుగుతుందోనని జిల్లాలో చర్చానీయాంశమైంది. ఇది చదవండి : నమ్మితే నట్టేట ముంచారు -
స్నేహితుడి భార్య కోసం హత్య..!
సాక్షి, వెంకటాచలం (నెల్లూరు): మండలంలోని నిడిగుంటపాళెం సమీపంలో నక్కలకాలువ బ్రిడ్జి వద్ద గత నెల 30వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి గురువారం మండల కేంద్రమైన వెంకటాచలంలోని పోలీస్‌స్టేషన్‌లో వివరాలను వెల్లడించారు. ఈదగాలి గ్రామం ఉలవదిబ్బ ప్రాంతానికి చెందిన బండారు ప్రకాష్, అతని స్నేహితులు గత నెల 30వ తేదీన మద్యం తాగేందుకు నిడిగుంటపాళెం నక్కలకాలువ బ్రిడ్జి కిందకు వెళ్లారు. ప్రకాష్ మద్యం మత్తులో కాలువలో పడి మృతిచెందాడని స్నేహితులు చెప్పడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో ప్రకాష్ ప్రమాదవశాత్తు చనిపోలేదని తేలడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రాఘవరెడ్డి నమ్మించారు ప్రకాష్ భార్యకు అతని స్నేహితుడైన ఇడిమేపల్లి గ్రామానికి చెందిన ఎ.వెంకటేష్‌కు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ప్రకాష్‌కు తెలిసి భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఈక్రమంలో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రకాష్ ఇదంతా నీ వల్లే జరిగిందంటూ వెంకటేష్‌తో గొడవపడేవాడు. దీంతో వెంకటేష్ ప్రకాష్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన స్నేహితులైన చెన్నకృష్ణయ్య, విజయభాస్కర్‌ల సాయం కోరాడు. వీరు ముగ్గురూ కలిసి గత నెల 30వ తేదీన మద్యం తాగుదామని చెప్పి ప్రకాష్‌ను నక్కలకాలువ బ్రిడ్జి కిందకు తీసుకెళ్లారు. అక్కడ గొంతు నలిపి హత్య చేసి కాలువలో పడి చనిపోయాడని అందర్ని నమ్మించారు. పోస్టుమార్టం నివేదికలో ప్రకాష్ ప్రమాదవశాత్తు చనిపోలేదని తెలియడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈక్రమంలో వెంకటేష్‌ను విచారించగా అసలు విషయం బయటపడింది. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారింగా హత్య చేసినట్టుగా ఒప్పుకున్నారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. సమావేశంలో సీఐ రామకృష్ణ, ఎస్సై షేక్ కరీముల్లా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎలుక తెచ్చిన తంటా
సాక్షి ప్రతినిధి, చెన్నై: రైలు బోగీలో ప్రయాణికులే కాదు.. అడపాదడపా ఎలుకలూ ప్రయాణిస్తుంటాయి. అలాంటి ఓ ఎలుక బుద్ధిగా ప్రయాణం చేయకుండా తగుదునమ్మా అంటూ సాటి ప్రయాణికుడిని కరిచింది. బాధితుని ఫిర్యాదుతో రైల్వేశాఖకు రూ.32 వేలు వదిలింది. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైకి చెందిన వెంకటాచలం 2014 ఆగస్టు 8వ తేదీన ఎక్స్‌ప్రెస్ రైల్లో సేలం మీదుగా చెన్నైకు చేరుకున్నారు. ఈ ప్రయాణంలో అతడిని ఎలుక కరవగా తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే టీటీఈకి ఫిర్యాదు చేసినా ప్రథమచికిత్స అందలేదు. తరువాత వచ్చే స్టేషన్లో మాత్రమే చికిత్స చేయగలమని టీటీఈ బదులిచ్చారు. దీంతో చెన్నై చేరుకోగానే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసుకుని, మెరుగైన చికిత్స కోసం ప్రయివేటు ఆస్పత్రిలో చేరాడు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల తనకు కలిగిన బాధకు నష్టపరిహారం కోరుతూ వినియోగదారుల ఫోరంలో పిటిషన్ వేశాడు. బాధితునికి రూ.25 వేల నష్టపరిహారం, వైద్య ఖర్చులకు రూ.2వేలు, కోర్టు ఖర్చులకు రూ.5వేలు లెక్కన మొత్తం రూ.32 వేలను 9 శాతం వడ్డీ సహా చెల్లించాలని తమిళనాడు వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి ఆర్వీ దీనదయాళన్, సభ్యులు రాజ్యలక్ష్మి రైల్వేశాఖను ఆదేశిస్తూ గురువారం తీర్పు చెప్పారు. ఈ సొమ్ము 3 నెలల్లోగా బాధితునికి అందజేయాలని ఆదేశించారు. -
చంద్రబాబు బండారం బయటపెట్టిన వెంకటాచలం
సాక్షి, దామలచెరువు : సొంత కంపెనీ హెరిటేజ్ బాగు కోసం చంద్రబాబు వేలాదిమంది రైతుల పొట్టకొట్టాడని స్థానిక ఉద్యమకారుడు వెంకటాచలం తెలిపారు. చంద్రబాబు పనిగట్టుకుని మూయించిన చిత్తూరు డైరీ తిరిగి తెరుచుకునేదాకా చెప్పులు, చొక్కా ధరించబోనని 11 ఏళ్లుగా దీక్ష చేస్తోన్న ఆయన.. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుతెలిపారు. 55వ రోజు పాదయాత్రలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వైఎస్ జగన్.. వెంకటాచలంతో మాట్లాడించారు. ‘‘6వేల లీటర్ల పాలతో మొదలై అంచెలంచెలుగా అభివృద్ధి చెందిన చిత్తూరు డైరీని చంద్రబాబు సర్వనాశనం చేశాడు. హెరిటేజ్ లాభాల కోసం పాడిరైతులను నట్టేటముంచాడు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులు, ఎదురుతిరిగితే జైళ్లు! నా జీవితం కాలిపోయినా ఫర్వాలేదు. చిత్తూరు డైరీని మాత్రం తిరిగి తెరిపించాల్సిందేనని కంకణం కట్టుకున్నా. అప్పటిదాకా చొక్కా, చెప్పులు ధరించబోనని శపథం పెట్టుకున్నా. డైరీతోపాటు చిత్తూరు, రేణిగుంటలోని చక్కెర ఫ్యాక్టరీలను కూడా చంద్రబాబు మూతవేయించాడు. ఒకసారి మహానేత వైఎస్సార్‌ను కలిసి సమస్యలు వివరించాను. ఆయన సీఎం అయిన వెంటనే ఆ ఫ్యాక్టరీలను తెరిపించారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయిన రెండు నెలలకే వాటిని మూసేయించాడు..’ అని వెంకటాచలం గుర్తుచేశారు. మాటిచ్చిన జగన్ : మరికొద్దిరోజుల్లో రానున్న ప్రజాప్రభుత్వంలో చక్కెర ఫ్యాక్టరీలను, డైరీలను తెరిపిస్తామని వెంకటాచలంతోపాటు రైతులందరికీ వైఎస్ జగన్ మాట ఇచ్చారు. ఆసక్తికరంగా సాగిన వెంకటాచలం ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. -
