Swarna Bharat Trust
-
స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలి
ఉంగుటూరు (గన్నవరం): భారత స్వరాజ్యం కోసం ఎందరో మహానుభావులు చేసిన ఆత్మత్యాగాలను తెలుసుకోవడంతోపాటు, స్వాతంత్య్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్లో శ్రీవాణి మాసపత్రిక ప్రత్యేక సంచికను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతమహోత్సవ్ నేపథ్యంలో స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన 75 మంది జీవితగాథలతో రూపొందించిన శ్రీవాణి సాంస్కృతిక మాసపత్రిక ప్రత్యేక సంచికను ఆవిష్కరిచడం ఆనందంగా ఉందన్నారు. సినీనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ శ్రీవాణి సాంస్కృతిక మాసపత్రిక ఇలాంటి పుస్తకం ఆవిష్కరిచండం శుభపరిణామమన్నారు. రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్షీప్రసాద్, సత్యసాయిబాబా సేవాసంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.లక్ష్మణ్‌రావు, సినీగేయ రచయిత భువనచంద్ర శ్రీవాణి మాసపత్రిక సంపాదకురాలు కొమరగిరి జయప్రద, సహ సంపాదకుడు శ్యామ్‌ప్రసాద్ పాల్గొన్నారు. -
ప్రతిభకే 'పద్మ' పురస్కారాలు
సాక్షి, నెల్లూరు: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారి ప్రతిభ, సేవల కొలమానంగానే కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చెప్పారు. ఇటీవల సినీనటి కంగనాకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వడంపై పలు రాజకీయపార్టీల నేతలు చేసిన ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. గతంలో కేంద్రం ఇచ్చే అత్యున్నత పురస్కారాలకు ఎంపిక రాజకీయ సిఫార్సుల మేరకు జరిగేదన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఈ ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఆదివారం జరిగిన స్వర్ణభారత్ ట్రస్ట్ 20వ వసంతోత్సవాల్లో ఆయన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖనే ఎన్నుకుని సేవలందించిన వెంకయ్యనాయుడిది గొప్ప వ్యక్తిత్వమని చెప్పారు. ఆస్తిలో సగభాగం కూతురికి ఇవ్వాలి: ఉప రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కుటుంబ ఆస్తిలో కుమారుడితో పాటు కుమార్తెకు సగభాగం రావాలని, అప్పుడే సాధికారత ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ భారత సాధికారతే ధ్యేయంగా స్థాపించిన స్వర్ణభారత్ ట్రస్ట్ రెండు దశాబ్దాల సేవాప్రస్థానాన్ని పూర్తిచేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయ నాయకుల నడవడిక విలువలతో ఉండాలని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి తులసి మొక్కలు నాటారు. స్వర్ణభారత్ ట్రస్ట్ రూపొందించిన సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్‌చక్రవర్తి, వాకాటి నారాయణరెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యాత్ర సినిమా చూశా: వెంకయ్య నాయుడు
సాక్షి, నెల్లూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ చిత్రాన్ని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. శనివారం ఆయన నెల్లూరులో స్వర్ణభారతి ట్రస్ట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఈ మధ్యకాలంలో ‘యాత్ర’ సినిమా చూశా.. చాలా బాగుంది. రైతులు, సంస్కృతి, సంప్రదయాలన్నా నాకు ప్రాణం. మనం చేసే మంచి పనులే మన తరువాత మనలను గుర్తుపెట్టుకునేలా చేస్తాయి.’ అని వెంకయ్య అన్నారు. ఏ హోదాలో ఉన్నా సొంత గ్రామాన్ని మరచిపోనని, ఎవరి పని వారు చేయడమే దేశభక్తి అని ఆయన పేర్కొన్నారు. ప్రజా జీవనంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అనేది తన భావన అని, కానీ తన పదవి, భద్రత, హోదాకు భంగం కలగకుండా ప్రవర్తిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మెలిసి ఉండే తత్వం తనదని చెప్పారు. మాతృభాష పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలన్నారు. భాషా ప్రగతికి తీసుకోవాల్సిన చర్యలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలలో పర్యటిస్తూ విద్యార్థులకు మార్గదర్శకాలు చెపుతున్నట్లు వెంకయ్య పేర్కొన్నారు. ఉత్తర భారతదేశం వాళ్లు దక్షిణ, దక్షిణాది వాళ్లు ఉత్తరదేశ భాషలు నేర్చుకుంటే దేశ సమైక్యత బలపడుతుందని ఉప రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. -
సమాజ సేవ ప్రతి ఒక్కరి బాధ్యత
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సమాజ సేవను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని పనిచేయాలని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. మన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన సమాజానికి తిరిగి సేవ చేయాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని సూచించారు. తద్వారా సమాజంలోని పేద విద్యార్థులకు, ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నెల్లూరు నగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న రామ్‌నాథ్ కోవింద్, సవితా కోవింద్ దంపతులకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ స్వాగతం పలికారు. గవర్నర్‌తోపాటు రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఉన్నారు. ఆనంతరం అక్కడి నుంచి రాష్ట్రపతి దంపతులు నగరంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడి నివాసానికి చేరుకున్నారు. అక్కడ అల్పాహారం ముగించిన తర్వాత వెంకటాచలం మండలంలోని అక్షర స్కూల్‌కు చేరుకున్నారు. అక్కడ ఎర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్కూల్‌ను పరిశీలించారు. అక్కడి నుంచి స్వర్ణభారత్ ట్రస్ట్‌కు చేరుకొని అక్కడ మొక్క నాటారు. ట్రస్ట్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో రామ్‌నాథ్ కోవింద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ట్రస్ట్ ఎండీ, వెంకయ్య నాయుడి కుమార్తె దీపా వెంకట్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రధానంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో శిక్షణ, ఉపాధి కార్యక్రమాలను అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సంస్కృతి గురించి బాగా చెప్పే వ్యక్తి వెంకయ్య సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెంకయ్య నాయుడు అజాత శత్రువు, రాజ్యసభ చైర్మన్‌గా ఏంతో సమర్థవంతంగా సభను నిర్వహిస్తున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. తనకు ఢిల్లీలో వెంకయ్య నాయుడు ఆంధ్రా వంటకాలను రుచి చూపించారని, అలాగే తెలుగు సంస్కృతి గురించి ఢిల్లీలో బాగా చెప్పే వ్యక్తి అని అన్నారు. వెంకయ్యకు సేవా కార్యక్రమాల్లో స్ఫూర్తి అయిన భారతరత్న నానాజీ దేశ్‌ముఖ్ ట్రస్ట్‌ను గత నెలలోనే తాను సందర్శించానని, మళ్లీ ఇప్పుడు అలాంటి ట్రస్ట్ అయిన స్వర్ణభారత్‌ను సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... ఢిల్లీలో మినహా మిగిలిన దేశంలో ఎక్కడా భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దంపతులు కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొనలేదని, అలాంటి అరుదైన అవకాశం స్వర్ణభారత్ ట్రస్ట్‌కు దక్కిందని చెప్పారు. ట్రస్ట్‌ను ఆశీర్వదించడానికి వచ్చిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సేవ చేయడం తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. అందుకే స్నేహితుల సహకారంతో 18 ఏళ్ల క్రితం మొదలైన ట్రస్ట్ నేడు నెల్లూరుతోపాటు అమరావతి, హైదరాబాద్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తోందన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం ట్రస్ట్ కృషి చేస్తోందని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ వారివారి ప్రాంతాల్లో స్వర్ణభారత్ ట్రస్ట్ తరహాలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సతీమణి ఉషా నాయుడు, రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, ట్రస్ట్ చైర్మన్ కె.విష్ణురాజు తదితరులు పాల్గొన్నారు. -
అన్నం పెట్టే చేతికి ఊతమివ్వండి
సాక్షి, అమరావతి/ఆత్కూరు (గన్నవరం): అన్నం పెట్టే చేతులకు ఊతమివ్వాలే తప్ప రాజకీయాలు తగదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు. రాజకీయాలకు అతీతంగా వ్యవసాయం గురించి ఆలోచించాలని అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగ నిపుణుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన ’ఆరుగాలం’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం విజయవాడలో జరిగింది. డాక్టర్ చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ రైతుకు శాశ్వత న్యాయం జరగాలంటే మౌలిక వసతులు కల్పించాలే తప్ప రుణమాఫీ వంటి ఉపశమన చర్యలు పరిష్కారమార్గం కాదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విస్మరణకు గురైన రంగం వ్యవసాయమేనని, దాన్ని ప్రస్తుతం సవరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రైతు దృక్పథంలోనూ మార్పు రావాలని, అదనపు విలువ జోడింపు, ఆహార శుద్ధి, పంటల మార్పిడి, ఈ–నామ్ వంటి వాటిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. నూటికి 40 శాతం మందికే వ్యవస్థాగత రుణ సౌకర్యం లభిస్తోందని, మిగతా 60 శాతం మంది ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారని, పంటల బీమా రంగంలోనూ మార్పులు రావాల్సి ఉందన్నారు. సాగుతో పాటు పాడి, కోళ్ల పెంపకం వంటి అనుబంధ రంగాలపైనా దృష్టి పెడితే 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పుస్తక రచయిత యలమంచిలి శివాజీని ఘనంగా సత్కరించారు. పుస్తకం ప్రచురించిన రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై.వెంకటేశ్వరరావు రైతులకు చేస్తున్న సేవను కొనియాడారు. అనంతరం నిర్వాహకులు ఉపరాష్ట్రపతిని ఘనంగా సన్మానించారు. మంత్రి కొల్లు రవీంద్ర, వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు హాజరయ్యారు. స్వర్ణభారత్ ట్రస్ట్‌లో పుస్తకావిష్కరణ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో పోలూరు హనుమజ్జానకీరామశాస్త్రి రచించిన జీవితం–సాహిత్యం సంకలన పుస్తకాన్ని ఆదివారం ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ పాశ్చాత్య పోకడల వలన కొన్ని అపశృతులు చోటు చేసుకుంటున్నాయన్నారు. యువత వీటి బారిన పడకుండా మన జీవన విధానాన్ని కొనసాగించాలన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్‌లో స్కిల్‌డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో ప్రాథమిక శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన కేఎల్ వర్సిటీని అభినందించారు. -
చదువు కంటే నైపుణ్యమే ప్రధానం
⇒ కేంద్ర సహాయ మంత్రి రాజీవ్‌ప్రతాప్ రూడీ ⇒ ‘స్వర్ణ భారత్ ట్రస్టు’లో నైపుణ్య శిక్షణ తరగతులు షురూ హైదరాబాద్: ఉపాధి, ఉద్యోగ రంగాల్లో రాణించేందుకు చదువు కంటే కూడా నైపుణ్యం ఎంతో ప్రధానమని, యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర నైపుణ్య, వికాస శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ప్రతాప్ రూడీ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ముచ్చింతల్ సమీపంలో ఏర్పాటు చేసిన ‘స్వర్ణ భారత్ ట్రస్టు’ హైదరాబాద్ చాప్టర్ భవన సముదాయంలో నైపుణ్య శిక్షణ తరగతులను ఆయన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రూడీ మాట్లాడుతూ.. నైపుణ్యంలేని కారణంగా దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలను మన యువత అందుకో లేకపోతోందన్నారు. దేశంలో నైపుణ్యమున్న డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉందన్నారు. పది, పన్నెండేళ్లు చదువుకున్నా దొరకని ఉపాధి, ఉద్యోగావకాశాలను పది వారాల్లో నేర్చుకున్న నైపుణ్య శిక్షణ ద్వారా అందిపుచ్చుకో వచ్చన్నారు. మన విద్యావిధానంలో ఈ దిశగా మార్పులు తేవడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. స్వర్ణ భారత్ ట్రస్టు సేవలు అభినందనీయమని ఆయన కొనియా డారు. ప్రతి రాజకీయ నేత ఇలాంటి సామా జిక సేవా దృక్పథంతో పని చేస్తే దేశానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. సమా జానికి మనం ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. దేశం లో యువత తెలివికి కొదవలేదని, వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తా రని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అసమాన ప్రతిభ గల సామా న్యులను గుర్తించి కేంద్రం పద్మ పురస్కా రాలను అందజేయడం విశేషమని ఆయన ప్రశంసించారు. -
రాజకీయాలకు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో స్థానం లేదు
-
రాష్ట్రంలో స్వర్ణభారత్ ట్రస్ట్
ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ హైదరాబాద్: గ్రామీణ భారత సాధికారతే లక్ష్యంగా 15 ఏళ్లుగా స్వచ్ఛంద సేవా రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థ స్వర్ణభారత్ ట్రస్ట్ తెలంగాణలో కార్యకలాపాలను ప్రారంభించనుంది. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ గ్రామంలో ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్‌ను సోమవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ముఖ్య అతిథిగా, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ విశిష్ట అతిథిగా, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు ఆత్మీయ అతిథిగా హాజరుకానున్నారు. గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరిచి విద్య, వైద్య సేవలు కల్పించడంతో పాటు ప్రతిభ, నైపుణ్య, స్వయం ఉపాధి, సాంకేతిక రంగాల్లో శిక్షణ అందించాలనే లక్ష్యంతో దశాబ్దంన్నర కిందట నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం గ్రామంలో స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యకలాపాలను ప్రారంభించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్ఫూర్తిగా ఆయన కుమార్తె దీపావెంకట్ నెలకొల్పిన ఈ ట్రస్ట్.. విజయవాడ చాప్టర్‌ను గతేడాది కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. -
మానసిక వికలాంగుల కేంద్రానికి చేయూత
స్వర్ణభారత్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ.దీపావెంకట్ వెంకటాచలం : మానసిక వికలాంగుల కేంద్రానికి స్వర్ణభారత్ ట్రస్ట్ చేయూతనిస్తుందని ఆ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ.దీపావెంకట్ అన్నారు. దీపావెంకట్ కుమారుడు విష్ణు జన్మదినం సందర్భంగా వెంకటాచలంలోని సెయింట్ జ్యూడ్స్ మానసిక వికలాంగుల కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. రూ.25వేల విలువ చేసే ఇన్వర్టర్ను, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు కేంద్రానికి బహూకరించారు. మానసిక వికలాంగులకు అరటి పండ్లు, తినుబండరాలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ స్వర్ణభారత్ ట్రస్ట్ పక్కనే ఉన్న మానసిక వికలాంగుల కేంద్రంలో నా కుమారుడు విష్ణు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మానసిక వికలాంగుల కేంద్రానికి స్వర్ణభారత్ ట్రస్ట్ తరపున చేయూత నిస్తామని తెలియజేశారు. స్వర్ణభారత్ ట్రస్ట్ డైరెక్టర్ కోటేశ్వరరావు, కోఆర్డినేటర్ జనార్దన్‌రాజు, బీజేపీ ఎస్సీసెల్ రాష్ట్ర నాయకులు ఆరుముళ్ల మురళి పాల్గొన్నారు. -
స్వర్ణభారత్ సేవలు ఆనందదాయకం
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెంకటాచలం : పదవులున్నా లేకున్నా స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సామాజిక సేవలు ఆనందదాయకమని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మండలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య, ఉపాధి శిక్షణ రంగాల్లో సేవలందించడం మహానందాన్ని కలుగజేస్తాయన్నారు. ఎంత బిజీగా ఉన్నా.. టెన్షన్లో ఉన్నా స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఒక్కరోజు గడిపితే నూతన ఉత్సాహం వస్తుందన్నారు. ప్రభుత్వంలో ఉండి సేవ చేస్తే కేవలం ఆనందం మాత్రమే కలుగుతుందన్నారు. ప్రభుత్వాలు అన్నీ పనులు చేయలేవని, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు సామాజిక చింతన ఉన్న వ్యక్తులు సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఇంకా 24 శాతం దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నారన్నారు. ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో భారత్‌ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న కృషికి అందరూ భాగస్తులు కావాలని పిలుపునిచ్చారు. స్వర్ణభారత్ లాంటి స్వచ్ఛందసేవా సంస్థలను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు ఆసక్తి చూపాలని కోరారు. కన్నతల్లిని, జన్మభూమిని ఎప్పటికీ మరచిపోకూడదన్నారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ భేటీ బచావో..(ఆడ పిల్లలను రక్షించు) భేటీ పడావో.. (ఆడ పిల్లలను చదివించు) అనే నినాదాలతో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నామని, ఇప్పుడు భేటీ బడావో..(ఆడ పిల్లలను పెంచు) నినాదాలను ఆచరణలో చూపాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు నిదర్శనం దీపా వెంకట్, రజత విజేత పీవీ సింధూ అని తెలిపారు. సమగ్ర అభివృద్ధికి వెంకయ్యనాయుడు దూరదృష్టి స్ఫూర్తిదాయకమన్నారు. పెట్రోలియం సహజవనరులశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కృష్ణ గోదావరి బేసిన్లో అపారమైన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయన్నారు. ఆయిల్ రీఫైనరీ విస్తరణ, పెట్రో మెడికల్ క్యాంపస్, పెట్రోలియం యూనివర్సిటీ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. బాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్, ఒలంపిక్ రజత పతక విజేత సింధూలు స్వర్ణభారత్ ట్రస్ట్ సేవలను కొనియాడారు. తొలుత ట్రస్ట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న బ్రిడ్జి స్కూల్, రైతు శిక్షణ కేంద్రం, వివిధ ఉపాధి శిక్షణ కోర్సులను అతిథులకు మంత్రి వెంకయ్యనాయుడు వివరించారు. 15వ వార్షికోత్సవ సావనీర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయ విద్యార్థులు ప్రదర్శించిన దక్షణ భారతదేశ సంస్కృతి, కళల నృత్యరూపకాలు అలరించాయి. అతిథులకు ట్రస్ట్ నిర్వాహకులు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్‌రావు, గోకరాజు గంగరాజు, కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్ ముత్యాలరాజు, ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, సభ్యులు అట్లూరి అశోక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
'మహిళలకు చేయూతనిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారు'
నెల్లూరు: మహిళలకు చేయూతనిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. నెల్లూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ...ఒలింపిక్స్‌లో సింధు సాధించిన ఘనతే ఇందుకు నిదర్శనమన్నారు. ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు, కోచ్ గోపీచంద్‌లను స్వర్ణ భారత్ ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, ధర్మేంద్ర ప్రధాన్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఏపీలో పెట్రోలియం యూనివర్సిటీకి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. పెట్రో ఉత్పత్తుల కాంప్లెక్స్‌ను నెలకొల్పుతామని ఆయన వెల్లడించారు. -
4న లోక్‌సభ స్పీకర్ జిల్లా పర్యటన
నెల్లూరు(పొగతోట) : లోక్‌సభ స్పీకర్ సుమిత్రమహాజన్ ఈ నెల 4వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. 4న ఉదయం 6.20 గంటలకు ఇన్‌డోర్‌లో ప్రత్యేక విమానంలో బయలుదేరి 7.50 గంటలకు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. రేణిగుంట నుంచి హెలికాప్టర్లో ఉదయం 8.30 గంటలకు వెంకటాచలం చేరుకుంటారు. ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు అక్షర విద్యాలయం, స్వర్ణభారతి ట్రస్ట్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు హెలికాప్టర్లో రేణిగుంటకు బయలుదేరి వెళ్లతారు. మంత్రి ధర్మేంద్రప్రధాన్ జిల్లా పర్యటన పెట్రోలియం, సహాజ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ ఈ నెల 4వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. 4న ఉదయం చెన్నై నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 9 గంటలకు వెంకటాచలం చేరుకుంటారు. అక్షర విద్యాలయం, స్వర్ణభారతి ట్రస్ట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు శ్రీసిటీకి బయలుదేరివెళ్లతారు. -
స్వర్ణభారత్ సేవలు ప్రసంశనీయం
కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు వెంకటాచలం : గ్రామీణ ప్రజల కోసం స్వర్ణభార త్‌ట్రస్ట్ చేసే సేవలు ప్రసంశనీయమని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు అభినందించారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ట్రస్ట్, అక్షర విద్యాలయాన్ని కేంద్ర సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో కలిసి ఆదివారం సందర్శించారు. తొలుత స్వర్ణభారత్ ట్రస్ట్‌కు వెళ్లి అక్కడ బ్రిడ్జిస్కూల్, రైతు శిక్షణ కేంద్రం, ఎల్వీప్రసాద్ కంటి వైద్యశాల, సైరెడ్‌లో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణను పరిశీలించారు. అనంతరం అక్షర విద్యాలయాన్ని సందర్శించారు. అక్కడ సోమా ఆధ్వర్యంలో యువతకు వత్తి నైపుణ్యతపై జరుగుతున్న శిక్షణ గురించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆయనకు వివరించారు. అనంతరం కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు విలేకరులతో మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు ప్రతిచోటా స్వర్ణభారత్ ట్రస్ట్ లాంటి స్వచ్ఛందసంస్థలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలకశాఖా మంత్రి పి.నారాయణ, నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. రైతుల సమస్యకు పరిష్కారం చూపాలి: రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని మండలంలోని చవటపాళెం గ్రామ రైతులు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కోరారు. వెంకటాచలం మండలం అక్షర విద్యాలయానికి వచ్చిన వెంకయ్యనాయుడును చవటపాళెం రైతులు కలిసి మాట్లాడారు. కష్ణపట్నం–ఓబులవారిపల్లెకు వెళ్లే రైల్వే మార్గంలో చవటపాళెం వద్ద చేపడుతున్న రైల్వే పనుల కారణంగా రైతులకు ఇబ్బందులు వస్తాయని తెలియజేశారు. స్పందించిన వెంకయ్యనాయుడు ఆర్డీఓ కాసా వెంకటేశ్వర్లు, రైల్వే అధికారులతో మాట్లాడారు. ఆ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
రాజధాని సమీపంలో ‘ఇకో నగరం’
♦ త్వరలో కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం: వెంకయ్యనాయుడు ♦ ‘స్వర్ణ భారత్ ట్రస్టు’ హైదరాబాద్ చాప్టర్‌కు భూమి పూజ శంషాబాద్ రూరల్: హైదరాబాద్ సమీపంలో ‘ఇకో నగరం’ ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో ‘స్వర్ణ భారత్ ట్రస్టు’ హైదరాబాద్ చాప్టర్‌కు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ‘ఇకో నగరం (పర్యావరణహిత నగరం)’ ఏర్పాటుకు యోచిస్తున్నట్లు వెంకయ్యనాయుడు చెప్పారు. ఇక్కడ ఉన్న పురాతన భవనాలను తొలగించి ఆకాశ హర్మ్యాలు నిర్మించడమా, నగరానికి దూరంలో ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసి కాలుష్యరహిత నగరంగా ఏర్పాటు చేయడమా అనే దానిపై సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నగరాల నిర్మాణంలో విదేశీ నమూనాలను అనుసరించకుండా, అక్కడి సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకోవాలన్నారు. సమాజ సేవలో భాగస్వాములు కావాలి ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని వెంకయ్యనాయుడు సూచించారు. ‘స్వర్ణ భారతి ట్రస్టు’ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత యువత, మహిళలకు స్వయం ఉపాధి కల్పనకు వీలుగా వృత్తి నైపుణ్యం, కంప్యూటర్ శిక్షణ, రైతులకు వ్యవసాయ సాగులో శిక్షణ ఇస్తామన్నారు. హైదరాబాద్‌లో ఫార్మా రంగం లో అధికంగా ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ట్రస్టు ఆధ్వర్యంలో ఫార్మా పాఠశాల ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తామన్నారు. స్వర్ణ భారత్ ట్రస్టుకు మైహోం సంస్థ తరఫున జూపల్లి రామేశ్వర్రావు ఆరున్నర ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇవ్వగా, వెంకయ్యనాయుడు కుమార్తె గీత ట్రస్టు వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ‘అమృత్’లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని ‘అమృత్’ పథకంలో చేర్చుతున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఇక్కడ జనాభా తక్కువగా ఉన్నప్పటికీ భవిష్య త్ అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను అమలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఏపీ ప్రజలు ఆశించిన దాని కంటే ఎక్కువగానే కేంద్రం నుంచి సహాయం అందిస్తామని... విభజన తర్వాత జరిగిన అన్యాయం, నష్టాన్ని సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నామని పేర్కొన్నారు. అభివృద్ధి కేవలం ప్యాకేజీలతో అయిపోదని, కేంద్రానికి ఉన్న పరిమితులకు లోబడి నిరంతర ప్రక్రియతో ఏపీకి సహకారం అందిస్తామని చెప్పారు. తెలంగాణ, ఏపీ సీఎంలు ఇరుగు పొరుగు వారిలా కాకుండా, అన్నదమ్ముల్లా కలసి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. -
కౌశల్ భారత్ నిర్మాణమే మోదీ ధ్యేయం
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెంకటాచలం : యువతలో దాగి ఉన్న తెలివి తేటలను వెలికితీసి కౌశల్ భారతంగా తీర్చిదిద్దడమే ప్రధాని నరేంద్రమోదీ ధ్యేయమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రజామందిరంలో శనివారం జరిగిన ప్రతిభ పుర స్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో లేని సంపద మన దేశంలో ఉందని, అది మరుగునపడిన నేపథ్యంలో మేల్కొల్పేందుకు వృత్తి నైపుణ్య శాఖను ఏర్పాటు చేశారని, దీనికి మంత్రిగా రాజీవ్ ప్రతాప్ రూడీ వ్యవహరిస్తున్నారని చెప్పారు. భారతదేశ వారసత్వ సంపద యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా ఐక్యరాజసమితిలో 174 దేశాలు ఏకతాటిపైన మోదీకి మద్దతు పలికాయని, ఇందులో ముస్లిం దేశాలూ ఉన్నాయని చెప్పారు. దేశంలో 25 నుంచి 45 ఏళ్లలోపు వారు 60 శాతం మంది ఉన్నారని, వీరిని ఒక శక్తిగా తీర్చిదిద్దేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తెలివి కలిగి ఉంటే ప్రశంసలు అందుతాయని స్వర్ణభారత్ ట్రస్ట్, ముప్పవరపు ఫౌండేషన్ నిరూపించాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ప్రతిభ కనుబర్చిన 87 మంది విద్యార్థులకు రూ.2500, మెమెంటో, జ్ఞాపికలను స్వర్ణభారత్ ట్రస్ట్ అందజేయడం అభినందనీయమని కొనియాడారు. బీవీ రాజు, స్వర్ణభారత్ ట్రస్ట్ సంయుక్తంగా వృతి ్త నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఈ ప్రాంత యువతకు ఉపయోగకరమన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ గుర్తింపుతో ఇకపై సర్టిఫికెట్లను అందజేస్తారని, వీటికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందని చెప్పారు. కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ, మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్, కలెక్టర్ జానకీ, స్వర్ణభారత్ ట్రస్టీ హరికుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. దేశప్రగతికి బాటలు వెంకటాచలం: దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బాటలు వేస్తున్నారని కేంద్ర నైపుణాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ పేర్కొన్నారు. వెంకటాచలం మండల పరిధిలోని సరస్వతీనగర్‌లో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రానికి శనివారం భూమి పూజ చేసిన అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరిగిన ప్రతిభ పురస్కారాల్లో ఆయన మాట్లాడారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మూడు శాతం మాత్రమే స్వయం ఉపాధితో జీవిస్తున్నారని, మన దేశంలోనే కాక ప్రపంచ దేశాల్లోనూ వృత్తి విద్యా కోర్సులకు మంచి డిమాండ్ ఉందన్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి వృత్తి విద్యను ప్రోత్సహిస్తూ, రాబోయే ఐదేళ్లలో దేశంలో 30 కోట్ల మందికి ఈ విద్యను అందించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. దీనికి కోసం రూ.లక్షల కోట్లను ఖర్చు చేయనుందని వెల్లడించారు. అనంతరం పురపాలక మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యను అందించేందుకు ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్వర్ణభారత్ ట్రస్ట్‌లో పురస్కారం అందుకున్న 87 మంది విద్యార్థులకు తమ నారాయణ సంస్థల ద్వారా ఇంటర్మీడియట్ చదువును ఉచితంగా అందజేస్తానని ప్రకటించారు. మంత్రి నారాయణను వెంకయ్యనాయుడు అభినందించారు. -
సంక్రాంతి సంబరం
వెంకటాచలం : స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకటాచలంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు వేడుకగా సాగారుు. మొదట నిర్వహించిన పాడుతా తీయగా పాటకచేరి అందరికీ వీనులవిందు చేసింది. చవటపాళెం పాండురంగ భక్తసమాజం ప్రదర్శించిన పండరి భజన సంస్కృతి, సంప్రదాయూలకు ప్రతీకగా నిలిచింది. ఎల్లా వెంకటేశ్వర్లు బృందం మృదంగవారుుద్యం అలరించింది. ముగ్గుల పోటీల్లో భాగంగా మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులు అతిథులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నారుు. మధ్యాహ్నం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగారుు. సెరైడ్లో ఉపాధి కోర్సులు పూర్తి చేసిన వారికి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ సర్టిఫికెట్లు అందజేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి డి.జి.ఫడ్నవీస్, సినీనటుడు పవన్‌కల్యాణ్ మొదట అక్షర విద్యాలయూన్ని సందర్శించారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరుగుతున్న వివిధ సేవా కార్యక్రమాలను పరిశీలించారు. బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని బ్రిడ్జి స్కూలు విద్యార్థులకు సూచించారు. కార్యక్రమాల్లో తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, వైజాగ్ ఎంపీ హరిబాబు స్వర్ణభారత ట్రస్టీలు మాగంటి రాజేంద్రప్రసాద్, చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు పవన్‌కల్యాణ్ అభిమానుల ఈలలు, కేకలతో స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రాంగణం మార్మోగింది. -
ప్రపంచమంతా ఇటే చూస్తోంది: వెంకయ్య
ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. భారతీయ సంస్కృతిని మనం భావి తరవాలకు అందించాలని తెలిపారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టులో దసరా వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉపాధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణభారత్ ట్రస్టుకు చెందిన దీపావెంకట్ తదితరులు పాల్గొన్నారు.