'మహిళలకు చేయూతనిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారు'
నెల్లూరు: మహిళలకు చేయూతనిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. నెల్లూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ...ఒలింపిక్స్లో సింధు సాధించిన ఘనతే ఇందుకు నిదర్శనమన్నారు.
ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు, కోచ్ గోపీచంద్లను స్వర్ణ భారత్ ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, ధర్మేంద్ర ప్రధాన్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఏపీలో పెట్రోలియం యూనివర్సిటీకి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. పెట్రో ఉత్పత్తుల కాంప్లెక్స్ను నెలకొల్పుతామని ఆయన వెల్లడించారు.