చంద్రబాబు బండారం బయటపెట్టిన వెంకటాచలం
-
మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తమిళనాడు సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా కరపత్రాలు, పోస్టర్లు ముద్రిం చారనే ఆరోపణలపై దినకరన్ వర్గానికి చెందిన సేలం మాజీ ఎమ్మెల్యే వెంకటాచలం సహా నలుగురిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అలాగే టీటీవీ దినకరన్ సహా 14 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కేంద్రం నీట్‌ను బలవంతంగా తమిళనాడు విద్యార్థులపై రుద్దుతుందంటూ పలు విమర్శలు చేస్తూ కరపత్రాలను ముద్రించారని పోలీసులు పేర్కొన్నారు. -
నోట్లు ఇచ్చేవారికి ఓట్లు వేయొద్దు: వెంకయ్య
నెల్లూరు: నోట్లు ఇచ్చేవారికి ఓట్లు వేయొద్దని విద్యార్థులకు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ఎం. వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు. విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమన్నారు. క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని సూచించారు. పాఠ్యాంశాల్లో నైతిక విలువలు చేర్చే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తానని తెలిపారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని సాధించేందుకు కృషి చేయాలని ప్రోత్సహించారు. తన స్వగ్రామం చవలపాలెంలోనూ ఆయన పర్యటించారు. కమ్యూనిటీ హాల్, రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీయిచ్చారు. ఏ స్థాయిలో ఉన్నప్పటికీ పుట్టిన స్వగ్రామ అభివృద్ధిని మరువనని చెప్పారు. -
చలం లేఖకుడు, అంతకుమించి...
స్మరణ గుడిపాటి వెంకటాచలం అనుయాయిగా ఆయనతో సుదీర్ఘకాలం పయనించిన చిక్కాల కృష్ణారావు ప్రథమ వర్ధంతి డిసెంబర్ 30న. అరుణాచలంలో ఉన్న చలానికి ఉత్తరాలు రాసి ఆయన ఇచ్చిన జవాబులతో స్ఫూర్తి పొందిన కృష్ణారావు చలం చనిపోయేంత వరకూ ఆయన వెన్నంటే ఉన్నారు. ఆంధ్రదేశం నుంచి చలానికి చాలామంది రాసే ఉత్తరాలకు చలం చెబుతుండగా కృష్ణారావే జవాబులు రాసేవారు. ఎంతోమంది రచయితలు, కళాకారులు చలాన్ని చూడటానికి వచ్చినప్పుడు వారందరితోనూ కృష్ణారావుకు పరిచయాలు కలిగాయి. శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ వంటివారితో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. 1979లో చలం దివంగతులైతే అక్కడి నుంచి భీమిలి వచ్చిన సౌరిస్‌తో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో కృష్ణారావు ఒకరు. చలం చనిపోయిన తర్వాత చిక్కాల తన రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. తనపై చలం వ్యక్తిత్వం, రమణ మహర్షి బోధనల ప్రభావం ఎంతో ఉందని కృష్ణారావు చెప్పేవారు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి ఉన్నందున అందుకు సంబంధించిన రచనలే ఎక్కువ చేసారు. ఖలీల్ జిబ్రాన్– ప్రవక్త, కృష్ణాజీ జీవితం, భగవాన్ రమణ మహర్షి, జీసస్ స్మృతులు, మహాభిక్షు, బుద్ధం శరణం గచ్ఛామి, అసామాన్యుని ఆత్మకథ, జీవించు క్షణక్షణం, మోహరాత్రి వంటివి చిక్కాల కృష్ణారావు రచనలు. ఆయన తాత్విక చింతన ప్రతి రచనలోనూ కనిపిస్తుంది. (వ్యాసకర్త : పొత్తూరు రాజేంద్రప్రసాద్ వర్మ 9490300587 ) -
నైపుణ్యత ఉంటే అవకాశాలు మెండు
ఏపీ ఎస్ఎస్డీసీ మేనేజర్ లోకనాధం వెంకటాచలం : విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యత ప్రదర్శిస్తే అవకాశాలు మెండుగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) మేనేజర్ లోకనాధం తెలియజేశారు. సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ(ఐటీడీఏ), ఏపీఎస్ఎస్డీసీ, డీఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో వెంకటాచలంలోని వైటీసీ కేంద్రంలో జాబ్ మేళా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈజాబ్ మేళాకు నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల నుంచి 235 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారు. ఈ మేళాలో ఏడు కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై 135 మందిని ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ ఎస్ఎస్డీసీ మేనేజర్ లోకనాధం మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చున్నారు. ప్రస్తుతం అవకాశాలు రానివారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. పట్టుదల ఉంటే మంచి భవిష్యత్ ఉందన్నారు. అవకాశాలు పొందిన విద్యార్థులు ఆయా రంగాల్లో నైపుణ్యతను ప్రదర్శించేందుకు ఆసక్తి చూపాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఏపీవో శరత్, వైటీసీ కేంద్రం మేనేజర్ బాలాజీ, ఏపీఎస్ఎస్డీసీ డీఐటీఓ భాగ్య శ్రీ తదితరులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
గొలగమూడి (వెంకటాచలం): చెట్టుకు ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని గొలగమూడిలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. బాలాయపల్లి మండలం కడగుంట గ్రామానికి చెందిన ఎన్.శ్రీను అలియాస్ జీవా నెల్లూరు నగరంలోని నారాయణ హాస్పిటల్ ప్రాంగణంలోని కిచెన్‌లో సప్లయిర్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం అక్కడ విధుల నుంచి యాజమాన్యం తొలగించింది. ఆదివారం గొలగమూడికి వచ్చిన శ్రీను ఆశ్రమ అన్నదాన కేంద్రంలో ఆదివారం రాత్రి భోజనం చేసి కోనేరు కట్టపై నిద్రించాడు. సోమవారం మధ్యాహ్నం సమయంలో మద్యం తాగి కట్టపై ఉన్న చింతచెట్టుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని స్వీపర్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలంలో మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, బంధువులకు సమాచారం అందించారు. అనారోగ్యంతో ఆత్మహత్య అనారోగ్య సమస్యతోనే శ్రీను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. శ్రీనుకు ఇటీవల వైద్య పరీక్షలు చేయగా హె^Œ ఐవీ పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలియడంతో విధుల నుంచి తప్పించారు. అప్పటి నుంచి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న శ్రీను గొలగమూడికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. -
టిప్పర్ల రవాణాతో రోడ్డు ధ్వంసం
అడ్డుకున్న జెడ్పీటీసీ వెంకటశేషయ్య వెంకటాచలం: మండలంలోని కసుమూరు పంచాయతీ వెంకటకృష్ణాపురానికి వెళ్లే రోడ్డు టిప్పర్ల రద్దీతో పూర్తిగా ధ్వంసమైపోతుంది. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో స్థానిక రైతులు జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య ఆధ్వర్యంలో శనివారం టిప్పర్లను అడ్డుకున్నారు. కసుమూరులోని బుచ్చిరెడ్డిచెరువు నుంచి రైల్వేలైన్ నిర్మాణ పనులకు మట్టి తరలింపునకు అధికారులు అనుమతులిచ్చారు. దీంతో కొన్ని రోజులుగా టిప్పర్లు షఫాబావి మీదుగా వెంకటకృష్ణాపురం గ్రామానికి వెళ్లే మట్టిరోడ్డుపై ఈ టిప్పర్లు తిరుతుండటంతో రోడ్డు అధ్వానంగా మారింది. ఈ రోడ్డుపై టిప్పర్లు తిరగనివ్వద్దని గ్రామస్తులు, రైతులు అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో శనివారం జెడ్పీటీసీ వెంకటశేషయ్య అక్కడకు వెళ్లి టిప్పర్లును అడ్డుకున్నారు. మట్టిరోడ్డుపై 15 టన్నులకు పైగా బరువున్న టిప్పర్లు తిప్పడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని రెవెన్యూ, నీటి పారుదలశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. చెరువులో మట్టి తరలించిన వెంటనే రోడ్డు గురించి పట్టించుకోకుంటే ప్రజలు ఎలా తిరగాలని ప్రశ్నించారు. చెరువులో నుంచి మట్టి తరలించిన నిర్వాహకులతో అధికారులు రోడ్డును పటిష్ట పరిచేలా చర్యలు చేపట్టాలన్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. -
వానపాముల అక్రమ రవాణా గుట్టు రట్టు
టోల్‌ప్లాజా వద్ద 8 బ్యాగులు స్వాధీనం వెంకటాచలం : చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు వానపాముల అక్రమణ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. వెంకటాచలం పోలీసులకు కొందరు సమాచారం ఇవ్వడంతో పోలీసులు బుధవారం నిఘా ఉంచి 8 వానపాముల బ్యాగులను, ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకు చెందిన పార్థసారథి, ఈశ్వర్ తరచూ చెన్నై నుంచి నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఒంగోలు తదితర ప్రాంతాలకు తరచూ వానపాములు అక్రమ రవాణా చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఏపీ27ఏఎక్స్ 5589 ఇన్నోవా కారులో పార్థసారథి, ఈశ్వర్ చెన్నై నుంచి ఒంగోలుకు వానపాముల బ్యాగులతో బయలుదేరారు. ఈ విషయంపై వెంకటాచలం పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు టోల్‌గేట్‌కు రెండు వైపులా నిఘా ఉంచి ఇన్నోవా కారును పట్టుకున్నారు. ఈ కారులో మొత్తం 8 వానపాముల బ్యాగులు, పార్థసారథి, ఈశ్వర్‌తో పాటుగా కారుడ్రైవర్‌ను, కారును అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వానపాముల అక్రమ రవాణాపై సమాచారం అందడంతో టోల్గేట్ వద్ద నిఘా ఉంచి అదుపులోకి తీసుకున్నారు. వానపాములను, అక్రమ రవాణా చేసిన వారిని అటవీశాఖ అధికారులకు అప్పగిస్తామన్నారు. కారు డ్రైవర్‌కు ఈ రవాణాలో ప్రమేయం ఉందా లేదానని విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవానికి హాజరైన సుమిత్ర
నెల్లూరు : నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఆదివారం స్వర్ణభారత్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతోపాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, రియో ఒలింపిక్స్‌లో రజిత పతక విజేత పి.వి.సింధు, పి. గోపి చంద్‌కు వెంకయ్యనాయుడు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కార్యకలాపాలను వెంకయ్యనాయుడు వారికి వివరించారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి చెస్ పోటీలు
వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్‌లోని అక్షర విద్యాలయంలో మూడు రోజుల పాటు జరిగిన అండర్–17 రాష్ట్ర స్థాయి బాలబాలికల చెస్ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. చెస్ అసోషియేషన్ రాష్ట్ర అ«ధ్యక్షుడు వైడీ రామరాజు ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రస్థాయి ^è దరంగం పోటీలకు నెల్లూరు వేదిక కావడం సంతోషకరమన్నారు. క్రీడలు మానసికోల్లాసానికి ఎంతో దోహదపడుతాయన్నారు. క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. రాష్ట్ర చెస్ సంఘం కార్యదర్శి దేవరం శ్రీహరి, శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రమణయ్య, అక్షర డైరెక్టర్ హరగోపాల్, జిల్లా చెస్ అసోషియేషన్ కార్యదర్శి వై సుమన్, తదితరులు పాల్గొన్నారు. చెస్ పోటీల విజేతలు వీరే.. మూడు రోజుల పాటు జరిగిన అండర్–17 బాలబాలికల రాష్ట్రస్థాయి చెస్ చాంపియన్ షిప్ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీల్లో బాలుర విభాగంలో సీహెచ్ నాగసంపత్, కేవీ సుభాష్, వీ ప్రత్వికుమార్, కే సుదీష్, బాలికల విభాగంలో జీ హర్షిత, బీ మౌనిక అక్షయ, బీ కళ్యాణి, తదితరులు విజేతలుగా నిలిచారు. విజేతలను జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నట్లు చెస్ టోర్నీ నిర్వాహక కార్యదర్శి వై సుమన్ తెలిపారు. -
స్వర్ణభారత్ సేవలు ప్రసంశనీయం
కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు వెంకటాచలం : గ్రామీణ ప్రజల కోసం స్వర్ణభార త్‌ట్రస్ట్ చేసే సేవలు ప్రసంశనీయమని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు అభినందించారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ట్రస్ట్, అక్షర విద్యాలయాన్ని కేంద్ర సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో కలిసి ఆదివారం సందర్శించారు. తొలుత స్వర్ణభారత్ ట్రస్ట్‌కు వెళ్లి అక్కడ బ్రిడ్జిస్కూల్, రైతు శిక్షణ కేంద్రం, ఎల్వీప్రసాద్ కంటి వైద్యశాల, సైరెడ్‌లో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణను పరిశీలించారు. అనంతరం అక్షర విద్యాలయాన్ని సందర్శించారు. అక్కడ సోమా ఆధ్వర్యంలో యువతకు వత్తి నైపుణ్యతపై జరుగుతున్న శిక్షణ గురించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆయనకు వివరించారు. అనంతరం కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు విలేకరులతో మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు ప్రతిచోటా స్వర్ణభారత్ ట్రస్ట్ లాంటి స్వచ్ఛందసంస్థలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలకశాఖా మంత్రి పి.నారాయణ, నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. రైతుల సమస్యకు పరిష్కారం చూపాలి: రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని మండలంలోని చవటపాళెం గ్రామ రైతులు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కోరారు. వెంకటాచలం మండలం అక్షర విద్యాలయానికి వచ్చిన వెంకయ్యనాయుడును చవటపాళెం రైతులు కలిసి మాట్లాడారు. కష్ణపట్నం–ఓబులవారిపల్లెకు వెళ్లే రైల్వే మార్గంలో చవటపాళెం వద్ద చేపడుతున్న రైల్వే పనుల కారణంగా రైతులకు ఇబ్బందులు వస్తాయని తెలియజేశారు. స్పందించిన వెంకయ్యనాయుడు ఆర్డీఓ కాసా వెంకటేశ్వర్లు, రైల్వే అధికారులతో మాట్లాడారు. ఆ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
రుణమాఫీ.. అధోగతి
అప్పు కట్టాల్సిందేనంటూ రైతులకు నోటీసులు ఇస్తున్న బ్యాంకులు తాకట్టు బంగారాన్నివేలం వేస్తున్న వైనం ఆందోళనలో అన్నదాతలు పెనుమూరు మండలం పెరుమాళ్లకండ్రిగకు చెందిన రైతు వెంకటాచలం నాయుడు పెనుమూరు కార్పొరేషన్ బ్యాంకులు రూ.75 వేలు రుణం తీసుకున్నారు. వడ్డీతో కలిపి రూ.1,11,343 అయ్యింది. వెంకటాచలం నాయుడుకు రుణమాఫీ వర్తింపచేస్తున్నట్లు ప్రభుత్వం లేఖ పంపింది. తొలి విడత కింద రూ.21,292 మంజూరు చేసింది. మిగిలిన మొత్తాన్ని మూడు కంతులుగా ఇస్తామని చెప్పినా రెండో విడత మొత్తాన్ని ఇవ్వకుండా ఎగనామం పెట్టింది. బాబు ఇచ్చిన రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోలేదు. ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని ఇచ్చేది .. చచ్చేది లేదు.. ముందు మా అప్పు కట్టండంటూ బ్యాంకు రైతుకు నోటీసు పంపింది. ఒక్క వెంకటాచలంనాయుడికే కాదు జిల్లాలో చాలా మంది రైతులకు బ్యాంకులు తాజాగా నోటీసులిచ్చాయి. చిత్తూరు: రుణమాఫీని చంద్రబాబు సర్కారు గంగలో కలపడంతో జిల్లాలోని అన్నదాతలు రోడ్డునపడ్డారు. జిల్లావ్యాప్తంగా 2013 డిసెంబర్ 31వ తేదీ నాటికి వివిధ బ్యాంకుల్లో 7,43,158 మంది రైతులు రూ.5,404.30 కోట్ల రుణాలు తీసుకున్నారు. అయితే చంద్రబాబు సర్కారు కేవలం 3,67,993 మంది రైతులే రుణమాఫీకి అర్హులంటూ లెక్కలు తేల్చింది. రూ.50 వేలు లోపు రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తున్నామని, రూ.50 వేలు నుంచి రూ.1.50 లక్షల రుణాలను నాలుగు కంతుల్లో మాఫీ చేస్తామని ప్రకటించింది. రూ.50 వేలు లోపు మాఫీ చేశామని ప్రభుత్వం ప్రకటించినా వాస్తవానికి వాటిల్లో 60 శాతం రుణాలను కూడా మాఫీ చేయలేదు. ఇక రూ.50వేల పైన రుణాలకు సంబంధించి కేవలం తొలి కంతు మాత్రమే బ్యాంకుల్లో జమ చేసిన ప్రభుత్వం మిగిలిన మూడు కంతుల సంగతిని గాలికొదిలేసింది. రుణమాఫీ కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం బాండ్ల రూపంలో జమ చేస్తుందని భావించిన బ్యాంకులకు చుక్కెదురైంది. రెండో కంతు చెల్లిస్తామంటూ వ్యవసాయ శాఖ మంత్రి పదే పదే చెప్పినా ఆచరణలో అది అమలుకు నోచుకోలేదు. బ్యాంకర్ల దాష్టీకం.. రుణమాఫీ కింద ఇస్తానన్న మొత్తాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడంతో బ్యాంకులు రుణ వసూళ్లకు దిగాయి. ఉన్నఫలంగా రూ.లక్షల రుణం ఎలా తీర్చాలంటూ రైతులు లబోదిబోమంటున్నారు. అసలే అరకొర రుణమాఫీతో రైతులను మోసం చేసిన ప్రభుత్వం చెప్పిన మొత్తాన్ని కూడా చెల్లించక పోవడంతో అన్నదాతలు ఆందోళనలో చెందుతున్నారు. వేలానికి తాకట్టు బంగారం.. రుణమాఫీ అమలు కాకపోవడంతో బ్యాంకులు తాకట్టు పెట్టిన రైతుల బంగారాన్ని వేలం వేస్తున్నాయి. వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా పలు బ్యాంకుల్లో బంగారం వేలం పాటలు ఊపందుకున్నాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 3,49,268 మంది రైతులు బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.2,910 కోట్ల రుణాలను పొందారు. రుణాలు పొంది నిర్దేశిత గడువు 18 నెలలు దాటిపోవడంతో బ్యాంకులు రైతుల బంగారాన్ని వేలం వేస్తున్నాయి. దీంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. -
టిప్పర్ ఢీకొని డిగ్రీ విద్యార్థిని మృతి
వెంకటాచలం: వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్ డిగ్రీ విద్యార్థినిని బలితీసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... తాడిపత్రిపాలెం అర్జునవాడకు చెందిన దివ్య వెంకటాచలంలోని చైతన్యభారతి డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కళాశాలలో పరీక్ష రాసేందుకు బుధవారం ఉదయం తన తండ్రి సూరయ్యతో కలసి ద్విచక్రవాహనంపై వెంకటాచలం వైపు వెళుతూ రోడ్డును దాటబోయారు. ఆ సమయంలో కృష్ణపట్నం పోర్టువైపు వెళుతున్న టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దివ్య అక్కడికక్కడే మృతి చెందగా... స్వల్పంగా గాయపడిన సూరయ్యను నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనతో తాడిపత్రిపాలెం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టు వాహనాలు అతి వేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దివ్య మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
సాగునీరు అందించడమే లక్ష్యం
వెంకటాచలం: రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం మెడలు వంచైనా సరే సాగునీరు అందజేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న ఎంఆర్సీ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దానికి ప్రధానకారణం ప్రభుత్వ యంత్రాగం, అధికారుల ముందుచూపు లేకపోవడమేనని ఆయన ఆరోపించారు. రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తుంటే ఈ సమయంలో నీటిపారుదల శాఖలోని అధికారులను బదిలీ చేయడంపై ఆయన మండిపడ్డారు. సంగం బ్యారేజి వద్ద మరో రెండు అంగుళాలు నీటిమట్టం పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నీటిమట్టాన్ని అంచెలంచెలుగా పెంచి మోటార్ల కింద ఆయకట్టుకు, చెరువు కాలువ ఆయకట్టుకు నీరు అందించేందుకు అధికారులతో చర్చించినట్లు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఏడు గంటలకు మరో మూడు గంటలు పెంచి పది గంటలు రైతులకు విద్యుత్ అందించే లా చూస్తానన్నారు. రైతుల సాగునీటి సమస్యపై అసెంబ్లీలో చర్చించామన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ డివి.సుధాకర్, ఎంపీడీఓ టి. సుగుణమ్మ, జెడ్పీటీసీసభ్యుడు మందల వెంకటశేషయ్య, ఎంపీపీ తలపల అరుణ, మండల ఉపాధ్యక్షుడు శ్రీధర్‌నాయుడు, కోఆప్షన్ సభ్యులు అక్బర్, హుస్సేన్, సర్పంచ్ పోట్లూరి మణెమ్మ, ప్రిన్సిపల్ పెంచలయ్య, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు కరియావుల చెంచుక్రిష్ణయ్య, కనుపూరు కోదండరామిరెడ్డి, పెళ్లూరు సుధాకర్‌రెడ్డి, పద్మనాభనాయుడు, కొణిదన మోహన్ నాయుడు, రావి బాలక్రిష్ణమనాయుడు, రావూరు కోదండనాయుడు, నాటకం శ్రీనివాసులు, మందల పెంచలయ్య, డబ్బుగుంట వెంకటేశ్వర్లు, పాశం ప్రభాకర్, వెలిబోయిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ప్రపంచమంతా ఇటే చూస్తోంది: వెంకయ్య
ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. భారతీయ సంస్కృతిని మనం భావి తరవాలకు అందించాలని తెలిపారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టులో దసరా వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉపాధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణభారత్ ట్రస్టుకు చెందిన దీపావెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
కుప్పంలో సాక్షి విలేఖరి పై దాడి
-
కుప్పం సాక్షి విలేకరిపై అగంతకుల దాడి!
కుప్పుం: చిత్తూరు జిల్లా కుప్పుం 'సాక్షి' విలేకరిపై అగంతకులు గురువారం రాత్రి దాడి చేశారు. బైక్ పై వెళ్తున్న వెంకటాచలంను అగంతకులు కత్తులతో దాడి చేసినట్టు సమాచారం. అగంతకుల దాడిలో గాయపడిన వెంకటాచలం పరిస్థితి విషమంగా మారిందని ఆయన బంధువులు తెలిపారు. వెంకటాచలం పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వెంకటాచలం దాడి వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
విద్యకు పెద్ద పీట
వెంకటాచలం : తమ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం విక్రమ సింహపూరి యూనివర్సిటీకి సంబంధించి రూ.12కోట్లతో నిర్మించనున్న అకడమిక్ భవనానికి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా, సీఎం చంద్రబాబు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారని వివరించారు. యూనివర్సిటీల అభివృద్ధికి అవసరమైన వసతులు కల్పించుకునేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని సముద్ర తీరం పారిశ్రామిక కారిడార్ కానుందన్నారు. కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని, అందుకు అవసరమైన రీసెర్చ్‌లు చేయాలన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ యూనివర్సిటీకి మహాకవి తిక్కన పేరు పెట్టాలని అప్పటి ప్రభుత్వంతో పోరాడినట్లు తెలిపారు. మన ప్రాంత మహాకవిని మనం గుర్తించుకోవాల్సి ఉందన్నారు. విద్యార్థుల్లో నైతికత, విద్యా ప్రమాణాలు ఉండే బోధనను యూనివర్సిటీ అందించాలన్నారు. కలెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ వీఎస్ యూనివర్సిటీ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా రూపాంతరం చెందాలని ఆకాం క్షించారు. ప్రపంచ పరిశోధన పత్రాలను ప్రచురితమయ్యేలా చూస్తే యూనివర్సిటీకి మంచి గుర్తింపు వస్తుందన్నారు. అవసరాలు గుర్తించి ముందస్తు ప్రణాళికలు చేపట్టాలి: కాకాణి యూనివర్సిటీ రూపాంతరానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు చేపట్టి అభివృద్ధి చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోరారు. యూనివర్సిటీకి జాతీయ రహదారి నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రభుత్వం యూనివర్సిటీకి ఇచ్చిన స్థలం చాలా వరకు ఉపయోగ పడదని, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మరింత భూమిని సేకరించుకోవాలని సూచించారు. సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్, ఆక్వా కల్చర్‌కు అనుబంధమైన కోర్సులు పెట్టాలన్నారు. జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, ఇతర అనుబంధ పరిశ్రమలు రానున్నాయని, భవిష్యత్ అవసరాలు గుర్తించి కోర్సులు, రీసెర్చ్‌లు జరగాలన్నారు. జిల్లాకు చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడు, పొంగూరు నారాయణ వంటి వివాద రహితులు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోరేవారు మంత్రులుగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వీఎస్‌యూ ఉపకులపతి గొట్టిప్రోలు రాజారాంరెడ్డి, రిజిస్ట్రార్ కోటా నాగేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు పరసారత్నం, బీద మస్తాన్‌రావు, ఎం.శ్రీధర్‌కృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, ఎంపీపీ తలపల అరుణ, ఎంపీటీసీ సభ్యుడు బాణాల వెంకమ్మ, సర్పంచ్ డబ్బుగుంట అమరావతి పాల్గొన్నారు. ప్రతి బిడ్డ ముత్యంలా ఎదగాలి కోవూరు: ప్రతి బిడ్డ ఒక ముత్యంలా ఎదగాలన్న తపన ప్రతి ఒక్కరిలో ఉంటుందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కోవూరులో శనివారం ‘బడిపిలుస్తోంది’ ముగింపునకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. మంత్రి మాట్లాడుతూ రాజకీయాలకు నెల్లూరు జిల్లా పుట్టినిల్లు అన్నారు. ఈ జిల్లా రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరన్నారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా విద్యాశాఖలో పెనుమార్పులు తీసుకురావాల్సిన అసరం ఉందన్నారు. రాష్ట్రంలో 19 శాతం డ్రాపవుట్స్ ఉండగా కేవలం నెల్లూరు జిల్లాలో 23 శాతం ఉన్నారన్నారు. డ్రాపవుట్స్‌లో నెల్లూరు జిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు. పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పుట్టగానే