చదువు కంటే నైపుణ్యమే ప్రధానం | Skills priority is more than Education | Sakshi
Sakshi News home page

చదువు కంటే నైపుణ్యమే ప్రధానం

Published Mon, Feb 20 2017 2:38 AM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

చదువు కంటే నైపుణ్యమే ప్రధానం

చదువు కంటే నైపుణ్యమే ప్రధానం

కేంద్ర సహాయ మంత్రి రాజీవ్‌ప్రతాప్‌ రూడీ
‘స్వర్ణ భారత్‌ ట్రస్టు’లో నైపుణ్య శిక్షణ తరగతులు షురూ


హైదరాబాద్‌: ఉపాధి, ఉద్యోగ రంగాల్లో రాణించేందుకు చదువు కంటే కూడా నైపుణ్యం ఎంతో ప్రధానమని, యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర నైపుణ్య, వికాస శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ప్రతాప్‌ రూడీ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ముచ్చింతల్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ‘స్వర్ణ భారత్‌ ట్రస్టు’ హైదరాబాద్‌ చాప్టర్‌ భవన సముదాయంలో నైపుణ్య శిక్షణ తరగతులను ఆయన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రూడీ మాట్లాడుతూ.. నైపుణ్యంలేని కారణంగా దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలను మన యువత అందుకో లేకపోతోందన్నారు. దేశంలో నైపుణ్యమున్న డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉందన్నారు.

పది, పన్నెండేళ్లు చదువుకున్నా దొరకని ఉపాధి, ఉద్యోగావకాశాలను పది వారాల్లో నేర్చుకున్న నైపుణ్య శిక్షణ ద్వారా అందిపుచ్చుకో వచ్చన్నారు. మన విద్యావిధానంలో ఈ దిశగా మార్పులు తేవడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. స్వర్ణ భారత్‌ ట్రస్టు సేవలు అభినందనీయమని ఆయన కొనియా డారు. ప్రతి రాజకీయ నేత ఇలాంటి సామా జిక సేవా దృక్పథంతో పని చేస్తే దేశానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. సమా జానికి మనం ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. దేశం లో యువత తెలివికి కొదవలేదని, వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తా రని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అసమాన ప్రతిభ గల సామా న్యులను గుర్తించి కేంద్రం పద్మ పురస్కా రాలను అందజేయడం విశేషమని ఆయన ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement