
ప్రపంచమంతా ఇటే చూస్తోంది: వెంకయ్య
ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. భారతీయ సంస్కృతిని మనం భావి తరవాలకు అందించాలని తెలిపారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టులో దసరా వేడుకలకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉపాధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణభారత్ ట్రస్టుకు చెందిన దీపావెంకట్ తదితరులు పాల్గొన్నారు.