మేధావి కాదన్నారు. బాల్యం నుంచి పట్టుదల, క్రమశిక్షణతో ముందుకుపోతేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు క్రమశిక్షణతో చదువుకుంటే ఆ తర్వాత విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని చేరడం కష్టమేమీ కాదన్నారు. ఓ పాఠశాలను దత్తత తీసుకుని విద్యార్థులకు బోధిస్తున్నామన్నారు. గతంలో 23 మంది ఉన్న పాఠశాలలో ప్రస్తుతం 1 నుంచి 5 లోపు 150 మంది విద్యార్థులున్నారు. అదేవిధంగా కోవూరులో ఒక పాఠశాలను దత్తత తీసుకుని ఆ పాఠశాల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కల్పించేలా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి, ఆర్జేడీ పార్వతి, అడిషనల్ జేసీ రాజ్‌కుమార్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, డీఈఓ ఉష, సర్వశిక్ష అభియాన్ పీఓ కోదండరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లురెడ్డి, తహశీల్దార్ నరసింహులు, ఎంఈఓ చెంచురెడ్డి, ఎంపీడీఓ నాగరాజకుమారి, ఎంపీపీ గిద్దలూరు ఉమ, సర్పంచ్ కూట్ల ఉమ పాల్గొన్నారు. -
సీమాంధ్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం
వెంకటాచలం, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి ముఖ్యఅనుచరుడు కాకుటూరుకు చెందిన డబ్బుగుంట వెంకటేశ్వర్లుయాదవ్తో పాటు ఆయన అనుచరులు, యర్రగుంటకు చెందిన ప్రసాద్, వెంకటేశ్వర్లు, మోహన్, పెంచలయ్య, శీనయ్య, లక్ష్మయ్య, సుబ్రహ్మణ్యం, ఏడుకొండలుతో పాటు పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. నెల్లూరులోని గోవర్ధన్‌రెడ్డి నివాసంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త రాష్ట్ర నిర్మాణం, వైఎస్సార్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పాలన జగన్మోహన్రెడ్డి మాత్రమే చేయగలరన్నారు. అధికార దాహంతో చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. వాటిని అమలు చేయడం సాధ్యమేనే అని ఆయనను ఆనే ప్రశ్నించుకోవాలని హితవుపలికారు. అప్పట్లో వ్యవసాయం దండగ, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై దుస్తులు ఆరేసుకోవాలని వ్యాఖ్యానించిన చంద్రబాబు కరెంట్ బిల్లులు చెల్లించని వారిపైనా కేసులు పెట్టించారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని చీకటి మయం చేసి ప్రజలను అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని విస్మరించి, ఇప్పుడు అధికారం కోసం అభివృద్ధి చేస్తానని అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించడం హాస్యాస్పదమన్నారు. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠం అధిష్టించిన చంద్రబాబు, ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకు కిలోబియ్యం, సంపూర్ణమద్యపాన నిషేధం పథకాలకు తూట్లు పొడిచారన్నారు. రేషన్ బియ్యం ధరను రూ.5.25కి పెంచడంతో పాటు ఊరూరా మద్యం బెల్టుషాపులను తెరిపించిన ఆయన ఘనతను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకాన్ని ఉచిత విద్యుత్ ఫైలుపై చేసిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తుది శ్వాసవిడిచేంత వరకూ దానిని అమలు చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు, ఆయన మరణం తర్వాత అధికారం చేపట్టిన వారు తూట్లు పొడిచారన్నారు. వైఎస్సార్ ఆశయసాధన జగన్‌తోనే సాధ్యమన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వెంకటాచలం జెడ్పీటీసీ అభ్యర్థి మందల వెంకటశేషయ్య, పి.ఖయ్యూమ్‌ఖాన్, కుడితిపూడి మురళీధర్ నాయుడు తదితరులు పాల్గోన్నారు. -
ప్రజాసంక్షేమం జగన్‌కే సాధ్యం
వెంకటాచలం, న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమని ఆ పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కసుమూరులో పూల కోటేశ్వరరావు, గుర్రం మల్లికార్జున్, తురకా పెంచలయ్య, బెల్లం సురేంద్ర, వీరేపల్లి మహేష్, బాలా రమేష్, దేవళ్ల రత్నంతో పాటుగా తమ వర్గీయులు కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివాసంలో శనివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. సీమాంధ్రులకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ తీరని అన్యాయం చేశాయన్నారు. చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం అవలంబించి తెలంగాణ విభజ నకు కారణమయ్యారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తొలుత విభజనకు మద్దతు తెలిపి అనంతరం రాజీనామాతో సరిపెట్టుకున్నారన్నారు. సోనియా తన కుమారుడిని ప్రధానిని చేయాలని స్వార్థపు రాజకీయాలతో తెలంగాణ విభజన జరిగిందన్నారు. ఒక్క జగన్మోహన్రెడ్డి మాత్రమే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉద్యమాలు చేస్తూ తెలంగాణ విభన బిల్లుకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాటాలు చేశారన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో ఫ్యాను గుర్తు కు ఓట్లు వేసి అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు. నాయకులు వడ్లమూడి సురేంద్రనాయుడు, పి.హుస్సేన్, ఈశ్వరనాయుడు, పూల శ్రీనివాసులు పాల్గొన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె
చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశ వ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సంఘం పిలుపుమేరకు రాష్ట్రం లోని అన్ని జాతీయ బ్యాంకులు, ఎంతో కాలంగా సేవలందిస్తున్న కొన్ని ప్రయివేటు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఐసీఐసీఐ, యాక్సెస్, ఐడీబీఐ, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనలేదు. రాష్ట్రంలోని 14 వేల బ్యాంకులకు చెందిన 60 వేల మంది సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు ఆయా బ్యాంకుల ముందు ఉద్యోగులు తమ డిమాండ్లతో నినాదాలు చేశారు. దాదాపు అన్ని చోట్ల బ్యాంకులు మూతపడ్డాయి. కొన్ని చోట్లు బ్యాంకులు తెరిచినా సిబ్బంది లేకపోవడంతో ఖాతాదారులు నిరాశతో వెనుదిరిగారు. రాష్ట్రంలో 3 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు, 5 లక్షల క్లియరెన్స్‌లు నిలిచిపోయాయి. చెన్నైలోని 1400 బ్యాంకుల్లో 3 లక్షల చెక్కులు నిలిచిపోయా యి. బ్యాంకుల సమ్మెను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని ఏటీఎంలలో మంగళవారం రాత్రే నగదుతో నింపివేశారు. ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే రూ.40వేలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో రూ.20వేల నుంచి రూ.25 వేల వరకు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. సమ్మె ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని ఏటీఎంల వద్ద జనం క్యూకట్టారు. అనేక ఏటీఎంలలో బుధవారం సాయంత్రానికే నగదు ఖాళీ అయింది. చెన్నై బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చెన్నై కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. సంఘం అధ్యక్షుడు వెంకటాచలం మీడియాతో మాట్లాడుతూ, ఇందిరాగాంధీ హయాంలో ప్రయివేటు బ్యాంకులను జాతీయం చేయగా, నేడు పునర్ వ్యవస్థీకరణ పేరుతో మళ్లీ ప్రయివేటీకరణ ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాల తరబడి బ్యాంకుల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగ భద్రత కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా డిపాజిట్టుదారులకు రాయితీలు కల్పించడం, పాత బకాయిలను రద్దుచేయడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. పై డిమాండ్లతోపాటూ బ్యాంకు ఉద్యోగుల జీతాలు పెంచాలనే తమ కోర్కెలకు కేంద్రం దిగిరాని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఈనెల 23వ తేదీన హైదరాబాద్‌లో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
అన్నదాతను ఆదుకోవాలి : సామినేని
షేర్‌మహ్మద్‌పేట (జగ్గయ్యపేట), న్యూస్‌లైన్ : డతెరపి లేకుండా కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. మండలంలోని షేర్‌మహ్మద్‌పేట అడ్డరోడ్డు సమీపంలోని ఆటోనగర్‌లో కల్లాల్లో తడిచిన మొక్కజొన్న పంటను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. రైతులనడిగి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగురోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తూ... చేతికి వచ్చే పంటను నీటిపాలు చేసిందన్నారు. అప్పు, సొప్పు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, వరి, కూరగాయల పంట లకు అపార నష్టం జరిగిందని తెలిపారు. కొన్ని గ్రామాల్లో తడిచిన మొక్కజొన్నను రైతులు కల్లాల్లోనే వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిచిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. తక్షణమే వ్యవసాధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన పంటలపై సర్వే చేసి నివేదికలు తయారు చేయాలని కోరారు. రైతులను ఆదుకోకపోతే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కళ్ల ముందే పంట నీటిపాలై నష్టపోవడంతో కంటనీరు పెడుతున్న రైతులు కోటి వెంకటేశ్వర్లు, షేక్ మస్తాన్‌ను ఉదయభాను ఓదార్చి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మండల, పట్టణ పార్టీ కన్వీనర్లు మాతంగి వెంకటేశ్వర్లు, షేక్ మదార్‌సాహెబ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల వెంకటాచలం, పట్టణ కార్యదర్శి వట్టెం మనోహర్, పట్టణ మైనార్టీ సెల్ కన్వీనర్ ఎస్డి.ఆరీఫ్, నాయకులు మోరే వినోద్, రైతులు తదితరులు పాల్గొన్నారు. పంటలను పరిశీలించిన రైతు సంఘం నాయకులు .. వర్షానికి తడిచిన మొక్కజొన్న పంటలను జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వై.కేశవరావు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందజేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం సభ్యురాలు యార్లగడ్డ జోయ, సీపీఎం నాయకులు నాగమణి, కోట కృష్ణ, కాకనబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు.